free service
-
వారికి ఉచితం.. వరద బాధితులకు సుజుకీ ఆఫర్
మిచాంగ్ (Michaung) తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక వర్షపు నీటితో వాహనాలన్నీ పాడైపోయాయి. ఈ క్రమంలో వీరికి అండగా జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటర్‌సైకిల్ ముందుకు వచ్చింది. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత సర్వీస్‌ను ప్రారంభించినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ సంస్థ శనివారం తెలిపింది. వరద బాధితులపై వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో డీలర్ నెట్‌వర్క్‌లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్‌లతో సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్ చివరి వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్లను ఉచితంగా రీప్లేస్మెంట్ చేస్తున్నట్లు తెలిపింది. మిచాంగ్ తుఫాను పలు నగరాల్లోని ప్రజల జీవితాలు, వారి వస్తువులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. దీని కింద వాహనాల సర్వీస్‌తో పాటు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చొరవ వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా తమ కస్టమర్ల కోసం మొబిలిటీని త్వరగా పునరుద్ధరించడాన్ని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు! -
టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్
అమృత్సర్ పేరు వినబడగానే ‘స్వర్ణ దేవాలయం’ గుర్తుకు వస్తుంది. ఈ పవిత్ర నగరంలో ఒక విశేషమైన టీ స్టాల్ ఉంది. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అనే ఈ టీ స్టాల్లో టీ ఉచితంగా ఇస్తారు. ఎనభై సంవత్సరాల అజిత్‌సింగ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద చెట్టు ఊడల మధ్య ఈ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. అజిత్‌సింగ్‌ను అందరూ ‘బాబాజీ’ అని పిలుస్తారు. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎప్పుడైనా ఉచితంగా టీ తాగవచ్చు. గతంలో ఈ టీస్టాల్‌లోని వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. అయినప్పటికీ బాబాజీ ఉచిత టీ ఇవ్వడం ఆపలేదు. -
Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ 'ఉబర్' (Uber) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ రోజు మన ప్రయాణాలను మరింత సుగమనం చేయడానికి ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ యాప్‌లో కంపెనీ కూడా గుర్తించని ఒక బగ్ ఒక ఇండియన్ గుర్తించి సంస్థ నుంచి భారీ నజరానా పొందాడు. నివేదికల ప్రకారం.. ఉబర్ యాప్‌లో ఫ్రీ రైడింగ్‌కి సంబంధించిన ఒక బగ్ ఉన్నట్లు భారతీయ ఎథికల్ హ్యాకర్ 'ఆనంద్ ప్రకాశ్' కనిపెట్టాడు. ఈ విషయాన్నీ స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి కంపెనీ అతనికి రూ. 4.5 లక్షలు బహుమతిగా అందించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్‌లో కనిపించిన ఈ కొత్త బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఫ్రీ రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, అప్పుడు కంపెనీ ఎక్కువ నష్టాలను భరించాల్సి వచ్చేది. కానీ ఎట్టకేలకు ఇది హ్యాకర్ కంటపడి కంపెనీ దృష్టికి చేరటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. దీని గురించి ఒక వ్యక్తి చెప్పే వరకు కంపెనీ గుర్తించకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!) ప్రకాష్ 2017లో ఈ కనుగొన్నట్లు, 2019లో దీని గురించి కంపెనీకి వివరించినట్లు సమాచారం. కంపెనీకే తెలియని విషయం చెప్పిన ఇతనికి సంస్థ జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి వివరంగా తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వివరించారు. -
స్టార్టప్‌లకు ఉచితంగా 5జీ టెస్ట్‌బెడ్
న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన అంకుర సంస్థలు, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) 2024 జనవరి వరకూ 5జీ టెస్ట్ బెడ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. మిగతా పరిశ్రమవర్గాలు, విద్యారంగం, సర్వీస్ ప్రొవైడర్లు, పరికరాల తయారీ సంస్థలు మొదలైన వర్గాలు నామమాత్రపు రేటుతో దీన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే పలు స్టార్టప్‌లు, కంపెనీలు తమ ఉత్పత్తులు, సర్వీసులను పరీక్షించేందుకు ఈ టెస్ట్ బెడ్‌ను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. 5జీ సేవలకు ఊతమిచ్చే విధంగా రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్ బెడ్‌ను రూపొందించే ప్రాజెక్టుకు 2018లో టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. 2022 మే 17న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలు టెస్ట్ బెడ్ రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. -
సముచిత న్యాయానికి...
నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు. నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్‌ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్‌కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి. సరైన పరిష్కారానికి.. సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది. మహిళలు.. పిల్లలు అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు. కాలేజీలు.. పాఠశాలలు ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పారా లీగల్ వాలెంటీర్లు వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది. – నిర్మలారెడ్డి ఉచితంగా న్యాయ సేవ పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ సంప్రదించవచ్చు. అవగాహన తప్పనిసరి ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. – రాజేశ్వరి, అడ్వకేట్ -
వైద్య విద్యకు... చలో ఫారిన్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ మెడిసిన్ చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను కేంద్రం హుటాహుటిన స్వదేశానికి తీసుకొచ్చింది. దాంతో విదేశాల్లో వైద్య విద్యపై మరోసారి చర్చ ఊపందుకుంది. ఉక్రెయిన్‌తో పాటు రష్యా, చైనా తదితర దేశాల్లో లక్షలాది మంది భారత విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. మన దగ్గర మెడిసిన్ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది... భారత్‌లో డాక్టర్ చదువు అంత ఈజీ కాదు. ప్రతిభ ఒక్కటే సరిపోదు. విపరీతమైన పోటీని ఎదుర్కోవాలి. దానికి తోడు బాగా డబ్బు కూడా ఉండాలి. మన దేశంతో పోల్చి చూస్తే పలు దేశాల్లో కారు చౌకగా మెడిసిన్ చదువుకునే అవకాశాలుండటంతో మన విద్యార్థులు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 88,120 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లున్నాయి. వీటిలో 284 ప్రభుత్వ కాలేజీల్లో 43,310 సీట్లు, 269 ప్రైవేటు కాలేజీల్లో 41,065 సీట్లున్నాయి. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి గతేడాది ఏకంగా 15.44 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 8.7 లక్షల మంది పాసయ్యారు. అయినా వీరిలో సీటు దొరికేది 10 శాతం మందికే. అర్హులకు, అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య భారీ అంతరముంది. ఖర్చు తడిసిమోపెడు దేశవ్యాప్త పోటీని తట్టుకొని నీట్లో మంచి మార్కులు సంపాదించినా ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర మెడిసిన్ కోర్సుకయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందులోనూ ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ చదివించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి కోటికి పైగా కావాల్సిందే. అదే ఉక్రెయిన్ వంటి దేశాల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల్లోపే పూర్తవుతుంది. ప్రాక్టీసూ కష్టమే ఎంబీబీఎస్ తర్వాత మన దేశంలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఏ) నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయాలి. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్‌కు అవకాశం వస్తుంది. అయితే అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండుల్లో మెడిసిన్ చదివేవారు ఈ పరీక్షతో పని లేకుండా భారత్‌లో నేరుగా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. రష్యా, చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, నేపాల్, కజకిస్తాన్, ఉక్రెయిన్ మెడికోలు మాత్రం ఈ పరీక్ష పాసై తీరాలి. ఏటా 13 వేల మందికి పైగా పరీక్షలో రాస్తుండగా 15 శాతానికి మించి పాసవడం లేదు. విదేశాలకు వెళ్లడం ఇక ఈజీ కాదు మోదీ ప్రభుత్వం నీట్ ప్రవేశపెట్టాక విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ చదవడం కష్టతరంగా మారింది. నీట్లో కనీసం 119 మార్కులు వస్తేనే విదేశాల్లో కూడా వైద్య విద్యకు అర్హులవుతారు. దీంతో కొన్నేళ్లుగా మెడిసిన్ కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గింది. నీట్ నిబంధన వల్ల ప్రతిభ ఉన్నవారే విదేశాలకు వెళ్లగలుగుతున్నారని ఎఫ్ఎంజీఈ కోచింగ్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ నీరజ్ చౌరాసియా అన్నారు. ప్రతిష్ట కోసం విదేశాల్లో డాక్టర్ చదవాలనుకునే వారికి అడ్డుకట్ట పడ్డట్టేనని అభిప్రాయపడ్డారు. అంతటా మనవాళ్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పలు దేశాల్లో ప్రాక్టీసు చేస్తున్న వైద్యుల్లో లక్షకు పైగా భారత్‌లో శిక్షణ పొందిన వారే ఉన్నారు. ఒక్క అమెరికాలోనే 50 వేల మందికి పైగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు, కెనడాలో ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులే. ఇంగ్లండ్‌లో రిజిస్టర్డ్ వైద్యుల్లో తొమ్మిది శాతం అంటే 40 వేలకు పైగా భారతీయులేనని అంచనా. బంగ్లాదేశ్ భేష్ ఎఫ్ఎంజీఈ రాసేవారిలో బంగ్లాదేశ్ ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్లు అద్భుతంగా రాణిస్తూ టాపర్లుగా నిలుస్తున్నారు. భారత్‌లో మాదిరి సిలబసే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. చైనా, ఉక్రెయిన్, రష్యాలో చదివిన విద్యార్థులు అట్టడుగున నిలుస్తున్నారు. భారత్‌లోనే చదివేలా ఆదేశాలివ్వండి సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో మధ్యలో ఆగిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు వీలు కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుర్రా విద్య, సునీత రాజ్ సహా 50 మంది విద్యార్థుల తరఫున న్యాయవాది రమేశ్ అల్లంకి ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అందులో పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కూడా కోరారు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నా. ఆర్థికంగా కలిసొస్తుందనే అంత దూరం వెళ్లా. ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి, కేంద్రంతో సమన్వయం చేసుకుని క్షేమంగా తిరిగొచ్చేలా చూసింది. – రేష్మ, తెనాలి రెండుసార్లు నీట్ రాసినా బీడీఎస్‌లో సీటొచ్చింది. ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ వెళ్లాను. అక్కడ ఏటా రూ.4 లక్షలవుతుంది. ఇక్కడైతే ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చేతికి రావాలంటే కోటి దాకా పెట్టాలి. దుష్యంత్, గుమ్ములూరు, మహబూబాబాద్ మా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నా. ఫస్టియర్‌లో ఉన్నా. తిరిగొచ్చాక ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా భవిష్యత్తు ఏమిటో అయోమయంగా ఉంది. – కుడుపూడి భవ్యన, అమలాపురం, తూర్పుగోదావరి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొనలేక మా నాన్న అప్పు చేసి ఉక్రెయిన్ పంపారు. ఉక్రెయిన్ వర్సిటీ ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. కానీ డాక్టర్ కోర్సు ఆన్లైన్లో చదవడం చాలా కష్టం. తెలంగాణ ప్రభుత్వం మాకు నేరుగా ఎంబీబీఎస్‌లో సీటివ్వాలి. – బుస్రా, సానియా (అక్కాచెల్లెళ్లు) మాలపల్లి, నిజామాబాద్ – నేషనల్ డెస్క్, సాక్షి -
ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్ మ్యూజిక్ సరికొత్త ఆఫర్
సంగీత ప్రియులకు శుభవార్త ! ఇంతకాలం పెయిడ్ సర్వీసుగా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్‌ని ఇకపై కస్టమర్లకు ఫ్రీగా అందివ్వాలని గూగుల్ నిర్ణయించింది. ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తే అచ్చంగా రేడియో తరహాలో ఇకపై సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. యూట్యూబ్‌తో ఇబ్బంది నచ్చిన పాటలు వినాలంటే అనేక యాప్ అందుబాటులో ఉన్నా ప్రధానంగా ఎక్కువ మంది ఉపయోగించేంది యూట్యూబ్. అయితే ఈ యాప్ ప్రధానంగా వీడియో ఆధారితమైనది కావడంతో కచ్చితంగా వీడియోను చూడాల్సి వస్తుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రైయిన్ అయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్ సంస్థ యూట్యూబ్ మ్యూజిన్‌కి అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మ్యూజిక్ ఫ్రీ యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో స్క్రీన్‌ను ఆఫ్ చేసి పాటలు వినొచ్చు ఇతర యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా పెయిడ్ సర్వీస్‌గా అందుబాటులో ఉంది. దీంతో చాలా మందికి ఆ యాప్ చేరుకకాలేకపోయింది. అయితే తాజాగా ఈ సర్వీసును ఫ్రీగా అందించాలని గూగుల్ నిర్ణయించింది. ఎటువంటి రుసుము చెల్లించకుండానే సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. మొదట అక్కడే యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. మొదట కెనడాలో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని.. ఆ తర్వాత దశల వారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఫ్రీ సర్వీసులో యాడ్స వస్తాయని తెలిపింది. యాడ్స వద్దనుకున్నవారు పెయిడ్ సర్వీసును ఎంచుకొచ్చని సూచించింది. ఎప్పుడంటే ఇండియాలో కొన్ని హై ఎండ్‌మొబైల్ ఫోన్లలో బండిల్ ఆఫర్‌గా యూట్యూబ్ మ్యూజిక్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతాన్ని ఎంజాయ్ చేయోచ్చు. చదవండి : Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా? -
హైదరాబాద్ వ్యాప్తంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, ‘యాక్ట్ ఎక్స్‌క్లూజివ్’ ఆఫర్
ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తన యూజర్లకు శుభవార్తను ప్రకటించింది. ఇంటి దగ్గరే కాకుండా బయటకు వెళ్లినా సరే ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అపరిమితంగా పొందేలా ఏర్పాటు చేసింది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై జోన్లు ఏర్పాటు చేసింది. హై-ఫైలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. అందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించారు. ఈ వైఫై సెంటర్ల దగ్గర 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. హై-ఫైలో భాగంగా గరిష్టంగా వన్ జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది. యాక్ట్ స్మార్ట్ ఫైబర్ తాజగా యాక్ట్ స్మార్ట్ పైబర్ టెక్నాలజీ సాయంతో తన వినియోదారుకలు ఇంటి బయట కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది యాక్ట్ సంస్థ. ఇళ్లు లేదా ఆఫీస్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ప్లాన్‌లో ఉందో. అదే ప్లాన్‌తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా నెట్‌ను వాడుకునే అవకాశం కలిపించింది. . అంటే ఫ్రీ వైఫై సెంటర్ల దగ్గర సాధారణ యూజర్లకు 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కేవలం 45 నిమిషాల పాటే నెట్ అందితే, యాక్ట్ యూజర్లకు వారి ఇంటి దగ్గర ప్లాన్ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వీలు ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వరంగల్‌లో కూడా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్లోనూ ఉచిత వైఫై సేవలు ప్రారంభించినట్టు యాక్ట్ సంస్థ తెలిపింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల పరిధిలో మొత్తం 18 ఉచిత వైఫై సెంటర్లు అందుబాటులోకి తెచ్చింది. కాలేజీలు, లైబ్రరీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ఇలా చేయాలి - ఫ్రీ ఇంటర్నెట్ పొందాలంటే హై ఫై నెట్ జోన్ పరిధిలోకి వెళ్లాలి - వై-ఫై సెట్టింగ్స్‌లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి - వెంటనే యూజర్ లాగిన్ పాప్అప్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి - మీ మొబైల్ నంబరుకి నాలుగు అంకెలా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి - సాధారణ వినియోగదారుల కాల పరిమితి ముగిసిన తర్వాత రూ. 25, రూ. 50తో టాప్‌ఆప్ పొందవచ్చు. యాక్ట్ వినియోగదారులకైతే ఇంటి దగ్గర ప్లాన్‌నే ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు. చదవండి : భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
వినియోగదారులకు 'హ్యుందాయ్' శుభవార్త, తక్కువ ధరకే..
హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ‘‘షీల్డ్ ఆఫ్ టస్ట్ర్ సూపర్’’ పేరుతో మెయింటెనెన్స్ సర్వీసులను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కొత్త కారుకు ఐదేళ్లు గడువు లేదా 50వేల కిలోమీటర్ల దూరం సేవలను అందిస్తామని తెలిపింది. బ్రేక్‌లు, క్లచ్, వైపర్, బెల్ట్‌తో సహా మొత్తం 14 ప్రధాన భాగాల రిపేర్లు ఈ సర్వీసు పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్‌కు చెందిన 10 మోడళ్లలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వాహన నిర్వహణ వ్యయ నియంత్రణ లక్ష్యంతో ఈ సర్వీసులను ప్రారంభించినట్లు కంపెనీ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. -
20 చెక్కులే ఉచితం... ఆ తర్వాత ఛార్జీలే
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ఉచిత చెక్కుల విషయంలో పరిమితి విధించింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి 20 ఉచిత చెక్కుల సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు నూతన ఖాతాదారులకు తొలి ఏడాది 60, ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాది 50 చెక్కులను ఉచితంగా అందిస్తుండడం గమనార్హం. ఈ పరిమితి దాటిన తర్వాతే ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5 చార్జీని వసూలు చేస్తుండగా.. ఇకపై ఈ పరిమితి ఏడాదికి 20 చెక్కులుగా అమల్లోకి రానుంది. మినహాయింపు సబ్కా సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు చెక్కుల విషయంలో ఎటువంటి పరిమితి ఉండదంటూ బ్యాంకు స్పష్టం చేసింది. ఇక బ్యాంకు మాతృశాఖ, ఇతర శాఖల్లో ప్రతీ నెలా నగదు జమ లావాదేవీల పరిమితిలోనూ మార్పు చేసింది. జూలై 1 నుంచి ఈ సవరణలు అమల్లోకి రానున్నట్టు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది. -
టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్!
ముంబై: దేశంలో కరోనా విజృంభణ కారణంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల వారంటీ, ఉచిత సర్వీసుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తమ వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది. టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 31, 2021 నుంచి 2021 మే 31 మధ్య కాలంలో ముగియనున్న ప్రయాణీకుల కార్ల వారంటీ, ఉచిత సర్వీసుల కాలాన్ని ఇప్పుడు 2021 జూన్ 30 వరకు పొడగించింది. కోవిడ్ -19 కారణంగా తమ వినియోగదారులు వాహనాలను నిర్వహణ, మరమ్మతుల కోసం టాటా మోటార్స్ సేవా కేంద్రాలకు తీసుకురాలేరు కాబట్టి ఈ ప్రకటన చేసినట్లు టాటా మోటార్స్, పీవీబియు, కస్టమర్ కేర్(డొమెస్టిక్ & ఐబి) హెడ్ డింపుల్ మెహతా వివరించారు. లాక్డౌన్ సమయంలో వారంటీ, ఉచిత సర్వీసుల కాలం ముగిస్తే అది మాకు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన చెప్పారు. మెహతా మాట్లాడుతూ.. "మేము మా కస్టమర్లకు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాము. అందుకే వారి వారంటీ, ఉచిత సర్వీసుల వ్యవధిని 2021 జూన్ 30 వరకు పొడిగించడం ద్వారా ఈ కఠినమైన సమయాల్లో వారికి కొంతైన మద్దతు ఇస్తున్నాము. ఈ చొరవ ద్వారా, మేము మా బ్రాండ్ కస్టమర్లతో కనెక్ట్ అవుతున్నాము" అని అన్నారు. టాటా మోటార్స్ సంస్థకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కి పైగా ప్రాంతాల్లో 608 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి అని తెలిపారు. చదవండి: త్వరలో మార్కెట్లోకి హ్యార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ బైక్స్ -
కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే..
సాక్షి, బంజారాహిల్స్: కరోనా పాజిటివ్ బాధితులకు ఎలాంటి డెలివరీ చార్జీలు లేకుండా సరుకులు సరఫరా చేసేందుకు కౌన్సిల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(సీటీఐ) అనుబంధ ‘ది హైదరాబాద్ ఎసెన్షియల్స్ డెలివరి కలెక్టివ్’ అనే సంస్థ ముందుకొచ్చింది. కరోనా సోకిన వారు తమకు ఫోన్ చేస్తే వారు కోరుకున్న సరుకులను ఇంటి వద్దకు చేరుస్తామని ప్రతినిధులు ప్రకటించారు. కొనుగోలు చేసిన సరుకులకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, తామంతా వారి ఇళ్ల వద్దకు వెళ్లి బ్యాగులు ఇంటి ముందు పెడతామని సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ వక్రాల వెల్లడించారు. తమకు ఇప్పటికే 37 మంది వలంటీర్లు నగర వ్యాప్తంగా ఉన్నారని, ప్రతిరోజూ 70 మందికి ఈ సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 8340903849 నంబర్‌కు ఫోన్ చేస్తే సరుకుల జాబితాను తీసుకొని అరగంటలో ఇంటి ముందు ఆ బ్యాగును ఉంచుతామని ఆయన వెల్లడించారు. -
స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న ఆక్సిజన్ సిలిండర్ల దందాకు రాచకొండ ఎస్ఓటీ, మల్కాజిగిరి పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి వాహనం, ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు.. కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ మాస్ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. కరోనా బాధితులుకు ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సు సేవలు ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు. ఉచితం అంటూ బ్లాక్మార్కెట్లో అమ్మకం ఈ ముసుగులో సల్మాన్ అనే వ్యక్తి నుంచి 150 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్‌ను రూ.16 వేలకు ఖరీదు చేస్తున్నాడు. ఆపై నల్లబజారుకు తరలించి కరోనా పేషెంట్లకు రూ.25 వేలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న వాహనం మౌలాలీ మీదుగా ఈసీఐఎల్ వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మల్కాజిగిరి పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు జెడ్టీఎస్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరికి మాస్ ఫౌండేషన్ అంటూ రాసి ఉన్న ఓమ్నీ వాహనం కనిపించింది. అనుమానంతో తనిఖీ చేయగా అందులో 150 లీటర్ల 5 ఆక్సిజన్ సిలిండర్లు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు వాహనంలో లభించలేదు. ఓమిని వ్యాన్ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లాతో పాటు వాహనంలోని మహ్మద్ మజార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఫలితంగా ఆసిఫ్ చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు, వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర అత్యవసర మందుల అక్రమ దందాలపై కన్నేసి ఉంచుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్ ) -
‘వీడియో గేమ్ ఆడితే 83 ఏళ్లు ఫ్రీ’
ముంబై: గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులను ఆకర్శించే ప్రణాళికను నెట్‌ఫ్లిక్స్ రచించింది. అయితే వినియోగదారులు ఉచిత సేవలను పొందాలంటే ‘ద ఓల్డ్ గార్డ్’ అనే వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్ తెచ్చుకోవాలని షరతు పెట్టింది. వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన వినియోగదారులకు 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్ ఉచిత సేవలను పొందవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ఈ వీడియో గేమ్‌ను జులై 17 8గంటల నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఉచిత సేవల ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020) ఎన్నో ప్రతికూలతలున్న రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్డౌన్, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో కుటుంబ సమేతంగా సినిమాలు వీక్షించే వారికి నెట్‌ఫ్లిక్స్ మంచి క్వాలిటీ అందిస్తు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న విషయం తెలిసిందే. (చదవండి: శాంసంగ్ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్’ కట్) -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్‌లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్‌లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్‌లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్‌లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్‌కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్‌లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్‌లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్‌లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
సేవా మోహనుడు
మానవసేవే మాధవసేవ అని అందరూ సూక్తులు చెబుతుంటారు తప్ప ఆచరణలో ఎవరూ పాటించరు. కోట్లకు పడగలెత్తిన వారు సైతం గుళ్లో ఉన్న మాధవుడికి మొక్కుతారు తప్ప...గుడి బయట ఉన్న మానవుడిని పట్టించుకోరు. సేవ చేయాలనే మనసు ఉండాలే కానీ...లక్షలు, కోట్లు ఉండనవసరం లేదని, ఉన్నంతలోనే సేవ చేయవచ్చని గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ అనే యువకుడు నిరూపిస్తున్నాడు. లక్ష్మీపురం(గుంటూరు): ఆ యువకుడు వ్యాపార వేత్తో, ఉన్నతోద్యోగో కాదు... గ్యాస్ కంపెనీలో పని చేసే సాధారణ కూలీ. డబ్బుకు పేద అయినా...సేవలో రాజు..అతని పేరు జొన్నలగడ్డ రాజమోహన్. చిన్నతనంలో తల్లిదండ్రులు ఏ పూటకు ఆ పూట పనిచేసి కుటుంబాన్ని పోషించే వారు. ఒక్కో సందర్భంలో కుటుంబమంతా పస్తులున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. అందుకే ఉన్నంతలో...తను చేయగలినంతలో అన్నార్తులకు, దాహార్తులకు సేవ చేస్తున్నాడు. నగరంలోని హనుమయ్య నగర్‌కు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ హెచ్.పి గ్యాస్ కంపెనీలో నెలకు కేవలం 7వేల రూపాయల వేతనంపై పనిచేసే కూలీ. నెల జీతం అంతా కుటుంబ పోషణకు వినియోగిస్తాడు. భార్య సుజాత టైలరింగ్ చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. రాజమోహన్ ఖాళీ సమయంలో గ్యాస్ స్టౌవ్ రిపేర్లు చేస్తుంటాడు. ఈ అదనపు పనితో వచ్చి డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు. సహృదయ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వారానికి సుమారు 40 మందికి అన్నదానం చేస్తుంటాడు. తల్లి దండ్రులు లేని అనాథ విద్యార్థులను చదవించడం, వారికి పుస్తకాలు, బ్యాగ్‌లు, దుస్తులు ఇవ్వడంతో పాటు వారికి కావల్సిన అవసరాలు తీరుస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. తన ద్విచక్రవాహనానికి మినరల్ వాటర్ క్యాన్‌ను కట్టుకొని సంచార చలివేంద్రం నడుపుతూ ఉచితంగా మంచినీరు అందిస్తాడు. ప్రతి సోమవారం జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీరు అందిస్తాడు. రోజూ ఎవరికో ఒకరికి సేవ చేస్తేనే తనకు తృప్తిగా ఉంటుందంటాడు రాజమోహన్. -
శభాష్... సంజయ్..
