
అరోమాథెరపీ చేయించుకుంటున్న దీపిక
వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇప్పుడు బాగా అలసిపోయింది. దాంతో అరోమాథెరపీ మసాజ్ చేయించుకుని రిలాక్స్ అవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం తాను పారాచూట్ అడ్వాన్స్డ్ స్పెషల్ ఎడిషన్ అరోమాథెరపీ ఆయిల్ వాడుతున్నట్లు చెప్పింది. రోజంతా పనిలో మునిగిపోయి, అలసిపోయిన తర్వాత అరోమాథెరపీ తనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుందని, ఈ ఆయిల్తో తలకు మసాజ్ చేయించుకుంటే ఒత్తిడి నుంచి కూడా సులభంగా బయటపడొచ్చని దీపిక చెప్పింది.
అయితే ప్రతిరోజూ ఒకే సమయానికి మాత్రం ఇలా చేయడం తనకు అంత సులభంగా వీలుకాదని అంటోంది. తనకు బాగా అలసటగా అనిపించినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు మాత్రం అప్పటికప్పుడు రిలాక్స్ అవ్వాలని ఉంటుందని, అప్పుడే అరోమాథెరపీ మసాజ్ చేయించుకుంటానని దీపిక చెప్పింది. తాజాగా ఆమె 'హేపీ న్యూ ఇయర్ ' సినిమాలో నటించింది.