
బెంగాల్‌లో లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు
కోల్‌కతా : కోవిడ్-19 లాక్‌డౌన్ నుంచి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం పలు సడలింపులను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మే 1 నుంచి గ్రీన్‌జోన్లలో స్టేషనరీ, ఎలక్ర్టానిక్స్, హార్డ్‌వేర్, మొబైల్, లాండ్రీ, టీ, పాన్ షాపులను అనుమతిస్తారు. అయితే షాపింగ్‌మాల్స్‌లో ఉండే ఎలాంటి షాపులను తెరిచేందుకు అనుమతించరు. టీ షాపులను తెరిచినా పెద్దసంఖ్యలో ప్రజలను గుమిగూడేందుకు అనుమతించబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
గ్రీన్‌జోన్లలో చిన్న షాపులతో పాటు ఫ్యాక్టరీలు, నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తామని అయితే ఆరోగ్య మార్గదర్శకాలను పాటిస్తూ ఇవి తమ కార్యకలాపాలను నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సడలింపులు కంటెయిన్మెంట్ జోన్లకు వర్తించవని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం మే 1 నుంచి లాక్‌డౌన్ సడలింపులు అమలవుతాయని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 550కి చేరింది. వీరిలో 119 మంది కోలుకోగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 22కి పెరిగింది.