బంజారాహిల్స్: ప్రార్ధించే పెదవులకన్నా...సాయం చేసే చేతులు మిన్న అనే భావనతో ఓ ఆటోడ్రైవర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తినిస్తున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అభాగ్యులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు మ్యాదరి సంజయ్. బోరబండ నివాసి. చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయాడు. కూలీపనిచేస్తూ జీవనం సాగించేవాడు. తరువాత పెళ్లి చేసుకొని బోరబండలో నివాసం ఉంటున్నాడు. 2010 నవంబర్‌లో ఓ రోజు అర్ధరాత్రి గర్భంతో ఉన్న తన భార్యకు నొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో కోసం చాలా తిరిగాడు. ఇంత రాత్రివేళ మేము ఆస్పత్రికి రాలేం అని చాలామంది చెప్పారు. చివరకు ఓ పెద్దాయన రిక్షా ఇచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు. అంతరాత్రి స్వయంగా రిక్షాలో భార్యను నీలోఫర్‌కు తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఆపద నుంచి బయటపడ్డాడు. ఆ సంఘటన సంజయ్ మనసులో నాటుకుపోయింది. సకాలంలో ఆస్పత్రికి చేరలేకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనన్న ప్రశ్న అతనిని వెంటాడింది. అప్పటినుంచి సెంట్రింగ్ పనులు చేశాడు. ఎలాగైనా ఆటోకొని గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు సేవలందించాలనే సంకల్పంతో డబ్బు సంపాదించాడు. 2013 డిసెంబర్లో ఓ ఆటోను కొనుగోలు చేశాడు. అప్పటినుంచీ ఆటో నడుపుతూ గర్భిణీలకు, వృద్ధులు, వికలాంగులకు ఉచితంగా ఆస్పత్రికి చేరుస్తున్నాడు. దాదాపు 260 మందిని ఆటోలో ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్లి సేవాతత్పరతను చాటుకున్నాడు. తన ఆటో వెనుకాల గర్భిణీలకు, వృద్ధులు, వికలాంగులకు ఎమర్జెన్సీ ఫ్రీ అని కూడా రాశాడు. -
ఆధార్‌కు డబ్బులు మాత్రం చెల్లించకండి:యూఐడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: అన్నింటికి ఇప్పుడు ఆధార్ ఆధారంగా మారింది. సిమ్ కార్డుల దగ్గరి నుంచి బ్యాంకు ఖాతాల దాకా అన్నింటికి జత చేయాల్సిన పరిస్థితి. అలాకానీ పక్షంలో ఆయా సేవలను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. దీంతో ఆధార్ సెంటర్లకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ పలువురు అవినీతికి పాల్పడుతున్నారు. ఆధార్ కార్డుల దరఖాస్తుల పేరిట పెద్ద ఎత్తున్న వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలు అనేకం దేశ రాజధానిలో వెలుగు చూశాయి. సాధారణంగా ఆధార్ సమాచారం అప్ డేట్ కోసం.. అందులో మార్పులు.. చేర్పుల కోసం అధికారికంగా నిర్ణయించిన ఫీజు 25 రూపాయలు.. కానీ, తన దగ్గరి నుంచి 200 రూపాయలు వసూలు చేస్తారని చెబుతున్నారు లాల్ కౌన్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ. జంగ్‌పూరకు చెందిన ఆర్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్థానికంగా ఉండేరో సైబర్ కేఫ్ నిర్వాహకుడి దగ్గర ఆధార్ నమోదు కేంద్రం అనుమతులు కూడా ఉన్నాయి. దీంతో ఎడా పెడా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాడు. ఆర్తి ఆధార్ లేకపోవటంతో అతన్ని సంప్రదించంగా 500 రూపాయలు వసూలు చేశాడు. ఆర్తి, లక్ష్మీలే కాదు ఆధార్ పూర్తి ఉచితం అన్న విషయం తెలీక చాలా మంది ఇలా ఆధార్ సెంటర్లలో డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ, రాకేష్ మాత్రం అలా కాదు. ఆధార్ సభ్యత నమోదు ఫ్రీ అని అతనికి తెలుసు. అందుకే 150 రూపాయలు నిర్వాహకుడు డిమాండ్ చేస్తే.. వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ధృవీకరించి వెంటనే తన ఆధార్‌ను ధరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అతను ఇచ్చిన ఫిర్యాదుతో ఆ నిర్వాహకుడి కేంద్రానికి అనుమతి రద్దు చేసేశారు. ఇలా ఆధార్ కోసం డబ్బులు వసూలు చేయటం సన్నివేశాలు ఒక్క ఢిల్లీలోనే కాదు... దేశవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇలా అవినీతికి పాల్పడిన విషయాలు తమ పరిధిలోకి వస్తే అధికారిక కేంద్రాల లైసెన్సు రద్దు చేయటంతోపాటు వారికి జరిమానా కూడా విధించినట్లు యూఐడీఏఐ చెబుతోంది. 2016 నుంచి ఇప్పటిదాకా 5871 మంది ఆపరేట్లపై ఫిర్యాదు అందటంతో వారిపై చర్యలు తీసుకున్నామని యూఐడీఏఐ చీఫ్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే చెబుతున్నారు. ఒకవేళ ఆధార్ ఎన్రోల్మెంట్ పేరిట ఎవరైనా ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే @uidai.gov.in కి మెయిల్ చేయటంగానీ లేదా 1947 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని పాండే సూచిస్తున్నారు. -
గడపగడపకు ‘న్యాయసేవ’
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించనున్నట్లు లోక్‌అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. గడప గడపకు న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన అబ్బాస్‌నగర్‌లోని హౌసింగ్ బోర్డులో పర్యటించారు. కాలనీ ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా నవంబర్ 2, 3 తేదీల్లో న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవలను గడపగడపకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ లాయర్లు, పారా లీగల్ సర్వీసు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. న్యాయ వాదులు రంగా రవికుమార్, మనోహర్ రాజు, మద్దిలేటి, రమేష్‌రాజు పాల్గొన్నారు. -
15 నెలలు అన్నీ ఫ్రీ... జియో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఉచిత డాటా, ఉచిత రోమింగ్ అంటూ టెలికం మార్కెట్ లోకి దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ కొత్త వినియోగదారులు అందరికీ తన జియో నెట్వర్క్ ద్వారా ఏడాది పాటు ఉచిత సేవలను అందించే 'ప్లాన్'ను ప్రకటించింది. నెలవారీ రూ.1,499 రీచార్జ్ తోలభించే సేవలను కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రం ఏడాది పాటు పూర్తి ఉచితంగా అందించనుంది. ఇప్పటివరకూ ఉన్న వెల్కం ఆఫర్‌తో పాటు తాజా ప్రకటనతో మొత్తం 15నెలల పాటు ఉచిత సర్వీసులు ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. 2017 జనవరి నుంచి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. జియో నెట్ వర్క్ లోని వెల్కం ఆఫర్ గడువు ఈ సంవత్సరం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఆ తర్వాత ఐఫోన్ల కొత్త వినియోగదారులు అందరూ వచ్చే ఏడాది జనవరి 1నుంచి ఈ ఆఫర్ ను పొందవచ్చు. అంటే.. ఇప్పటికే ఐఫోన్ వినియోగిస్తున్నవాళ్లు కాకుండా.. కొత్తగా ఐఫోన్లు కొన్నవాళ్లు మాత్రమే ఈ ఆఫర్ పొందగలరన్న మాట. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కేవలం ఐ ఫోన్ 7 యూజర్లకు మాత్రమే తన తాజా ఆఫర్ ను పరిమితం చేసింది. (చదవండి: ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్) రిలయన్స్ జియో మాత్రం ఆపిల్ కొత్త ఆవిష్కరణలు ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్ తో పాటు ఐఫోన్ 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ ఇతర ఐ ఫోన్ల యూజర్లందరీకి ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఉచితంగా బస్సులు నడపండి
జిల్లా ఉపరవాణా కమిషనరు రాజారత్నం పుష్కరాలకు రవాణాశాఖ ఏర్పాట్లు నగరంపాలెం: జిల్లాలో ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణ పుష్కరాలకు జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థలు పుష్కర యాత్రికుల సౌకర్యార్ధం తమ బస్సులను ఉచితంగా నడపాలని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజారత్నం కోరారు. సోమవారం స్వర్ణభారతినగర్‌లోని ఆర్టిఏ కార్యాలయంలో ఆర్టీసీ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పుష్కరాల కోసం స్కూల్ బస్సులను 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రవాణా శాఖ ఆధీనంలో ఉంచాలని కోరారు. ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వాణిశ్రీ మాట్లాడుతూ పుష్కరాలకు ఆర్టీసీ వారు నడపలేని ప్రాం తాల్లో 120 చిన్న బస్సులను నడపాలని కోరారు. ఈ రూట్లలో 300 స్కూలు, ప్రైవేటు బస్సులు 2800 సర్వీసులు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందన్నారు. ఈ బస్సులన్నీ పుష్కరనగర్ నుంచి స్నానఘాట్ వరకు నడుస్తాయన్నారు. ఇవే కాకుండా ఆర్టీసీ వారు జిల్లాలోని 14 పుష్కరఘాట్ నుంచి 473 బస్సులను 2549 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎంవీఐ ఉమామహేశ్వరరావు, ఏవో కరీం, ఏఎంవీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉచితంగా బస్సులు నడపండి
జిల్లా ఉపరవాణా కమిషనరు రాజారత్నం పుష్కరాలకు రవాణాశాఖ ఏర్పాట్లు నగరంపాలెం: జిల్లాలో ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణ పుష్కరాలకు జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థలు పుష్కర యాత్రికుల సౌకర్యార్ధం తమ బస్సులను ఉచితంగా నడపాలని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజారత్నం కోరారు. సోమవారం స్వర్ణభారతినగర్‌లోని ఆర్టిఏ కార్యాలయంలో ఆర్టీసీ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పుష్కరాల కోసం స్కూల్ బస్సులను 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రవాణా శాఖ ఆధీనంలో ఉంచాలని కోరారు. ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వాణిశ్రీ మాట్లాడుతూ పుష్కరాలకు ఆర్టీసీ వారు నడపలేని ప్రాం తాల్లో 120 చిన్న బస్సులను నడపాలని కోరారు. ఈ రూట్లలో 300 స్కూలు, ప్రైవేటు బస్సులు 2800 సర్వీసులు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందన్నారు. ఈ బస్సులన్నీ పుష్కరనగర్ నుంచి స్నానఘాట్ వరకు నడుస్తాయన్నారు. ఇవే కాకుండా ఆర్టీసీ వారు జిల్లాలోని 14 పుష్కరఘాట్ నుంచి 473 బస్సులను 2549 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎంవీఐ ఉమామహేశ్వరరావు, ఏవో కరీం, ఏఎంవీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల షికారుపై ఆరా
అజ్ఞాతంలోకి బుకీలు చెన్నూరు: క్రికెట్ బుకీల వద్ద మామూళ్లు తీసుకుంటూ, వారి కారులోనే దర్జాగా షికారు చేస్తూ ఉచిత సేవలు పొందుతున్న చెన్నూరు పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘బుకీల కారు..ఖాకీల షికారు అనే కథనంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ మొదలు పెట్టారు. ఎవరా బుకీ..కారు ఎవరు ఉపయోగించారు. ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు. స్టేషన్లో బుకీలతోఎవరికి ఎక్కువ సంబంధాలున్నాయనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. అలాగే కొందరు పోలీసులు స్టేషన్లో గంటల తరబడి బాధితులతో పాటు, నిందితులను ఉంచి పంచాయితీలు చేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులు స్టేషన్లో స్టేట్మెంట్ రాయించుకొని వదిలి పెట్టిన బాధితులను విచారిస్తే స్టేషన్లో ఎవరెవరు ఎంత వసూలు చేస్తున్నారో స్పష్టమవుతుందని ప్రజలు చర్చించుకొంటున్నారు. మట్కా నిర్వాహకులతో పాటు, జూదరులను పట్టుకుంటే వారి వద్ద ఉన్నదే కాకుండా ఇంటి నుంచి మరింత మొత్తం తెప్పించుకొని కొంత కేసులో పెట్టి వాటాలు పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. స్టేషన్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న ఇద్దరు పోలీసులపై పలుమార్లు ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోక పోవడంతో వారు నే రస్తులతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. కాగా సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పలువురు బుకీలు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. నేరస్తులతో, చోటా నాయకులతో సంబంధాలున్న పోలీసులు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసు ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులతో చెప్పించుకొనేందుకు నేరస్తులనే ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఓ పోలీసు ఉన్నతాధికారి ఫోన్లో మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
పేరుకే.. ఉచితం
సాక్షి, గుంటూరు: జిల్లాల్లో అవసరమైనంత కరెంటు అందుబాటులో ఉందని, ముందు చూపుతో వ్యవహరించడం వల్ల వ్యవసాయానికి ఏడు గంటలు కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని ఇటీవల గుంటూరులో ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ప్రకటించారు. రైతులు మాత్రం ఏడు గంటల మాట దేవుడెరుగు మూడు గంటలకే దిక్కులేదని వాపోతున్నారు. వ్యవసాయానికి కరెంటు వినియోగం తక్కువగా ఉన్నా.. కోతలు మాత్రం గణనీయంగా ఉన్నాయంటున్నారు. జిల్లాలో వ్యవసాయానికి 0.9 మిలియన్ల యూనిట్లు వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం రెండు విడతల్లో సరఫరా జరుగుతోంది. రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఉదయం 4 గంటల లోపు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఏడు గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా, ఏడు గంటల్లో ఎడాపెడా కోతలు అమలవుతూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. మూడు నుంచి నాలుగు గంటలే గగనంగా ఉందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు సరిగా నీరందక, దిగుబడులపై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఇంజన్లతో అదనపు భారం.. గుంటూరు జిల్లాలో 69 వేల ఉచిత విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఈ బోర్ల కింద 1.80 లక్షల హెక్టార్లలో అరటి, పసుపు, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి వాణిజ్యపంటలు సాగు చేస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల సబ్ డివిజన్లలోని వినుకొండ, శావల్యాపురం. దుర్గి, బండ్లమోటు, రేమిడిచర్ల ప్రాంతాల్లో పత్తి, మిరప, తెనాలి, బాపట్ల సబ్ డివిజన్లలోని రేపల్లె, కొల్లూరు, కొల్లిపర ప్రాంతాల్లో అరటి, పసుపు పంటలపై ఈ కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పల్నాడు, డెల్టాల్లోని రెండు ప్రాంతాల్లో మొక్కజొన్న భారీ విస్తీర్ణంలో సాగవుతోంది. కరెంటుకోతలతో మొక్కజొన్నకు నీటి తడులు సమయానికి అందడం లేదు. ఆయిల్ ఇంజన్లతో నీటి తడులు ఇవ్వడం వల్ల అధికంగా ఖర్చవుతోంది. అధికారులేమంటున్నారు.. ఉచిత సర్వీసులకు కరెంటు సరఫరా సరిగా లేకపోవడానికి ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) కారణమని అధికారులు చెబుతున్నారు. తమకు సంబంధం లేకుండానే స్టేట్ లెవల్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచే కోతలు అమలవుతున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోతే ఉచిత సరఫరాకు కరెంటోళ్లు కనిష్ట ప్రాధాన్యత ఇస్తున్నారు. పదిహేను రోజుల నుంచి సింహాద్రిలో 250 మెగావాట్ల సామర్ధ్యం గల ఒక యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, రామగుండంలలో 200 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న యూనిట్లు రెండు సార్లు ట్రిప్ కావడంతో ఉచిత విద్యుత్తుకు ఎడా పెడా కోతలు అమలు చేస్తున్నారు.