ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తన యూజర్లకు శుభవార్తను ప్రకటించింది. ఇంటి దగ్గరే కాకుండా బయటకు వెళ్లినా సరే ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అపరిమితంగా పొందేలా ఏర్పాటు చేసింది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై జోన్లు ఏర్పాటు చేసింది.
హై-ఫైలో భాగంగా
తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. అందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించారు. ఈ వైఫై సెంటర్ల దగ్గర 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. హై-ఫైలో భాగంగా గరిష్టంగా వన్ జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది.
యాక్ట్ స్మార్ట్ ఫైబర్
తాజగా యాక్ట్ స్మార్ట్ పైబర్ టెక్నాలజీ సాయంతో తన వినియోదారుకలు ఇంటి బయట కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది యాక్ట్ సంస్థ. ఇళ్లు లేదా ఆఫీస్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ప్లాన్‌లో ఉందో. అదే ప్లాన్‌తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా నెట్‌ను వాడుకునే అవకాశం కలిపించింది. . అంటే ఫ్రీ వైఫై సెంటర్ల దగ్గర సాధారణ యూజర్లకు 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కేవలం 45 నిమిషాల పాటే నెట్ అందితే, యాక్ట్ యూజర్లకు వారి ఇంటి దగ్గర ప్లాన్ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వీలు ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
వరంగల్‌లో కూడా
హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌లోనూ ఉచిత వైఫై సేవలు ప్రారంభించినట్టు యాక్ట్ సంస్థ తెలిపింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల పరిధిలో మొత్తం 18 ఉచిత వైఫై సెంటర్లు అందుబాటులోకి తెచ్చింది. కాలేజీలు, లైబ్రరీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేశారు.
ఇలా చేయాలి
- ఫ్రీ ఇంటర్నెట్ పొందాలంటే హై ఫై నెట్ జోన్ పరిధిలోకి వెళ్లాలి
- వై-ఫై సెట్టింగ్స్‌లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి
- వెంటనే యూజర్ లాగిన్ పాప్‌అప్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి
- మీ మొబైల్ నంబరుకి నాలుగు అంకెలా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి
- సాధారణ వినియోగదారుల కాల పరిమితి ముగిసిన తర్వాత రూ. 25, రూ. 50తో టాప్‌ఆప్ పొందవచ్చు. యాక్ట్ వినియోగదారులకైతే ఇంటి దగ్గర ప్లాన్‌నే ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు.
చదవండి : భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment