relaxation
-
ఒదిగితేనే ఎదుగుదల
ఉరుకులు పరుగులతో ఉరవడిగా వచ్చి తనని చేరిన నదిని సముద్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ‘‘నీ ప్రవాహ వేగానికి మహావృక్షాలు విరిగి పడిపోతూ ఉంటాయి. ప్రబ్బలి మొక్కలు అలాగే ఉంటాయి. వాటిని నువ్వు ఏమీ చేయవా?’’ అని. నది ఈవిధంగా సమాధానం చెపుతుంది. ‘‘ప్రబ్బలి మొక్కలు వేగంగా ప్రవాహం వస్తుంటే ఎదురు నిలవక తలవంచి ఉంటాయి. ప్రవాహ వేగం తగ్గగానే యథాప్రకారం తలెత్తుతాయి. మహావృక్షాలు తలవంచవు’’ అని!నది చెప్పినది వృక్షాలకి సంబంధించినదే అయినా మనకి కూడా వర్తిస్తుంది. ఎగిరెగిరి పడినా, ఎదిరించి నిలిచినా, ఎదురొడ్డి నిలిచినా విరిగి పడటం జరుగుతుంది. పొగరు బోతు గొర్రె పొటేలు కొండని గెలవగలనని కుమ్మి తల చిట్లి నశించినట్టు అవుతుంది. తమకి శక్తి లేక పోయినా అహంకారంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేసి దెబ్బతింటూ ఉంటారు మహావృక్షాల వంటి వారు. పైగా తమ నీడలో మరి ఏ మొక్కకి కూడా పెరిగే అవకాశం ఇవ్వరు. దానితో ఆపదలో ఆదుకునే వారు, తోడ్పడేవారు ఉండక కూలిపోక తప్పదు. తల ఎగరేసి, తల పొగరుతో ఉండక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలవంచటం, పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు తలెత్తటం చేస్తారు తెలివిగలవారు గడ్డిపోచల లాగా. పెరుగుతున్న మొక్కకి ఏదైనా అడ్డు వస్తే, కొన్ని పక్కకి వంగి వెలుగు వచ్చే దారి చూసుకుని ఎదుగుతాయి. నిటారుగా మాత్రమే ఎదుగుతాము, వంగము అనుకున్న మొక్కలు గిడసబారతాయి. సముద్రంలో స్నానం చేయటానికి గాని, ఈత కొట్టటానికి గాని వెళ్ళేవారు అలకి అనుకూలంగా వెడతారు. అలతో పాటు లేచి పడతారు. అలకి వ్యతిరేక దిశగా ఈత కొడితే జరిగే అనర్థాలు అందరికీ తెలుసు. నదుల్లోనూ, కాలవల్లోనూ ఈతకి వెళ్ళేవారు ప్రవాహం ఎటువైపు ఉంటే అటే వెడతారు. వ్యతిరేక దిశలో వెడితే అది ఎదురీత. పడవలు కూడా ప్రవాహం వెళ్ళే దిశలో వేగంగా వెడతాయి. వ్యతిరేక దిశలో ప్రయాణం శ్రమతో కూడుకొని ఉంటుంది. పరిస్థితులని గమనించకుండా ఉండే ఈ ప్రవర్తనకి మనిషిలో ఉండే అహంకారమే కారణం. నా అంతటి వారు లేరు అనే గుణం. నన్ను ఎదిరించగల వారు లేరు అనే పొగరు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తించలేని గుడ్డితనం. ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదిరిపాటుకి అంతూ దరీ ఉండవు. దీనినే ‘మదం’ అని కూడా అంటారు. విరగబాటుతనం ఉంటే ప్రవాహానికి ఎదురొడ్డిన మహావృక్షాల లాగా విరిగి పడటం తప్పదు. అంటే ఎప్పుడూ పరిస్థితులకి, అవతలి వారి ఇష్టానిష్టాలకి తల ఒగ్గి, వ్యక్తిత్వం అన్నది లేకుండా బతక వలసిందేనా? అన్న సందేహం రావటం సహజం. పరిస్థితులని మార్చగల శక్తిసామర్థ్యాలు ఉంటే మంచిదే. ఎప్పుడూ అట్లా ఉండటం అసంభవం. ప్రతికూలంగా ఉన్న సందర్భాలలో ఎట్లా ఉండాలి అన్నది కూడా తెలియాలి కదా! రోగాన్ని తగ్గించే అవకాశం లేకపోతే ఉపశమనం కలిగించాలి. అనుకూల వాతావరణం వచ్చేదాకా ఊరుకోవటం ఉత్తమం. ‘‘కొంచెముండు టెల్ల కొలది కాదు’’ అన్న వేమనని అనుసరించటం శ్రేయస్కరం. ఎదురీత నదిలోనే కాదు ఎక్కడైనా శ్రమతో కూడుకున్నదే. జీవితమనే ప్రవాహంలో కదిలే మనిషి అనుకూలమైన దిశలో సాగితే ప్రయాణం సుకరంగా ఉంటుంది. వ్యతిరేక దిశలో వెళ్ళటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. జీవితం సంఘర్షణ అవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రవాహం ముందుకి తోస్తుంటే, తాను వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అంగుళం కూడా కదలక ఉన్న చోటనే నిలిచి పోవలసి రావచ్చు, నిలదొక్కుకోలేక కూలబడవచ్చు. అప్పుడు ప్రవాహంలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. వీలు, వాలు చూసుకోవాలని పెద్దలు చెప్పేది అందుకే! -
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్స్టైల్లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్ తప్ప మరో ఎక్సైట్మెంట్ కరువైంది జీవితానికి. ఈ బోర్డమ్ను బ్రేక్ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్ జలపాతం. జలజల... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్.. అంటూ నేచర్ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి. ఇలా వెళ్లొచ్చు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. - వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి - రాయిల్కల్ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు - చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు. కొండల నడుమ వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది . ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు. ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 170 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: - జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది. - కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు - మద్యం తాగివెళ్లొద్దు. - ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. - జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. - కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. - ఫుడ్, వాటర్ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. టి. కృష్ణ గోవింద్, సాక్షి, వెబ్‌డెస్క్. -
ఏపీ: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు
సాక్షి, అమరావతి: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. -
Andhra Pradesh: 8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో జూలై 1 నుంచి వారం రోజుల పాటు కర్ఫ్యూ ఆంక్షలు సడలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అనంతపురం, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నందున ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, తదితరాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే సాయంత్రం 6 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ ఐదు జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ సడలింపులు జూలై 1 నుంచి 7 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులకు 104 వైద్య సేవలు కోవిడేతర కేసులకూ 104 ద్వారా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీజనల్ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్‌గా వ్యవహరించాలన్నారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులను నియమించామని, మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలని, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్ రెండూ ఉండేలా వ్యవహరించాలన్నారు. బాధితులకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కోవిడ్ బాధితులకు 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్ సైకాలజిస్ట్లతో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. సైకలాజికల్ కౌన్సిలింగ్ సమర్ధంగా ఉండాలని సీఎం సూచించారు. థర్ఢ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మూడు దఫాలు నిపుణులతో వెబినార్ నిర్వహించామని అధికారులు తెలిపారు. వెబినార్‌లో చర్చించిన అంశాలపై కొత్త వైద్యులకు కూడా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. టెలీమెడిసిన్ కూడా అందుబాటులో తెస్తున్నామని అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఆదివారం నాటికి కోవిడ్ ఇలా ► రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 44,773 ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 7,998 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,655 ► రికవరీ రేటు 96.95 శాతం ► పాజిటివిటీ రేటు 4.46 శాతం ► నెట్వర్క్ ఆస్పత్రులలో 93.62 శాతం బెడ్లలో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స ► 104 కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కాల్స్ 868 ► బ్లాక్ ఫంగస్ కేసులు 3,329 ► చికిత్స పొందుతున్నవారు 1,441 ► మృతి చెందినవారు 253 ► డిశ్చార్జ్ అయినవారు 1,635 -
ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
-
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పలు సూచనలు చేస్తూ శనివారం లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి సడలింపులు ఇవ్వాలని తెలిపారు. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ నియమాలను పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేయడం కీలకం అని లేఖలో తెలిపారు. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు పునఃప్రారంభించాలని సూచించారు. చదవండి: Covid Vaccine: వ్యాక్సిన్ల సేకరణ ఎలా? -
ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. కర్ఫ్యూ సడలింపు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు ఉండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కచ్చితంగా అమలు చేయనున్నారు. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపు ఇదివరకటి లాగే (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపు) కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ అమలు చేయాలని, ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దుకాణాలను మాత్రం సాయంత్రం 5 గంటలకే మూసి వేయనున్నారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రుల్లో క్రయోజనిక్ ట్యాంకర్లు ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ యూనిటే కాకుండా క్రయోజనిక్ ట్యాంకర్లను పెట్టాల్సిందిగా సీఎం ఆదేశించారు. దీనివల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరాకు భరోసా ఉంటుందన్నారు. వీటితోపాటు డి–టైప్ సిలెండర్లు కూడా ఉంచడం వల్ల మూడు ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రోగులకు ఆక్సిజన్ అందించడంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించదలచిన 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికి స్వయంసమృద్ధి వస్తుందని పేర్కొన్నారు. అవసరం లేని సమయంలో ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. ప్రతి 100 బెడ్లు, ఆపై పడకలున్న ఆస్పత్రుల వద్ద 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకులను స్టోరేజీ కింద పెడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలు, థర్డ్ వేవ్ సన్నద్ధత గురించి వివరించారు. ఈ సమావేశంలో ఉప మఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి – మరణాల రేటును నియంత్రించడంలో ఏపీకి దేశంలో రెండో స్థానం. – పాజిటివిటీ రేటు 5.99 శాతం. రికవరీ రేటు 95.53 శాతాతం. మరణాల రేటు 0.66 శాతం. – యాక్టివ్ కేసులు ప్రస్తుతం 69,831. – అందుబాటులో 2,562 ఐసీయూ బెడ్లు. – అందుబాటులో 13,738 ఆక్సిజన్ బెడ్లు. మే 17న 433 మాత్రమే. – 12 వేలకు పైగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన జనరల్ బెడ్లు. మే 14న 4978 మాత్రమే. – కర్నూలు జిల్లాలో అతి తక్కువగా పాజిటివిటీ రేటు 2.58 శాతం, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 12.25 శాతం. – ఆరోగ్య శ్రీ కవరేజీ ఆస్పత్రుల్లో 90.54 శాతం బెడ్లలో ఈ పథకం కింద రోగులకు చికిత్స. – కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు కేవలం 7,056 మాత్రమే. – 104 సెంటర్‌కు కోవిడ్ కాలంలో గరిష్టంగా 19,175 కాల్స్, ప్రస్తుతం 1582 కాల్స్. – రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,584 బ్లాక్ ఫంగస్ కేసులు, 185 మంది మృతి.. 966 మంది డిశ్చార్జ్. – థర్డ్‌వేవ్‌కు సన్నద్ధతలో భాగంగా జూలై 15 నాటికి రాష్ట్రానికి రానున్న 12,187 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు. – జూన్ 24 నాటికి రాష్ట్రానికి రానున్న 10 వేల డి టైప్ సిలిండర్లు. – 50 బెడ్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటుకు చర్యలు. – జూలై 5 నాటికి రాష్ట్రానికి చేరనున్న మరో 20 ఐఎస్ఓ ట్యాంకర్లు. చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు -
తెలంగాణలో భారీగా లాక్డౌన్ సడలింపులు!
ఈ నెల 19తో ప్రస్తుత లాక్డౌన్ ఉత్తర్వుల గడువు ముగియనుంది. 20వ తేదీ నుంచి సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలుపై కేబినెట్ భేటీలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం. లేదా మంత్రులతో మాట్లాడి ప్రకటన. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు ప్రస్తుత విధానంలోనే లాక్డౌన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరిం త సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం సడలింపులో భాగంగా ఉదయం 6 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలను అనుమతించడంతో పాటు ఆ తర్వాత ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరో గంట సమ యం ఇస్తున్నారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ఈ నెల 19వ తేదీతో ప్రస్తుత లాక్డౌన్ ఉత్తర్వుల గడువు ముగియనుండటంతో, ఆ తర్వాత రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సడలింపు సమయాన్ని పొడిగించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి రాత్రి 10 వరకు వెసులుబాటు కల్పించి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. వాణిజ్య కార్యకలాపాలకు ఊపు రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ కట్టడికి గత నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4,100 కోట్ల ఆదాయ నష్టం జరిగినట్టుగా అంచనా వేశామని మూడు రోజుల కిందట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. బుధవారం నాటికి రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 1,489కి తగ్గింది. ఈ పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ను మరింత సడలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా రాష్ట్రంలో మళ్లీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఊపు కల్పించాలని భావిస్తోంది. ఈనెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల 20, 21 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. బుధవారం ఆయన గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉండడంతో అక్కడి నుంచే నేరుగా జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే సీఎం స్వయంగా మంత్రులతో ఫోన్లో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఒక ప్రకటన ద్వారా లాక్డౌన్ సడలింపుపై తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ సడలింపులు లేనట్లే.. కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదన్న కారణంతో సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కొత్త సడలింపులు లేకుండా లాక్‌డౌన్‌ను యథాతథంగా అమలు చేయాలని చివరిసారిగా ఈ నెల 8న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్డౌన్ సడలించి, మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. కాగా బుధవారం కూడా నల్లగొండ జిల్లాలో 131, ఖమ్మం జిల్లాలో 118, సూర్యాపేట జిల్లాలో 82 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ (175) తర్వాత అత్యధిక కేసులు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు ప్రస్తుత విధానంలోనే లాక్డౌన్అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని అ«ధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి: నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం -
ఢిల్లీలో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు
సాక్షి, ఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో లాక్డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సడలింపు వివరాలను ప్రకటించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు మార్కెట్లు, మాల్స్ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, బ్యాంకెట్ హాళ్లలో వివాహాలకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతి ఇచ్చామన్నారు. ఢిల్లీ మెట్రో, బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతో నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.. ఆటోలు, ఈ-రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, స్పాలు, జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. పార్క్‌లు, గార్డెన్లకు అనుమతి లేదు. ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చామని.. ప్రార్థనా మందిరాలు తెరిచినా భక్తులకు అనుమతి లేదని సీఎం పేర్కొన్నారు. ఇంటి వద్ద 20 మందితో వివాహాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం గ్రూప్-ఏ సిబ్బందికి అనుమతి ఇచ్చామన్నారు. ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి ఇవ్వడంతో పాటు అత్యవసర కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు. వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని.. కరోనా కేసులు పెరిగితే ఆంక్షలు మరింత కఠినం చేస్తామని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. చదవండి: అమ్మా.. కరోనా మాత, అపచారం తల్లీ! పిల్లలపై... థర్డ్‌వేవ్ ప్రభావానికి ఆధారాల్లేవ్! -
Lockdown: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం
చండీఘడ్: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించడానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే, కొంత వరకు నిబంధలను మాత్రం సడలించినట్లు హర్యానా రాష్ట్ర కార్యదర్శి విజయ్ వర్ధన్ వెల్లడించారు. కార్పొరేట్ ఆఫీసులలో 50 శాతం ఉద్యోగులు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హజరవ్వాడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలను సరి, బేసి విధానాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంచుకోవడానికి వెసులు బాటు కల్పించారు. షాపింగ్ మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక, బార్లు, హోటల్లు, రెస్టారెంట్, క్లబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచుకోవచ్చని తెలిపారు. వీటిలో కూడా 50 శాతంమేర ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు. ప్రార్థన మందిరాలలో ఏసమయంలో అయినా.. 21 మందికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలలో 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బరాత్‌లకు, ఊరేగింపులు, ఇతర సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా.. అంతిమ సంస్కారాలకు కూడా కేవలం 21 మందిలోపు మాత్రమే హజరవ్వాలని సూచించారు. అయితే, గత నెలలో హర్యానా రాష్ట్రం లో ప్రతిరోజు 15,000 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం ఆసంఖ్య 9,974 కు తగ్గినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క! -
యూకేలో నిబంధనల సడలింపు
లండన్: లాక్డౌన్ నిబంధనలను యూకే స్వల్పంగా సడలించింది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతిం చింది. అయితే, ఆరుగురికి లేదా రెండు కుటుంబాలకు మించరాదని సూచించింది. బాస్కెట్‌బాల్, గోల్ఫ్, టెన్నిస్, స్విమ్మింగ్ వంటి ఔట్‌డోర్ క్రీడలకు కూడా అనుమతించింది. ప్రభుత్వం ఇప్పటివరకు 3 కోట్ల మందికి, అంటే దేశ వయోజనుల్లో దాదాపు 56% మందికి తొలి డోసు కరోనా టీకాను ఇచ్చింది. ఈ జూలై నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి తొలి డోసు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆస్ట్రాజెనెకా, బయోఎన్‌టెక్(ఫైజర్) టీకాలకు తోడు ఏప్రిల్‌లో అమెరికాకు చెందిన మోడెర్నా టీకా సైతం అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ మంత్రి ఒలివర్ డౌడెన్ వెల్లడించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని యూకే పోలీసులు పౌరులను హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి లేదని, వాటిని నిర్వహించడం, వాటిలో పాల్గొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగా పడిన యూరోప్ దేశాల్లో యూకే ఒకటి అన్న విషయం తెలిసిందే. అక్కడ 1.26 లక్షల మందికి పైగా కోవిడ్ 19తో మృతి చెందారు. యూరోప్‌లోనే ఇది అత్యధికం. లాక్డౌన్ ఆంక్షలను స్వల్పంగా సడలిస్తున్నప్పటికీ.. పౌరులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆంక్షల సడలింపునకు అర్థం కరోనా ముప్పు తొలగిపోయిందని కాదని వివరిస్తోంది. సాధ్యమైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ను కొనసాగించాలని సూచిస్తోంది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌ల్లోనూ నిబంధనలను స్వల్పంగా సడలించారు. ప్రయాణ నిబంధనలను సడలించడంతో వేల్స్లో బీచ్‌లకు పౌరులు పోటెత్తారు. ఇంగ్లండ్‌లో పబ్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు తదితర అత్యవసరం కాని, ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే అవకాశమున్న వ్యాపారాలకు ఇంకా అనుమతించలేదు. యూకే ప్రభుత్వ రోడ్ మ్యాప్ ప్రకారం జూన్ 21వ తేదీ నాటికి పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారు. -
‘లాక్డౌన్ తర్వాత వేగంగా నియామకాలు’
ముంబై: లాక్డౌన్ సడలింపులతో కంపెనీలు ఉద్యోగులను నియమించేందుకు వేగంగా ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు, మూడు వారాలుగా ఈ కామర్స్, డేటా ప్రాసెసింగ్, బ్యాంకింగ్, డిజిటల్ నిపుణులు తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు పుంజుకున్నామని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లాక్డౌన్ సమయంలో 80 శాతం కంపెనీలు ఉద్యోగ నియామకాలవైపు ఆసక్తి చూపలేదని, కానీ లాక్డౌన్ సడలింపు తర్వాత 50 శాతం సంస్థలు ఉద్యోగ నియామకాలకై ఆసక్తి కనబరుస్తున్నాయని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆధిత్యా మిశ్రా తెలిపారు. కానీ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కాగా రాండ్ స్టాండ్ ఇండియా సంస్థ అధికారి సంజయ్ శెట్టి స్పందిస్తూ.. తయారీ రంగం, టెలికాం రంగంలో కొంత మేర వృద్ధి నమోదు కావచ్చని తెలిపారు. అయితే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో శుభపరిణామని శెట్టి అన్నారు. కాగా నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని టీమ్ లీస్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు రితుపర్నా చక్రవర్తి పేర్కొన్నారు. (చదవండి: మరోసారి లాక్డౌన్ దిశగా చైనా..!) -
జూన్ 3న తెరుచుకోనున్న బీచ్‌లు, పార్క్‌లు
ముంబై : లాక్డౌన్ 5.0లో మహారాష్ట్ర భారీ సడలింపులు ప్రకటించింది. బిగిన్ అగైన్ పేరిట క్రమంగా సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. జూన్ 3 నుంచి బీచ్‌లు, పార్కులు, ఆటస్ధలాల్లో ప్రజలను అనుమతిస్తామని పేర్కొంది. 15 శాతం సిబ్బందితో 3 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇక జూన్ 5 నుంచి మాల్స్ మినహా అన్ని మార్కెట్లు కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ట్యాక్సీలు, ఆటోలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సులను అనుమతిస్తారు. ఇక జూన్ 8 నుంచి పది శాతం సిబ్బంది హాజరుతో అన్ని ప్రైవేట్ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా కంటైన్మెంట్ జోన్లలో ఈ సడలింపులు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. చదవండి : ‘లాక్డౌన్ ఎత్తివేస్తే విశృంఖలమే’ -
ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గుజరాత్ సహా దాదాపు పది పారిశ్రామిక రాష్ట్రాలు ఇటీవల పలు కార్మిక చట్టాలను సడలించాయి. దీనిపట్ల ‘సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు సహా పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? యజమానులకా, కార్మికులకా? ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా అధిక పెట్టుబడులు వచ్చి పడతాయా? (లాక్డౌన్: ఆగని విషాదాలు) ఈ విషయంలో జంషెడ్పూర్ బిజినెస్ స్కూల్లో మానవ వనరుల విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్ కేఆర్ శ్యామ సుందర్, దేశంలోనే సిబ్బందిని సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ‘టీమ్ లీజ్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘కార్మిక చట్టాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ఆ దిగ్భ్రాంతి నుంచి నేను ఇంకా కోరుకోలేదు. ఈ మార్పులను కంపెనీల యాజమానులు కూడా కలగనలేదు. ఆశించనూ లేదు. మూడు చట్టాలు మినహా మిగతా అన్ని చట్టాల్లో భారీ మార్పులను తీసుకరావడం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందరికన్నా అన్ని రాష్ట్రాలకన్నా అత్యుత్సాహం చూపింది. యూపీతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం కొంచెం సంకుచితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అయితే ఈ మార్పులు కంపెనీ యజమానులకుగానీ, కార్మికులకుగానీ దోహదం చేసేవిలాగా లేవన్నది నా అభిప్రాయం’ అని శ్యామ్ సుందర్ తెలిపారు. కార్మికులకు, యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను చట్టపరమైన ప్రమాణాలు లేకుండా కేవలం ఇరువర్గాల కమిటీలతో ఎలా పరిష్కారం అవుతాయో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ సవరణలోతోని చైనా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక నుంచి భారత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు. పైగా చైనా కార్మిక శక్తితో భారత కార్మిక శక్తిని పోల్చలేమని చెప్పారు. రాష్ట్రాల స్థాయిలో చట్టాలను మార్చడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని, కేంద్ర చట్టాల పరిధి మార్పులు చేసి, వాటి పరిధిలోకి రాష్ట్రస్థాయి చట్టాలను తీసుకరావడం వల్ల ప్రయోజనం ఉంటుందని రితిపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడు కార్మిక చట్టాల ప్రయోజనాలను కార్మికులు పొందుతున్నారని, యాజమాన్యాలు కూడా కార్మిక చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్తిస్తున్నాయని, ఈ తరుణంలో చట్టాలను ఎత్తివేయడం మంచిది కాదని ఆయన సూచించారు. కార్మికుల్లో, తద్వారా ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుందని, అది ఉత్పాదన శక్తిపై ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. (అదే వరస..ఆగని కరోనా కేసులు..) -
లాక్డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు!
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు వీలుగా ఆంక్షల సడలింపు ఉండాలంటున్నాయి. కేంద్రం కొన్ని కఠిన నిబంధనలను సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నాయి. మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనున్న విషయం తెలిసిందే. ‘లాక్డౌన్ 4.0లో అనేక సడలింపులుంటాయి. గ్రీన్ జోన్లో పూర్తిగా అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఆరెంజ్ జోన్లో మాత్రం కొన్ని ఆంక్షలుంటాయి. రెడ్‌జోన్‌ల్లోని కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం కఠిన ఆంక్షలుంటాయి’ అని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. నిబంధనల సడలింపుల్లో రాష్ట్రాలకు అధికారమివ్వవచ్చన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఉండాలని తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు కోరుతున్నాయని హోంశాఖలోని మరో అధికారి తెలిపారు. లాక్డౌన్ 4.0లో జోన్లను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చే అవకాశముందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, సినిమా హాల్స్ మూసివేత కొనసాగుతుందన్నారు. కంటెయిన్మెంట్ ప్రాంతాలను మినహాయించి రెడ్ జోన్స్‌లో కూడా క్షౌర శాలలను, ఆప్టికల్ షాపులను తెరిచేందుకు అవకాశమివ్వవచ్చని తెలిపారు. వచ్చే వారం నుంచి అవసరాన్ని బట్టి పరిమితంగా రైళ్లను, విమానాలను నడిపేందుకు అనుమతించే ఆలోచన కూడా ఉందన్నారు. -
మాల్స్, మెట్రోకు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగో విడత లాక్డౌన్లో భారీ సడలింపులకు ఢిల్లీ సర్కార్ సంసిద్ధమవుతోంది. ఈనెల 17తో లాక్డౌన్ ముగుస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పలు సడలింపులను ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక పంపామని ఢిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాల్స్, మెట్రో రైళ్లు, ట్యాక్సీ సేవలను అనుమతించాలని నిర్ణయించామని తెలిపారు. బస్సులు, మెట్రోల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణీకులను అనుమతిస్తామని చెప్పారు. 25 నుంచి 50 శాతం వరకూ మాల్స్‌ను తెరిచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. కాగా అద్దెదారు నుంచి లాక్డౌన్ సమయంలో రెంట్‌ను డిమాండ్ చేసిన ఇంటి యజమానిపై షదారా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి యజమానులు అద్దెదారులను మూడు నెలల పాటు అద్దె కోసం ఒత్తిడిచేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..! -
లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ పరిమితుల సడలింపుతో పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారం ధర మంగళవారం కీలక మద్దతు స్థాయికి దిగువన ట్రేడ్ అవుతోంది. ప్రారంభంలో రూ .45,527 పలికిన జూన్ డెలివరీ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 0.71 శాతం తగ్గి 45,480 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు రూ.45,807 లు పలికిన కిలో వెండి ధర కూడా పడింది. ఫ్యూచర్స్ రూ .41,244 తో పోలిస్తే 0.24 శాతం తగ్గి కిలో ధర రూ .41,143 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 43760 గా వుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46560 వద్ద కొనసాగుతున్నాయి. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చింది. కరోనా వైరస్ ఆంక్షలను సడలించడం ద్వారా మార్కెట్లలో సెంటిమెంట్ బలడి పెట్టుబడులు ఈక్విటీల వైపు మళ్లాయి. దీంతో మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి. స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి ఔన్సు ధర 1699.56 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి ఔన్సుకు 1705.50 డాలర్ల వద్ద వుంది. అయితే అమెరికా, చైనా మధ్య ముదుతున్న ట్రేడ్ వార్ భయాలు అటు ట్రేడర్లను, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెడుతున్నాయి. దీంతో బంగారం ఔన్స్ ధర 1700 డాలర్లకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. -
నేటి నుంచి లాక్డౌన్ 3.0
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ మూడో విడత నేటి నుంచి అమల్లోకి రానుంది. లాక్డౌన్ అమలుతో ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని పదిలం చేసుకునేందుకే ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలను పొడిగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సుమారు 130 రెడ్ జోన్లు, ఆరెంజ్ 284, గ్రీన్ జోన్లు 319 ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో19, ఆ తర్వాత మహారాష్ట్రలో 14 రెడ్ జోన్లు ఉన్నాయి. జోన్లతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా నిషేధం కొనసాగేవి.. విమాన, రైలు, మెట్రో ప్రయాణాలు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, శిక్షణ, కోచింగ్ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్, క్రీడా స్థలాలు, ప్రార్థనా స్థలాలు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు. ఆ మినహాయింపు వలస కార్మికులకే లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ వెసులుబాటు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పని ప్రదేశాల నుంచి గానీ, సొంతూళ్ల నుంచి గానీ వచ్చి..లాక్డౌన్ కారణంగా తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసమే ప్రభుత్వం మినహాయింపు కల్పించిందని తెలిపారు. అంతేతప్ప, సొంతూళ్లకు మామూలుగా వెళ్లేవారికి, సొంతపనులపై వెళ్లేవారికి వర్తించదని స్పష్టత నిచ్చారు. (నేటి నుంచి.. లాక్డౌన్ సడలింపులు) -
ఎక్కడి వారక్కడే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను మాత్రమే వారి వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిందని.. ఈ విషయాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు అర్ధంచేసుకుని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్రానికి దాదాపు లక్షమంది వచ్చే అవకాశముందని.. వారందరినీ క్వారంటైన్ చేసేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో లక్ష పడకల ఏర్పాటుకు తక్షణం మార్గదర్శకాలు జారీచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆదేశించారు. టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు మద్యం దుకాణాలను తెరవాలని, అయితే.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం ధరలను 25 శాతం పెంచాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, వలస కూలీలు వారివారి రాష్ట్రాలకు తరలింపు.. ఇతర రాష్ట్రాల్లోని మన వలస కూలీలను తీసుకురావడం.. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి లాక్డౌన్ సడలింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అధికారులు ప్రస్తావించిన అంశాలు.. సీఎం వైఎస్ జగన్ చేసిన ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.. ప్రజల సహకారం కొనసాగాలి ► పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మన వారు పెద్దఎత్తున ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగా వేలల్లో విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు ప్రస్తావించారు. కానీ, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలనే అనుమతిస్తూ ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ► పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మనవారికి ఇది కష్టం అనిపించినా.. విపత్తు తీవ్రత, ప్రజారోగ్యం, వారి కుటుంబాల్లోని పెద్దల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు నడవాలని నిర్ణయించారు. ► ప్రస్తుతం ఇలా బయల్దేరుతున్న వలస కూలీలు భారీగా ఉంటున్నందున వారందర్నీ క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం. వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది. ► అందువల్ల మిగిలిన వారు సహకరించాలి. ఎక్కడి వారు అక్కడే ఉండడం క్షేమకరం. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ► ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం ఇంకా కొనసాగాలి. కరోనాపై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం. ► ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని ప్రజలకు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధప్రాతిపదికన క్వారంటైన్ సదుపాయాలు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన క్వారంటైన్ సదుపాయాలను కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. ► భోజనం, టాయిలెట్స్, బెడ్స్, బెడ్షీట్లు తదితరాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ► ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను వీలైనంత త్వరగా తయారుచేసి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ► కేంద్రం సూచించినట్లుగా వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా వారివారి రాష్ట్రాలకు పంపాలి. అదే.. అంతర్ జిల్లాల్లో కూలీలను పంపేటప్పుడు బస్సుల ద్వారా పంపాలి. ► ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు వివరించగా.. వలస కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లతో కూడిన ఒక కిట్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పటిష్టంగా టెలీమెడిసిన్ సమావేశంలో టెలీమెడిసిన్ అమలు తీరుతెన్నులపై ప్రస్తావనకు రాగా.. ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మిస్డ్‌కాల్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోతే రోజుకు మూడుసార్లు చొప్పున చేయాలని.. అప్పుడే ఆ కాలర్ అందుబాటులో లేడని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయిల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని.. ఈలోగా టెలీమెడిసిన్‌లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన వారికి మందులు డోర్ డెలివరీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ద్విచక్రవాహనాలను ఏర్పాటుచేసుకోవాలని, అలాగే థర్మల్ బాక్స్ కూడా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఉపకేంద్రాలు ప్రారంభమైన తర్వాత మందులు సహా ప్రాథమిక చికిత్స కూడా అక్కడే అందుబాటులో ఉంటుందన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట
సాక్షి, ముంబై : కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోయిన ఈ కామర్స్ దిగ్గజాలకు తాజాగా భారీ ఊరట లభించనుంది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల ఆన్ లైన్ వ్యాపారానికి కొన్ని ఆంక్షలతో అనుమతి లభించింది. నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది. రెడ్ జోన్లు మినహా తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ అనుమతి నిత్యావసర వస్తువులను మాత్రమే పరిమితమైంది. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా తాజాగా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. సంబంధిత నిబంధనలను పాటిస్తూ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులకు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువులను డెలివరీ చేయవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. అయితే రెడ్ జోన్లలో మాత్రం కిరాణా సరుకులు, మందులు లాంటి నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి వుంది. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) చదవండి: అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట -
మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్డౌన్ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది. తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!) ఆరెంజ్ , గ్రీన్ జోన్లు రెండింటిలోనూ మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి వుంటుంది. అన్ని వస్తువులకు ఇ-కామర్స్ అనుమతి. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి వుండగా, తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంటి పనిమనుషులను అనుమతించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర, లేదా యూటీ (కేంద్రపాలిత ప్రాంతాలు)ల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. రెడ్ జోన్లు నాన్ కంటైన్ మెంట్ జోన్లలో మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి. అత్యవసరమైన వస్తువులకు మాత్రమే ఇ-కామర్స్ అనుమతి. అత్యవసరం కాని వస్తువుల విక్రయానికి అనుమతి లేదు. మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌వేర్, జూట్ మిల్లులకు అనుమతి ఉంది. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి. పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్‌తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సడలింపులు, పరిమితులు రెడ్, ఆరెంజ్ జోన్లలో స్థానిక అధికారులు గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాలకు వర్తించవు. అనుమతించిన నిత్యావసరాల సరఫరాకు మించి కంటైన్ మెంట్ జోన్ ప్రాంతాలు తీవ్రమైన పరిమితులకు లోబడి వుంటాయి . (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్డౌన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఆంక్షలను సడలించడానికి వీల్లేదు. ఉదాహరణకు రెడ్ (స్వతంత్ర దుకాణాలు మాత్రమే), ఆరెంజ్, గ్రీన్ జోన్స్, జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం వుంది. కానీ కావాలనుకుంటే రాష్ట్రాలు, యూటీలు మద్యం షాపులను మూసి వుంచడానికి కేంద్రం అనుమతినిచ్చింది. అదే సందర్భంలో రెడ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకానికి ఇ-కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వుండదు. ఈ నెల 3వ తేదీతో ముగియనున్నరెండవ దశ లాక్ డౌన్ ను పొడిగించి, అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. మార్చి చివరిలో అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్డౌన్ విస్తరించడం ఇది రెండోసారి. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) -
ఐటీ, మాల్స్ మినహా అన్నీ ఓపెన్!
