Jio Offers
-
Jio AirFiber: ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు జియో ఆఫర్లు..
జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) కస్టమర్లకు అదనపు డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ అన్లిమిటెడ్ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సినవారి కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. జియో కొన్ని నెలలుగా దేశంలోని పలు నగరాల్లో ఎయిర్‌ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించే వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. 1 నుంచి 1.5 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగల దీన్ని నివాస, కార్యాలయ వినియోగం కోసం రూపొందించారు. జియో ప్రకారం.. దాని ఎయిర్ ఫైబర్ వినియోగదారులు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను ఆనందించవచ్చు. అయితే ఈ పరిమితిని చేరుకున్న తర్వాత, వేగం తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఎంపికలను అందించడానికి మూడు రకాల డేటా బూస్టర్ ప్యాక్‌లను అందిస్తోంది. డేటా బూస్టర్ ప్లాన్ వివరాలు 1TB కంటే ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యేవారు స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. రూ. 101 ప్లాన్: ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను అందిస్తుంది. రూ. 251 ప్లాన్: ఈ ప్లాన్‌తో మీరు మీ బేస్ ప్లాన్‌లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందుతారు. రూ. 401 ప్లాన్: ఇది మీ బేస్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ అందిస్తుంది. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై అదిరిపోయే ఆఫర్లు, ఫుల్‌గా బెనిఫిట్స్ కూడా!
దసరా పండుగ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో కూడా తగ్గేదేలే అంటూ తన కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లను ప్రకటించింది. దసరా సందర్భంగా రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది జియో. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. కొన్ని రోజులే మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. జియో ఫైబర్ తన కస్టమర్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో పాటు పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులో ఉంచింది. తాజాగా జియో ఫైబర్‌కు చెందిన రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తన కొత్త కస్టమర్ల కోసం రూ. 599, రూ. 899 ప్లాన్లపై అవాకయ్యే ఆఫర్లును జత చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. JioFiber ప్రకటించిన ఫెస్టివల్ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.. JioFiber ₹599 ప్లాన్ ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 30 Mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌తో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్ కూడా ఉన్నాయండోయ్ ►రిలయన్స్ డిజిటల్లో ₹1000 తగ్గింపు ►Myntra లో ₹1000 తగ్గింపు, Ajioలో ₹1000 తగ్గింపు ►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు. జియో ఫైబర్ ఫెస్టివల్ బొనాంజా కింద ఈ ప్రయోజనాలను పొందాలంటే, కొత్త కస్టమర్లు తప్పనిసరిగా కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. JioFiber ₹899 ప్లాన్ ఈ ప్లాన్‌లో 100 Mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్ కూడా ఉన్నాయండోయ్ ►రిలయన్స్ డిజిటల్లో ₹500 తగ్గింపు ► Myntraలో ₹500 తగ్గింపు ►Ajioలో ₹1000 తగ్గింపు ►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు. అయితే జియో ఫైబర్ కొత్త కస్టమర్ కనీసం 3 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
జియోఫై పై క్యాష్ బ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్ జియోఫైపై 100 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారికి ఈ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్ స్కీంలో భాగంగా రెండు పథకాలను లాంచ్ చేసింది. జియో.కాం ద్వారా పోర్టబుల్ 4జీ వైఫై రౌటర్ లేదా హాట్ స్పాట్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద, రూ. 2,010 విలువైన జియో ఉచిత డేటాను, ఎక్స్ఛేంజ్ లేకుండా రూ. 1,005 విలువైన 4జీ డేటాను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వినియోగిస్తున్న డాటా కార్డు లేదా డోంగల్ లేదా హాట్‌స్పాట్ రౌటర్(ఎయిర్టెల్. బీఎస్ఎన్ఎల్ తదితర)ను జియో ఫై 4జీ రౌటర్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. జియో ఫై రౌటర్ విలువు రూ.1999 లుగా ఉంది. దీనికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లలో ఈ ఆఫర్ అందుబాటులోఉండనుంది. రౌటర్ కొనుగోలు చేసిన వారికి రూ.1005 విలువైన 5 వోచర్లను ఉచితంగా అందించనుంది. ఎక్స్ఛేంజ్ లేకుండా రూ.201 విలువైన 5 టాప్ అప్ కూపన్ల ద్వారా 4 జీ డేటా ఉచితం. ఇతర నాన్ జియో రౌటర్లతో ఎక్సేంజ్ చేసుకుంటే ఎక్స్ఛేంజ్ తో రూ.201 విలువైన 10టాప్ అప్ వోచర్లు ఉచితం. ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వరుస 5 రీచార్జ్లకుగాను కస్టమర్లకు అదనంగా 5జీబీ 4 జీ డేటా ఉచితంగా అందిస్తుంది. మార్చి 31, 2018వరకు ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయి. -
15 నెలలు అన్నీ ఫ్రీ... జియో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఉచిత డాటా, ఉచిత రోమింగ్ అంటూ టెలికం మార్కెట్ లోకి దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ కొత్త వినియోగదారులు అందరికీ తన జియో నెట్వర్క్ ద్వారా ఏడాది పాటు ఉచిత సేవలను అందించే 'ప్లాన్'ను ప్రకటించింది. నెలవారీ రూ.1,499 రీచార్జ్ తోలభించే సేవలను కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రం ఏడాది పాటు పూర్తి ఉచితంగా అందించనుంది. ఇప్పటివరకూ ఉన్న వెల్కం ఆఫర్‌తో పాటు తాజా ప్రకటనతో మొత్తం 15నెలల పాటు ఉచిత సర్వీసులు ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. 2017 జనవరి నుంచి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. జియో నెట్ వర్క్ లోని వెల్కం ఆఫర్ గడువు ఈ సంవత్సరం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఆ తర్వాత ఐఫోన్ల కొత్త వినియోగదారులు అందరూ వచ్చే ఏడాది జనవరి 1నుంచి ఈ ఆఫర్ ను పొందవచ్చు. అంటే.. ఇప్పటికే ఐఫోన్ వినియోగిస్తున్నవాళ్లు కాకుండా.. కొత్తగా ఐఫోన్లు కొన్నవాళ్లు మాత్రమే ఈ ఆఫర్ పొందగలరన్న మాట. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కేవలం ఐ ఫోన్ 7 యూజర్లకు మాత్రమే తన తాజా ఆఫర్ ను పరిమితం చేసింది. (చదవండి: ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్) రిలయన్స్ జియో మాత్రం ఆపిల్ కొత్త ఆవిష్కరణలు ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్ తో పాటు ఐఫోన్ 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ ఇతర ఐ ఫోన్ల యూజర్లందరీకి ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.