న్యూఢిల్లీ: ఒమిక్రాన్ విజృంభణతో ఢిల్లీ అప్రమత్తమైంది. దేశ రాజధానిలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలుచేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటిదాకా ఆంక్షలు అమల్లో ఉంటాయి. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ప్రకటించారు. డిసెంబరు 28 నుంచి 10 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదింటిదాకా కర్ఫ్యూను అమలు చేస్తారు. నూతన సంవత్సర వేడుకలు, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటాన్ని నిషేధించారు. మధ్యప్రదేశ్‌లో 23నుంచే నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. యూపీలో 25 నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
(చదవండి: ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్తివేత పరిశీలనకు కమిటీ)
Night Curfew In Delhi: అప్రమత్తమైన ఢిల్లీ.. రాత్రి 11 నుంచి 5 వరకు కర్ఫ్యూ
Published Mon, Dec 27 2021 6:23 AM | Last Updated on Mon, Dec 27 2021 8:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment