
దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళ అమలవుతున్న కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు గురువారం అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అదేవిధంగా, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితిని పెంచింది.
జొహన్నెస్‌బర్గ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మొదటిసారిగా బయటపడిన దక్షిణాఫ్రికాలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తొలగించింది. దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళ అమలవుతున్న కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు గురువారం అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
అదేవిధంగా, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితిని పెంచింది. కరోనా నాలుగో వేవ్ తీవ్రత నుంచి దేశం బయటపడినట్లేనని పేర్కొంది. అయితే, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 35 లక్షల మంది కరోనా బారిన పడగా 90వేల మంది చనిపోయారు.