ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం
చిక్కడపల్లి: ఏపీ మహిళా ఉద్యోగులకు బదిలీల్లో సడలింపులిచ్చి, భార్యాభర్తలు ఒకే చోట పని చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక భవన్ వద్ద ఆందోళన చేపట్టింది. పిల్లల చదువులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వెసులుబాటునివ్వాలని ఫోరం అధ్యక్షుడు వల్లభాయి పటేల్, మాజీ అధ్యక్షుడు పీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఏపీ మహిళా ఉద్యోగులకు సడలింపునివ్వాలి
Published Sun, Jun 5 2016 3:31 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement