‘పన్ను’లూడేది ఉద్యోగులకేనా?
2015–16లో ఇవీ... మన పన్ను లెక్కలు
∙మొత్తం రిటర్నులు వేసింది – 3.7 కోట్ల మంది
∙లిమిట్‌లోపలే ఉండి జీరో పన్ను చూపించింది – 99 లక్షలు
∙రూ.2.5– 5 లక్షల ఆదాయం చూపించింది – 1.95 కోట్లు
∙రూ.5–10 లక్షల ఆదాయం చూపించింది – 52 లక్షలు
∙రూ.10 లక్షలకన్నా ఎక్కువ ఆదాయం చూపించింది – 24 లక్షలు
∙రూ.5 లక్షల పైబడి ఆదాయం చూపించిన 76 లక్షల మందిలో ఉద్యోగులు – 56 లక్షలు
∙రూ.50 లక్షల పైబడి ఆదాయం చూపించింది – 1.72 లక్షల మంది
ఇదీ... పన్ను చెల్లింపుదారుల కథ. అంటే...
- దేశం మొత్తమ్మీద ఏడాదికి రూ.5 లక్షలకన్నా ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులు 56 లక్షల మందయితే... వైద్యులు,
న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్ల వంటి వృత్తినిపుణులంతా కలిసి 24లక్షల మంది ఉన్నారట!!. మరి వీళ్ల కొనుగోళ్లు ఎలా ఉన్నాయో చూస్తే బుర్ర తిరిగిపోకమానదు. ఎందుకంటే...
- గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.25 కోట్ల కార్లు అమ్ముడుపోయాయి. అంటే ఏడాదికి 24 లక్షల కార్లన్నమాట.
- వ్యాపారం కోసమో లేదా సరదాకో విదేశాలకు వెళ్లినవారు ఒక్క 2015లోనే 2 కోట్ల మంది ఉన్నారు.
కారు కొనాలంటే కనీసం రూ.4 లక్షలపైనే అవుతుంది. విదేశాలకెళ్లాలంటే కనీసం రూ.2 లక్షలు దాటుతుంది. కానీ వీళ్లంతా ఏడాదికి రూ.5 లక్షల లోపే ఆదాయం ఉన్నట్లు చూపిస్తున్నారంటే ఏమనుకోవాలి? అదే జైట్లీ వేసిన ప్రశ్న.
కంపెనీల సంగతి మరీ విచిత్రం..
- 2014 మార్చి 31 నాటికి దేశంలో రిజిస్టరైన కంపెనీలు – 13.94 లక్షలు
- 2015–16లో రిటర్న్‌లు వేసిన కంపెనీలు – 5.97 లక్షలు
- వీటిలో నష్టాన్నో లేదా సున్నా ఆదాయాన్నో చూపించినవి – 2.76 లక్షలు
- మిగిలిన వాటిలో పన్నుకు ముందు ఆదాయాన్ని రూ.కోటిలోపే చూపించినవి– 2.85 లక్షలు
- కోటి నుంచి రూ.10 కోట్ల ఆదాయాన్ని చూపించిన సంస్థలు – 28,667
- పన్నుకు ముందు ఆదాయం రూ.10 కోట్లు దాటినట్టు చూపిన కంపెనీలు– 7,781
అంటే... దాదాపు 14 లక్షల కంపెనీల్లో రూ.10 కోట్లు దాటిన ఆదాయాన్ని చూపించినవి కేవలం 7,781. అంటే 0.6 శాతం కూడా లేవు. అదీ మన కంపెనీల పన్ను కథ.
- పెద్ద నోట్లను రద్దు చేశాక నవంబర్ 8 – డిసెంబర్ 30 మధ్య 1.09 కోట్ల ఖాతాల్లో రూ.2 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య డిపాజిట్ అయ్యాయి. సగటు డిపాజిట్ రూ. 5.03 లక్షలు.
- రూ. 80 లక్షల పైబడి డిపాటిట్ అయిన ఖాతాలు 1.48 లక్షలున్నాయి. సగటు డిపాజిట్ రూ.3.31 కోట్లు.