న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ఉచిత చెక్కుల విషయంలో పరిమితి విధించింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి 20 ఉచిత చెక్కుల సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు నూతన ఖాతాదారులకు తొలి ఏడాది 60, ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాది 50 చెక్కులను ఉచితంగా అందిస్తుండడం గమనార్హం. ఈ పరిమితి దాటిన తర్వాతే ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5 చార్జీని వసూలు చేస్తుండగా.. ఇకపై ఈ పరిమితి ఏడాదికి 20 చెక్కులుగా అమల్లోకి రానుంది.
మినహాయింపు
సబ్‌కా సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు చెక్కుల విషయంలో ఎటువంటి పరిమితి ఉండదంటూ బ్యాంకు స్పష్టం చేసింది. ఇక బ్యాంకు మాతృశాఖ, ఇతర శాఖల్లో ప్రతీ నెలా నగదు జమ లావాదేవీల పరిమితిలోనూ మార్పు చేసింది. జూలై 1 నుంచి ఈ సవరణలు అమల్లోకి రానున్నట్టు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment