సాక్షి, న్యూఢిల్లీ : నాలుగో విడత లాక్‌డౌన్‌లో భారీ సడలింపులకు ఢిల్లీ సర్కార్ సంసిద్ధమవుతోంది. ఈనెల 17తో లాక్‌డౌన్ ముగుస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పలు సడలింపులను ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక పంపామని ఢిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాల్స్, మెట్రో రైళ్లు, ట్యాక్సీ సేవలను అనుమతించాలని నిర్ణయించామని తెలిపారు. బస్సులు, మెట్రోల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణీకులను అనుమతిస్తామని చెప్పారు. 25 నుంచి 50 శాతం వరకూ మాల్స్‌ను తెరిచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. కాగా అద్దెదారు నుంచి లాక్‌డౌన్ సమయంలో రెంట్‌ను డిమాండ్ చేసిన ఇంటి యజమానిపై షదారా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి యజమానులు అద్దెదారులను మూడు నెలల పాటు అద్దె కోసం ఒత్తిడిచేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!
Comments
Please login to add a commentAdd a comment