సాక్షి, చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. మధురై సమీపంలోని కల్మేడు గ్రామంలోని ఓ కుటుంబం కరోనా వైరస్ భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యుల్లో ఒకరైన లక్ష్మి భర్తతోపాటు ఆమె కూతురు అనారోగ్య కారణాలతో గతేడాది చనిపోయారు. అయితే, వారి చావుకు కారణం కోవిడ్ కావచ్చొని మిగతా సభ్యులు ఆందోళనకు గురయ్యాయి.
చదవండి: Birthday Party Of Pet Dog: ఏకంగా రూ. 7 లక్షలతో కుక్క పుట్టిన రోజు చేసి జైలు పాలయ్యారు!
ఈక్రమంలోనే కుటుంబంలోని మరో వ్యక్తి జ్యోతిక గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో ఇబ్బందులు పడుతోంది. ఆమెకు కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జ్యోతిక నుంచి తమకు వైరస్ సోకుతుందేమోనని కుటుంబ సభ్యులు మరింత ఆందోళన గురయ్యారు. ఆదివారం ఉదయం జ్యోతికతోపాటు కుటుంబ సభ్యులంతా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment