జియోఫై పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ | Jio Offers 100% Cashback On Purchase Of JioFi In New Offer | Sakshi
Sakshi News home page

జియోఫై పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

Published Tue, May 16 2017 5:47 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

జియోఫై పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

జియోఫై పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది.  రిలయన్స్‌  జియోఫైపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారికి ఈ 100 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది.   పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్‌ స్కీంలో   భాగంగా రెండు పథకాలను లాంచ్‌ చేసింది.  జియో.కాం ద్వారా  పోర్టబుల్‌ 4జీ వైఫై రౌటర్‌ లేదా హాట్‌ స్పాట్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రవేశపెట్టింది.  ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద, రూ. 2,010 విలువైన జియో ఉచిత డేటాను,  ఎక్స్ఛేంజ్ లేకుండా  రూ. 1,005 విలువైన 4జీ డేటాను ఫ్రీగా ఆఫర్‌ చేస్తోంది.  
 
రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వినియోగిస్తున్న డాటా కార్డు లేదా డోంగల్ లేదా హాట్‌స్పాట్ రౌటర్‌(ఎయిర్‌టెల్‌. బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర)ను జియో ఫై 4జీ రౌటర్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు.  జియో ఫై రౌటర్‌ విలువు రూ.1999 లుగా ఉంది.   దీనికి  ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.  పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌  ప్లాన్లలో ఈ ఆఫర్‌ అందుబాటులోఉండనుంది.  రౌటర్‌ కొనుగోలు చేసిన వారికి  రూ.1005 విలువైన 5 వోచర్లను ఉచితంగా అందించనుంది.  ఎక్స్ఛేంజ్ లేకుండా  రూ.201 విలువైన 5 టాప్‌ అప్‌ కూపన్ల ద్వారా  4 జీ డేటా ఉచితం. ఇతర  నాన్‌ జియో రౌటర్లతో ఎక్సేంజ్‌ చేసుకుంటే   ఎక్స్ఛేంజ్ తో రూ.201 విలువైన 10టాప్‌ అప్‌ వోచర్లు ఉచితం.   ప్రతి నెల రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇలా వరుస 5 రీచార్జ్‌లకుగాను  కస్టమర్లకు అదనంగా   5జీబీ 4 జీ డేటా ఉచితంగా అందిస్తుంది. మార్చి 31, 2018వరకు ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయి.
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement