సాక్షి, న్యూఢిల్లీ: కంటైన్‌మెంట్, రెడ్‌జోన్ ప్రాంతాల్లో మే 3 తరువాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సడలింపులు ఉన్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. (మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్‌న్యూస్’)
కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడని, మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైల్వే సేవలు ప్రారంభించకూడదని కిషన్‌రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలు అయినా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకుపోవచ్చని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి చర్చలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. లక్షలాది మంది ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. (రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్)
ఆర్థికవృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే గ్రీన్జోన్ ప్రాంతాల్లో, గ్రామస్థాయిలో సడలింపులిచ్చామని అన్నారు. కరోనా వైరస్ అడ్డుకునేందుకు అన్ని దేశాలు పోరాడుతూ వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు మొదలుపెట్టాయని ఆయన చెప్పారు. ప్రజల ప్రాణాలకే మొదటి ప్రాధాన్యత, దానికోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. (హెచ్-1 బీ: జూన్ నాటికి ముగుస్తున్న గడువు!)
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్ని రాష్ట్రాలు రెండో విడత సహాయం తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ పథకం కింద రూ. 2,719 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. రాష్ట్రనికి 27,500 పీపీఈ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. 105053 ఎన్95 మాస్కులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చామని ఆయన తెలిపారు. కరోనా లాబ్స్ ప్రభుత్వనివి ఎనిమిదని, ప్రైవేటుకు చెందిన 12 లాబ్స్‌కి అనుమతులు ఇచ్చామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment