ముంబై : లాక్‌డౌన్ 5.0లో మహారాష్ట్ర భారీ సడలింపులు ప్రకటించింది. బిగిన్ అగైన్ పేరిట క్రమంగా సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. జూన్ 3 నుంచి బీచ్‌లు, పార్కులు, ఆటస్ధలాల్లో ప్రజలను అనుమతిస్తామని పేర్కొంది. 15 శాతం సిబ్బందితో 3 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇక జూన్ 5 నుంచి మాల్స్ మినహా అన్ని మార్కెట్లు కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
ట్యాక్సీలు, ఆటోలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సులను అనుమతిస్తారు. ఇక జూన్ 8 నుంచి పది శాతం సిబ్బంది హాజరుతో అన్ని ప్రైవేట్ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా కంటైన్మెంట్ జోన్లలో ఈ సడలింపులు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment