ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో (Bilateral Series) అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.
ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.
భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. బ్యాటింగ్‌లో చెలరేగిన అభిషేక్ బౌలింగ్‌లోన సత్తా చాటి 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
ప్రస్తుత సిరీస్‌లో వరుణ్ ప్రదర్శనలు..
తొలి టీ20-3/23 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)
రెండో టీ20-2/38
మూడో టీ20-5/24 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)
నాలుగో టీ20-2/28
ఐదో టీ20-2/25
Comments
Please login to add a commentAdd a comment