బెంగళూర్ : లాక్డౌన్ నియంత్రణలను సడలించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కంటెయిన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ, చిన్న మధ్యతరహా సంస్థలు పనిచేసేందుకు అనుమతించనున్నట్టు తెలిపింది. ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడాన్ని కొనసాగించాలని పేర్కొంది. మరో మూడు నెలలు కోవిడ్-19 ప్రభావం ఉంటుందని అప్పటి వరకూ నియంత్రణలతో కూడిన సడలింపులు ఉంటాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. అన్ని పరిశ్రమలు మే 4 నుంచి తిరిగి పనిచేసేందుకు అనుమతిస్తామని, మాస్క్‌లు ధరించడం..సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని పరిశ్రమల మంత్రి జగదీష్ షెట్టార్ చెప్పారు. మే 4 నుంచి 50 శాతం సిబ్బందితో ఆయా పరిశ్రమలు పనిచేసేందుకు అనుమతిస్తామని అన్నారు. ప్రజా రవాణా రాకపోకలను అనుమతించలేదని, సిబ్బంది ప్రైవేట్ వాహనాలు లేదా కంపెనీలు ఏర్పాటు చేసిన వాహనాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. బస్సులు, రైళ్లు వాహనాల రాకపోకలకు అనుమతి లేనందున కార్మికుల రవాణా ఆయా సంస్థల బాధ్యతేనని స్పష్టం చేశారు. మే 3 తర్వాత కూడా మాల్స్, సినిమా థియేటర్లను అనుమతించడం లేదని మంత్రి తెలిపారు. చదవండి : క్వారంటైన్లో నలుగురు కర్ణాటక మంత్రులు ఇక సెలూన్లు, బ్యూటీపార్లర్లను తెరవడంపై మే 3 తర్వాత కేంద్రప్రభుత్వ తాజా మార్గదర్శకాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మద్యం విక్రయాల పైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేంద్రం మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్ధులు, వలస కూలీల రాకపోకలను అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇక సిమెంట్, స్టీల్ షాపులు తెరుచుకుంటాయని, క్రషర్స్ పనిచేస్తాయని పేర్కొంది. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు కూడా పనిచేస్తాయని, కార్యాలయానికి ఎలాంటి పనుల కోసం వచ్చే వారికి వాట్సాప్ ద్వారా పాస్‌లు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. -
లాక్డౌన్ : గ్రీన్‌జోన్స్‌లో తెరుచుకోనున్న షాపులు
కోల్‌కతా : కోవిడ్-19 లాక్డౌన్ నుంచి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం పలు సడలింపులను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మే 1 నుంచి గ్రీన్జోన్లలో స్టేషనరీ, ఎలక్ర్టానిక్స్, హార్డ్‌వేర్, మొబైల్, లాండ్రీ, టీ, పాన్ షాపులను అనుమతిస్తారు. అయితే షాపింగ్‌మాల్స్‌లో ఉండే ఎలాంటి షాపులను తెరిచేందుకు అనుమతించరు. టీ షాపులను తెరిచినా పెద్దసంఖ్యలో ప్రజలను గుమిగూడేందుకు అనుమతించబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. గ్రీన్జోన్లలో చిన్న షాపులతో పాటు ఫ్యాక్టరీలు, నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తామని అయితే ఆరోగ్య మార్గదర్శకాలను పాటిస్తూ ఇవి తమ కార్యకలాపాలను నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సడలింపులు కంటెయిన్మెంట్ జోన్లకు వర్తించవని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం మే 1 నుంచి లాక్డౌన్ సడలింపులు అమలవుతాయని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 550కి చేరింది. వీరిలో 119 మంది కోలుకోగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 22కి పెరిగింది. చదవండి : మృతదేహంతో 3 కి.మీ. ప్రయాణం.. -
‘మే 3 తర్వాత కూడా సడలింపులుండవు’
సాక్షి, న్యూఢిల్లీ: కంటైన్మెంట్, రెడ్‌జోన్ ప్రాంతాల్లో మే 3 తరువాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సడలింపులు ఉన్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. (మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్‌న్యూస్’) కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడని, మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైల్వే సేవలు ప్రారంభించకూడదని కిషన్‌రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలు అయినా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకుపోవచ్చని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి చర్చలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. లక్షలాది మంది ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. (రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్) ఆర్థికవృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో, గ్రామస్థాయిలో సడలింపులిచ్చామని అన్నారు. కరోనా వైరస్ అడ్డుకునేందుకు అన్ని దేశాలు పోరాడుతూ వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు మొదలుపెట్టాయని ఆయన చెప్పారు. ప్రజల ప్రాణాలకే మొదటి ప్రాధాన్యత, దానికోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. (హెచ్-1 బీ: జూన్ నాటికి ముగుస్తున్న గడువు!) ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్ని రాష్ట్రాలు రెండో విడత సహాయం తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ పథకం కింద రూ. 2,719 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. రాష్ట్రనికి 27,500 పీపీఈ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. 105053 ఎన్95 మాస్కులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చామని ఆయన తెలిపారు. కరోనా లాబ్స్ ప్రభుత్వనివి ఎనిమిదని, ప్రైవేటుకు చెందిన 12 లాబ్స్‌కి అనుమతులు ఇచ్చామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. -
చేనేతకు పన్ను మినహాయింపు ఇవ్వాలి
మంత్రి అచ్చంనాయుడికి వినతి కాకినాడ సిటీ : కుంటుపడుతున్న చేనేత రంగానికి పన్ను విధానంలో మినహయింపు ఇవ్వాలని జౌళి శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడిని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్ కోరారు. బుధవారం జిల్లాకు వచ్చిన మంత్రిని ఫ్రంట్ ప్రతినిధులు బృందం సత్కరించి చేనేత సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. చేనేత వస్త్రాలకు ‘రిబేటు’ఇవ్వకపోవడం వల్ల సంఘాలలో వస్త్రాలు నిల్వ ఉండి పాడైపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర జౌళి శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కేంద్ర పథకాల లబ్ధిని రాష్ట్రంలోని చేనేత కార్మికులు పొందలేకపోతున్నారని వివరించారు. దీంతో నైపుణ్యం ఉన్న నేత కార్మికులే వృత్తి వదిలివెళ్లిపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రిని కలిసిన వారిలో ఫ్రంట్ కో-కన్వీనర్ శీరం లక్ష్మణప్రసాద్, యర్రా వీరభద్రారావు, చింత వీరభద్రరావు, మలిపెద్ది అప్పారావు, వీసా పరమేశ్వరరావు, శీరం అప్పారావు, గుడిమెట్ల వీర్రాజు, చేనేత సహకార సంఘ ప్రతినిధులు ఉన్నారు. -
‘పన్ను’లూడేది ఉద్యోగులకేనా?
-
‘పన్ను’లూడేది ఉద్యోగులకేనా?
2015–16లో ఇవీ... మన పన్ను లెక్కలు ∙మొత్తం రిటర్నులు వేసింది – 3.7 కోట్ల మంది ∙లిమిట్‌లోపలే ఉండి జీరో పన్ను చూపించింది – 99 లక్షలు ∙రూ.2.5– 5 లక్షల ఆదాయం చూపించింది – 1.95 కోట్లు ∙రూ.5–10 లక్షల ఆదాయం చూపించింది – 52 లక్షలు ∙రూ.10 లక్షలకన్నా ఎక్కువ ఆదాయం చూపించింది – 24 లక్షలు ∙రూ.5 లక్షల పైబడి ఆదాయం చూపించిన 76 లక్షల మందిలో ఉద్యోగులు – 56 లక్షలు ∙రూ.50 లక్షల పైబడి ఆదాయం చూపించింది – 1.72 లక్షల మంది ఇదీ... పన్ను చెల్లింపుదారుల కథ. అంటే... - దేశం మొత్తమ్మీద ఏడాదికి రూ.5 లక్షలకన్నా ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులు 56 లక్షల మందయితే... వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్ల వంటి వృత్తినిపుణులంతా కలిసి 24లక్షల మంది ఉన్నారట!!. మరి వీళ్ల కొనుగోళ్లు ఎలా ఉన్నాయో చూస్తే బుర్ర తిరిగిపోకమానదు. ఎందుకంటే... - గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.25 కోట్ల కార్లు అమ్ముడుపోయాయి. అంటే ఏడాదికి 24 లక్షల కార్లన్నమాట. - వ్యాపారం కోసమో లేదా సరదాకో విదేశాలకు వెళ్లినవారు ఒక్క 2015లోనే 2 కోట్ల మంది ఉన్నారు. కారు కొనాలంటే కనీసం రూ.4 లక్షలపైనే అవుతుంది. విదేశాలకెళ్లాలంటే కనీసం రూ.2 లక్షలు దాటుతుంది. కానీ వీళ్లంతా ఏడాదికి రూ.5 లక్షల లోపే ఆదాయం ఉన్నట్లు చూపిస్తున్నారంటే ఏమనుకోవాలి? అదే జైట్లీ వేసిన ప్రశ్న. కంపెనీల సంగతి మరీ విచిత్రం.. - 2014 మార్చి 31 నాటికి దేశంలో రిజిస్టరైన కంపెనీలు – 13.94 లక్షలు - 2015–16లో రిటర్న్‌లు వేసిన కంపెనీలు – 5.97 లక్షలు - వీటిలో నష్టాన్నో లేదా సున్నా ఆదాయాన్నో చూపించినవి – 2.76 లక్షలు - మిగిలిన వాటిలో పన్నుకు ముందు ఆదాయాన్ని రూ.కోటిలోపే చూపించినవి– 2.85 లక్షలు - కోటి నుంచి రూ.10 కోట్ల ఆదాయాన్ని చూపించిన సంస్థలు – 28,667 - పన్నుకు ముందు ఆదాయం రూ.10 కోట్లు దాటినట్టు చూపిన కంపెనీలు– 7,781 అంటే... దాదాపు 14 లక్షల కంపెనీల్లో రూ.10 కోట్లు దాటిన ఆదాయాన్ని చూపించినవి కేవలం 7,781. అంటే 0.6 శాతం కూడా లేవు. అదీ మన కంపెనీల పన్ను కథ. - పెద్ద నోట్లను రద్దు చేశాక నవంబర్ 8 – డిసెంబర్ 30 మధ్య 1.09 కోట్ల ఖాతాల్లో రూ.2 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య డిపాజిట్ అయ్యాయి. సగటు డిపాజిట్ రూ. 5.03 లక్షలు. - రూ. 80 లక్షల పైబడి డిపాటిట్ అయిన ఖాతాలు 1.48 లక్షలున్నాయి. సగటు డిపాజిట్ రూ.3.31 కోట్లు. -
ఏపీ మహిళా ఉద్యోగులకు సడలింపునివ్వాలి
ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం చిక్కడపల్లి: ఏపీ మహిళా ఉద్యోగులకు బదిలీల్లో సడలింపులిచ్చి, భార్యాభర్తలు ఒకే చోట పని చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక భవన్ వద్ద ఆందోళన చేపట్టింది. పిల్లల చదువులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వెసులుబాటునివ్వాలని ఫోరం అధ్యక్షుడు వల్లభాయి పటేల్, మాజీ అధ్యక్షుడు పీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. -
ఆటోమొబైల్ రంగానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆటోమొబైల్ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకొంది. విడిభాగాలు, ఇతర ముడి పరికరాల దిగుమతిపై ఉన్న 14.5 వ్యాట్‌ను తగ్గించింది. జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ యాజమాన్యం ఇటీవల సీఎం కేసీఆర్ ఆ కంపెనీని సందర్శించినప్పుడు 14.5 శాతం పన్ను వల్ల నష్టం వస్తోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని పరిశ్రమలకు విక్రయించే ఆటో కాంపొనెంట్స్ మీద పన్నును 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 50ని జారీ చేసింది. మేడ్చల్‌లో 200 ఎకరాల్లో ఆటోమొబైల్ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామికవిధానంలో భాగం గా మేడ్చల్‌లో 200 ఎకరాల్లో ఆటోమొబైల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాలానగర్‌లోని ఎంఎల్ఆర్ కంపెనీ, రాప్టర్ మోటార్స్, కింగ్టాంగ్ అనే విదేశీ కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు నెలకొల్పేం దుకు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాట్ తగ్గింపుతో ఆటోమొబైల్ పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. -
అటెండెంట్స్... అటెన్షన్ ప్లీజ్!
ఎమర్జెన్సీలో ఏమేం చేయాలి? వైద్యపరమైన అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) ఎవ్వరికీ రాకూడదుగానీ... ఎవరి ఇంట్లోనైనా సదరు కుటుంబ సభ్యులకు ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ ఎదురైతే కాళ్లూ చేతులు ఆడవు. ఎదుటివారిలో ఎలాగైనా పేషెంట్‌ను కాపాడాలనే తపన. కానీ ఏం చేయాలో తోచదు. ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అతడితో పాటు... అతడి తోడున్నవాళ్ల మనఃస్థితి ఇది. కానీ నిజంగా ఒక పేషెంట్ ఏదైనా వైద్యపరమైన అవసరంతో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉంటే... ఆయా లక్షణాలను బట్టి అతడికి ఏం చేయాలో తెలిస్తే రోగికి తోడుండే సహాయకుడికి (అటెండెంట్‌కు) కాస్త కాళ్లూ చేతులూ కదులుతాయి. వాటిని ఉపయోగించి రోగిని రక్షించడానికి ఏమేం చేయాలో తెలుస్తుంది. అనేక మెడికల్ ఎమర్జెన్సీ కేసుల్లో రోగిగానీ... లేదా ఆ సమయంలో అతడికి తోడున్న వ్యక్తిగానీ ఏం చేయాలన్న అంశంపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. గుండెపోటు వచ్చినప్పుడు లేదా గుండె అకస్మాత్తుగా ఆగినప్పుడు... ఈ లక్షణాలు గుర్తెరగండి... అప్రమత్తం కండి... గుండెపోటు లక్షణాలను తెలుసుకుంటే... రోగి గానీ లేదా అతడికి తోడుగా ఉన్న వ్యక్తి (అటెండెంట్)గానీ అప్రమత్తమై రోగిని రక్షించవచ్చు ఛాతీకి ఎడమవైపున పట్టినొక్కుతున్నట్లుగా నొప్పి ఛాతీభాగమంతా మంట ఛాతీపై వచ్చిన నొప్పి దవడ లేదా కడుపు పైభాగానికి లేదా మెడవైపునకు లేదా భుజంవైపునకు పాకుతున్నట్లుగా అనిపించడం గుండెదడ (పాల్పిటేషన్స్) విపరీతంగా చెమటలు పట్టడం వికారం లేదా వాంతి కావడం చిన్నపనికీ తీవ్రంగా అలసట చెందడం అకస్మాత్తుగా తలతిరిగినట్లుగా అనిపించడం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే వెంటనే రోగి గానీ లేదా రోగి వెంట ఉండే సహాయకులు (అటెండెంట్)గానీ అప్రమత్తం కావాలి. కాలాతీతం చేయవద్దు... చాలా సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది పొట్టలో గ్యాస్ నిండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందంటూ కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. యాంటాసిడ్ వంటివి తీసుకుని ఆసుపత్రికి రాకుండా సొంత చికిత్స చేసుకుంటుంటారు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వెంటనే ఆసుపత్రికి తరలించడం మంచిది. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించిన రోగుల్లో సగానికి పైగా ఆసుపత్రికి చేరడంలో ఆలస్యం చేసిన కారణం వల్లనే మరణిస్తుంటారు. వారు సకాలంలో గనక ఆసుపత్రికి చేరితే బతికే అవకాశాలు చాలా ఎక్కువ. ఇదీ విండో పీరియడ్... లక్షణాలు కనిపించగానే రోగి ప్రాణరక్షణకు అవకాశం ఉన్న బంగారు ఘడియలను విండో పీరియడ్‌గా పరిగణిస్తారు. లక్షణాలు కనిపించగానే రోగిని కనీసం 12 గంటల లోపు దగ్గర్లో ఉన్న అన్ని వసతులు గల పెద్ద ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రికి చేరగానే అక్కడ రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని తొలగించడానికి చికిత్స చేస్తారు. ఈ చికిత్సను ‘రీ-పెర్ఫ్యూజన్ థెరపీ’గా పేర్కొంటారు. ఆసుపత్రికి చేరగానే రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకిని పేల్చివేసేందుకు అవసరమైన ‘ఫిబ్రినోలైటిక్ థెరపీ’ ఇంజెక్షన్లను అరగంటలోపే ఇస్తారు. లేదా రక్తనాళాలను వెడల్పు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలను చేసి రక్తనాళంలోని అడ్డంకులను 90 నిమిషాలలోపే తొలగిస్తారు. రోగి లేదా రోగి సహాయకులు ఈలోపే చేయాల్సిందిదే... రోగికి గుండెపోటు వచ్చినప్పుడు దాని స్పందనలు సక్రమంగా లేకపోవడం (రిథమ్ తప్పడం జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిని అరిథ్మియా అంటారు), లేదా అకస్మాత్తుగా ఆగిపోవడం జరగవచ్చు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఆసుపత్రికి వచ్చే లోపు రోగికి ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలుచబార్చే టాబ్లెట్లను వెంటనే ఇవ్వాలి. దీనివల్ల ఆసుపత్రిలో జరిగే అసలు చికిత్స ప్రక్రియకు ముందే... రక్తం పలుచబారిపోయి గుండెకండరానికి కలిగే నష్టం చాలా తగ్గుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ అనే ప్రథమ చికిత్స చేయాలి. ఈ ప్రథమ చికిత్స ప్రక్రియను అందరూ నేర్చుకోవడం అవసరం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే వాయునాళాలు బిగుసుకుపోవడం గానీ లేదా వాటిలో ఏవైనా అడ్డంకులు కలగడం వల్ల ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాల్సిందే... ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది దగ్గు కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ దగ్గినప్పుడల్లా కఫం పడుతూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం అప్రమత్తమై రోగిని ఆసుపత్రికి తరలించాలి. సాధారణంగా పొగతాగేవాళ్లలోనూ, లేదా వాయుకాలుష్యంలో ఎక్కువసేపు గడిపేవాళ్లు, దుమ్ము ధూళిలో ఎక్కువగా సంచరించేవారు, చాలా తక్కువ గాలివచ్చే ప్రదేశాలలో వంట చేసేవారు ఈ కండిషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో వారిలో ఆక్సిజన్ పాళ్లు తగ్గి, కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. తక్షణఉపశమన చర్యలివే... రోగికి పై లక్షణాలు కనిపించినప్పుడు ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే కొంత ప్రథమ చికిత్స చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు రోగి వంటగదిలో పొగ మధ్యన ఉంటే అతడిని/ఆమెను పొగలోంచి ధారాళంగా మంచి గాలి వీచే ప్రదేశంలోకి తీసుకురావాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మాన్పించాలి. మందుల షాపులో లభించే వాయునాళాలను వెడల్పు చేసే మందులు (బ్రాంకోడయలేటర్స్)ను పీల్చేలా చేయాలి. ఇది మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) గా ఇవ్వాలి. ఇక అప్పటికీ ఆయాసం తగ్గకపోతే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ డాక్టర్లు పరీక్షించి వారికి అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం లేదా బై-పాప్, సీ-పాప్ వంటి చికిత్సలు అందించడం వంటివి చేస్తారు. ఫిట్స్ (సీజర్స్) ఎపిలెప్సీ అని పిలిచే ఫిట్స్ అనే కండిషన్ పట్ల రోగుల్లోనూ సాధారణ ప్రజల్లోనూ చాలా అపోహలు ఉన్నాయి. ఫిట్స్నే వైద్యపరిభాషలో సీజర్స్ అని కూడా అంటారు. మెదడులో ఉత్పన్నమయ్యే సంకేతాలలో మార్పులు రావడం వల్ల ఫిట్స్ వస్తాయి. కానీ ఈ పరిస్థితిలో కనిపించే భయంకరమైన పరిణామాల వల్ల ఈ వ్యాధి పట్ల ఈ ఆధునిక యుగంలోనూ దీని పట్ల అనేక భయాలూ, అపోహలూ, దురభిప్రాయాలూ ఉన్నాయి. ఈ రోగుల పట్ల వివక్ష ఉంది. ముఖ్యంగా పల్లెల్లో వీరిపట్ల చాలా వివక్షతో వ్యవహరిస్తారు. మహిళలకు ఫిట్స్ ఉంటే ఇక వారి పట్ల వివక్షకు అంతం ఉండదు. ఫిట్స్ వచ్చే మహిళలకు పిల్లలు కలగరనే అపోహ ఉంది. ఒకవేళ పిల్లలు కలిగితే వారికీ ఫిట్స్ వస్తాయనే ఇంకో అపోహ కూడా ఉంది. కానీ ఇవన్నీ అపోహలే/దురభిప్రాయాలే. లక్షణాలతోనే ఇబ్బంది... ఫిట్స్ వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి గిలగిలా కాళ్లూ, చేతులూ, కనుగుడ్లూ, తలను కదిలిస్తూ కొట్టుకుంటాడు పూర్తిగా గానీ, పాక్షికంగాగానీ స్పృహ కోల్పోతాడు ఒక్కోసారి పళ్లు బిగుసుకుపోవడం వల్ల నాలుక పళ్ల మధ్య చిక్కుకునిపోయి నోట్లోంచి రక్తం వస్తుంది. ఇది నాలుక తెగడం వల్ల కలిగే పరిణామమే తప్ప నిజానికి నోట్లోంచి రక్తస్రావం కాదు ఒక్కోసారి తనకు తెలియకుండానే మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయి మూత్రం పోస్తాడు ఇలాంటి లక్షణాల నుంచి బయటపడ్డ తర్వాత కూడా రోగి చాలా సేపు అయోమయంగా, మత్తుగా బలహీనంగా ఉంటాడు. లక్షణాలు కనిపించగానే సహాయకులు చేయాల్సిందివే రోగి తల ఒక పక్కకు ఓరగా ఉండేట్లుగా పడుకోబెట్టాలి. దీనివల్ల అతడి నోట్లోంచి వచ్చే స్రావాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. దాంతో రోగి యదాతథంగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. వీలైతే దువ్వెన లేదా స్కేల్ వంటిదాన్ని రోగి పళ్ల మధ్య ఉంచడం వల్ల రోగి నాలుక కొరుక్కోకుండా ఉంటాడు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే... మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల అకస్మాత్తుగా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అందులో రక్తం కనిపించడం వంటి లక్షణాలతో రోగి ఆందోళనతో భయభ్రాంతులకు లోనుకావచ్చు. లేదా అకస్మాత్తుగా పొత్తికడుపులో నొప్పితో విలవిలలాడిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రోగిని ఆందోళన పడకుండా చూడాలి. చికిత్సతో ఆ పరిస్థితి తగ్గుతుందని రోగికి భరోసా కల్పించడం వంటి సాంత్వన వాక్యాలు పలకాలి. ఇక మూత్రంలో రక్తం కనిపించడం, పొత్తికడుపులో నొప్పి కిందివైపునకు పాకుతున్నట్లుగా రావడం, వికారం, వాంతులు, జ్వరం, మూత్రం పరిమాణం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే రోగిలో మూత్రపిండంలో గానీ లేదా మూత్రపిండం నుంచి మూత్రాశయానికి మూత్రాన్ని తీసుకువచ్చే నాళాల్లో (యురేటర్స్లో)గానీ రాయి వంటిది ఉండవచ్చు. ఒకవేళ ఆ రాయి పరిమాణం పెద్దదిగా ఉండి అది మూత్రప్రవాహానికి అడ్డుపడితే మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు. అందుకే ఇలాంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రికి తీసుకురావాలి. అక్కడ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇంట్రావీనస్ పైలోగ్రామ్, అబ్డామినల్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స చేస్తారు. పక్షవాతం మన శరీర అవయవాల్లో అన్నింటినీ నియంత్రించే కీలకమైన భాగం మెదడు. ఏ కారణం వల్లనైనా మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోతే మెదడుకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందక అది పక్షవాతానికి దారితీయవచ్చు. పక్షవాతంలో రెండు రకాలుంటాయి... ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడి మెదడుకు తగినంత రక్తం అందకపోవడం వల్ల వచ్చే పక్షవాతం హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులోని ఏదైనా రక్తనాళం అకస్మాత్తుగా చిట్లిపోవడం వల్ల మెదడు కణజాలానికి రక్తం అందక వచ్చే పక్షవాతం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే... ముఖంలో గానీ లేదా చేయి/కాలులో ఒకవైపున అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం అకస్మాత్తుగా అయోమయానికి లోనుకావడం మాట్లాడటంలో గానీ లేదా ఎవరైనా చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది చూడటంలో ఇబ్బంది నడవడం కష్టమైపోవడం నిలబడి ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం అకస్మాత్తుగా తలనొప్పి పక్షవాతంలో విండో పీరియడ్ ఇలా... పై లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని కనీసం మూడు నుంచి నలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి. అంటే గుండెపోటుతో పోలిస్తే పక్షవాతంలో విండో పీరియడ్ చాలా తక్కువ. విషం తీసుకున్నప్పుడు... ఎవరైనా విషం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇతరుల సూచనలకు స్పందించకపోయినా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, కండరాలు బిగుసుకుపోతున్నా వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. ఈలోపు డాక్టర్‌కు ఫోన్ చేసి సలహా అడగాలి. అంతేగానీ విషాన్ని కక్కించడానికి వెంటనే ప్రయత్నించకూడదు. ఎందుకంటే కొన్ని రకాల విషాలు కక్కించే సమయంలో మరింతగా హాని చేస్తాయి. అగ్నిప్రమాదాల్లో... అగ్నిప్రమాదంతో ఎవరికైనా నిప్పు అంటుకున్నప్పుడు అది మరింత విస్తరించకుండా చూడాలి. కాలిన ప్రదేశాన్ని పై నుంచి ధారగా పడే చల్లటి నీళ్లతో 10- 15 నిమిషాల పాటు కడగాలి. ఆ తర్వాత కాలిన చోట యాంటీసెప్టిక్ లోషన్ రాసి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. మధుమేహ రోగుల్లో హైపోగ్లైసీమియా మధుమేహ రోగుల్లోని చాలా మందిలో కనిపించే ఎమర్జెన్సీ ఇది. సాధారణంగా చక్కెర రోగుల్లో తగిన అవగాహన లేకపోవడం వల్ల తాము తక్కువగా తిన్నప్పుడూ లేదా ఏమీ తిననప్పుడు కూడా యథావిధిగా రక్తంలో చక్కెరను నియంత్రించే మాత్రలు వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల రోగి రక్తంలోని చక్కెర పాళ్లు 70 ఎంజీ/డీఎల్‌కు తగ్గినప్పుడు రోగిలో తీవ్రంగా ఆకలివేసినట్లుగా అనిపించడం, శరీరమంతా వణికిపోవడం, తీవ్రంగా చెమటలు పట్టడం, గుండెదడ, బలహీనత, అలసట, అయోమయం, మగతగా అనిపించడం ఒక్కోసారి స్పృహతప్పడం, సీజర్స్ (ఫిట్స్) రావడం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరగవచ్చు. పై లక్షణాలు కనిపిస్తే వెంటనే 3-4 టీ స్పూన్ల చక్కెర గానీ లేదా 5-6 చాక్లెట్ క్యాండీలు ఇవ్వాలి. ఇక కప్పు పాలలో ఒక స్పూను తేనె వేసి గానీ లేదా చక్కెరతో అరకప్పు పళ్లరసం ఏదైనా తాగించాలి. స్పృహ తప్పిన వారికి ద్రవపదార్థాలు తాగించకూడదు. చక్కెర/గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేయవచ్చు. రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డప్పుడు రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిని రక్షించే క్రమంలో కొందరు వాహనంలో చిక్కుబడ్డ వారిని బలవంతంగా బయటకు లాగుతుంటారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయటకు రాగలిగే పరిస్థితి ఉంటేనే ఈ పని చేయాలి. లేకపోతే ఈ క్రమంలో వారికి మరిన్ని గాయాలు అయ్యే అవకాశాలున్నాయి. ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ద్విచక్రవాహనదారులు బైక్ కింద ఇరుక్కుని ఉంటే వారిని అకస్మాత్తుగా లాగడం సరికాదు. ఇందువల్ల వారి మెడ దగ్గర ఉండే వెన్నుపూసలు కదలిపోయి రోగి పూర్తిగా అచేతనం (పారలైజ్) అయ్యే అవకాశాలుంటాయి. అంతేకాదు... రోగికి గుచ్చుకుపోయిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని బలవంతంగా లాగడం కూడా సరికాదు. ఇక రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే అక్కడ బలంగా అద్ది ఉంచి రక్తస్రావాన్ని నిలిపేందుకు ప్రయత్నించాలి. ఈ ప్రక్రియను ‘టార్నిక్వెట్’ అంటారు. మీ సేవాభావం... కావాలి ఇతరులకు ఆదర్శం! మీ సేవాభావం ఇతరులకు ఆదర్శం కావాలని ‘సాక్షి’భావిస్తోంది. దాంతో మరింత మంది స్ఫూర్తి పొందాలని ‘సాక్షి’ ఆశిస్తోంది. తద్వారా సమాజానికి హితం చేకూరాలన్నది సాక్షి ఆకాంక్ష. అందుకే వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఈ వైద్యసేవలు కేవలం ఉచిత వైద్య శిబిరాల వంటి సంప్రదాయ పద్ధతుల్లాంటివే కాకుండా... వైద్యపరిశోధన ద్వారా ఏదైనా ఒక పరికరం రూపకల్పన... తద్వారా ఒక సమూహానికే లబ్ధి చేకూరడం వంటివైనవి కూడా కావచ్చు. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ ఏడాది వైద్యపరంగా సమాజానికి మీరందరించిన సేవలను తెలుపుతూ మీ ఎంట్రీలను పంపండి. మీ సేవాకార్యకలాపాలందించిన దృష్టాంతాలకు తగిన ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను ఈ కింది చిరునామాకు పంపండి. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. కేవలం వైద్యపరమైన సేవా విభాగంలోనే గాక... ఈ ఏటి తెలుగు ఎన్నారై, రైతు, పారిశ్రామికవేత్త, విశేష ప్రతిభ కనబరచిన విద్యార్థి, విశేష సేవలందించిన స్వచ్ఛంద సేవాసంస్థ, యంగ్ అఛీవర్స్, నాటకరంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన స్త్రీ, పురుషులకూ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రకటిస్తారు. -
అరోమాథెరపీ చేయించుకుంటున్న దీపిక
వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇప్పుడు బాగా అలసిపోయింది. దాంతో అరోమాథెరపీ మసాజ్ చేయించుకుని రిలాక్స్ అవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం తాను పారాచూట్ అడ్వాన్స్డ్ స్పెషల్ ఎడిషన్ అరోమాథెరపీ ఆయిల్ వాడుతున్నట్లు చెప్పింది. రోజంతా పనిలో మునిగిపోయి, అలసిపోయిన తర్వాత అరోమాథెరపీ తనకు చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుందని, ఈ ఆయిల్‌తో తలకు మసాజ్ చేయించుకుంటే ఒత్తిడి నుంచి కూడా సులభంగా బయటపడొచ్చని దీపిక చెప్పింది. అయితే ప్రతిరోజూ ఒకే సమయానికి మాత్రం ఇలా చేయడం తనకు అంత సులభంగా వీలుకాదని అంటోంది. తనకు బాగా అలసటగా అనిపించినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు మాత్రం అప్పటికప్పుడు రిలాక్స్ అవ్వాలని ఉంటుందని, అప్పుడే అరోమాథెరపీ మసాజ్ చేయించుకుంటానని దీపిక చెప్పింది. తాజాగా ఆమె 'హేపీ న్యూ ఇయర్ ' సినిమాలో నటించింది. -
ఆర్చీని చంపేస్తారా?
వీక్షణం కామిక్ పుస్తకాలు, కార్టూన్ షోల పేర్లు చెబితే పిల్లలే కాదు... పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. ఒత్తిడి పెరిగిపోతున్న జీవితాల్లో రిలాక్సేషన్ కోసం ఉపయోగపడే మందులవి. అందుకే అందరూ వాటిని ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... వాటికి వీరాభిమానులు అవుతున్నారు. ఎంతగా అంటే... ఓ కామిక్ క్యారెక్టర్ని చంపేస్తున్నామని పబ్లిషర్ చెప్పగానే, వద్దు అని గొడవ చేసేంత! ఆర్చీ ఆండ్రూస్... కామిక్ ప్రపంచంలో మార్మోగే పేరిది. దాదాపు డెబ్భై ఏళ్లుగా ఈ క్యారెక్టర్ అందరినీ ఉర్రూతలూగిస్తోంది. తన సాహసాలతో, అద్భుత విన్యాసాలతో, మంచితనంతో, హాస్యంతో పలు రకాలుగా ఆకట్టుకుంటూ వచ్చిన ఆర్చీ త్వరలో చచ్చిపోబోతున్నాడు. ఈ విషయం గురించి ఇటీవలే ఆర్చీ కామిక్స్ పబ్లిషర్, సీఈవో జాన్ గోల్డ్‌వాటర్ ప్రకటించారు. అంతే... తక్షణం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అది తమకు ఎంతో ఇష్టమైన పాత్ర అని, ఆర్చీని చంపడానికి వీల్లేదని ఫోన్లు, ఉత్తరాలు, మెయిళ్లు వస్తుండటంతో షాక్ తిన్నాడు గోల్డ్‌వాటర్. ఏడు దశాబ్దాలుగా పుస్తకాలు, యానిమేషన్లు, టీవీ షోలు, సినిమాల రూపంలో ఆర్చీ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఇప్పటికైనా అతడి కథకి ముగింపు చెబితే మంచిదనుకున్నాడు గోల్డ్‌వాటర్. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న ‘లైఫ్ విత్ ఆర్చీ’ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ని సిద్ధం చేశాడు. కానీ అభిమానుల ఒత్తిడి ఇంతగా ఉన్నప్పుడు ఆయన ఆ పని చేయగలడా అన్నదే సందేహం. చూద్దాం... ఆర్చీ ఆండ్రూస్ ఆయువు పెరుగుతుందో లేదో!