15 నెలలు అన్నీ ఫ్రీ... జియో బంపర్ ఆఫర్ | Jio Offers New iPhone Users Free Service For 15 Months | Sakshi
Sakshi News home page

15 నెలలు అన్నీ ఫ్రీ... జియో బంపర్ ఆఫర్

Published Sat, Oct 8 2016 1:21 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

15 నెలలు అన్నీ ఫ్రీ... జియో బంపర్ ఆఫర్ - Sakshi

15 నెలలు అన్నీ ఫ్రీ... జియో బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: ఉచిత డాటా, ఉచిత రోమింగ్ అంటూ టెలికం మార్కెట్ లోకి దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ కొత్త వినియోగదారులు అందరికీ తన జియో నెట్వర్క్ ద్వారా ఏడాది పాటు ఉచిత సేవలను అందించే 'ప్లాన్'ను ప్రకటించింది. నెలవారీ రూ.1,499 రీచార్జ్ తోలభించే సేవలను కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రం ఏడాది పాటు పూర్తి ఉచితంగా అందించనుంది. ఇప్పటివరకూ ఉన్న వెల్‌కం ఆఫర్‌తో పాటు తాజా ప్రకటనతో మొత్తం 15నెలల పాటు ఉచిత సర్వీసులు ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

2017 జనవరి నుంచి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.  జియో నెట్ వర్క్ లోని  వెల్‌కం ఆఫర్ గడువు ఈ సంవత్సరం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఆ తర్వాత ఐఫోన్ల కొత్త వినియోగదారులు అందరూ వచ్చే ఏడాది  జనవరి 1నుంచి ఈ ఆఫర్ ను పొందవచ్చు. అంటే.. ఇప్పటికే ఐఫోన్ వినియోగిస్తున్నవాళ్లు కాకుండా.. కొత్తగా ఐఫోన్లు కొన్నవాళ్లు మాత్రమే ఈ ఆఫర్ పొందగలరన్న మాట.

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కేవలం ఐ ఫోన్ 7 యూజర్లకు మాత్రమే తన తాజా ఆఫర్ ను పరిమితం చేసింది. (చదవండి: ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్) రిలయన్స్ జియో మాత్రం ఆపిల్ కొత్త ఆవిష్కరణలు ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్ తో పాటు  ఐఫోన్ 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ ఇతర ఐ ఫోన్ల యూజర్లందరీకి ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement