ACT fibernet
-
హైదరాబాద్ వ్యాప్తంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, ‘యాక్ట్ ఎక్స్‌క్లూజివ్’ ఆఫర్
ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తన యూజర్లకు శుభవార్తను ప్రకటించింది. ఇంటి దగ్గరే కాకుండా బయటకు వెళ్లినా సరే ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అపరిమితంగా పొందేలా ఏర్పాటు చేసింది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై జోన్లు ఏర్పాటు చేసింది. హై-ఫైలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. అందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించారు. ఈ వైఫై సెంటర్ల దగ్గర 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. హై-ఫైలో భాగంగా గరిష్టంగా వన్ జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది. యాక్ట్ స్మార్ట్ ఫైబర్ తాజగా యాక్ట్ స్మార్ట్ పైబర్ టెక్నాలజీ సాయంతో తన వినియోదారుకలు ఇంటి బయట కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది యాక్ట్ సంస్థ. ఇళ్లు లేదా ఆఫీస్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ప్లాన్‌లో ఉందో. అదే ప్లాన్‌తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా నెట్‌ను వాడుకునే అవకాశం కలిపించింది. . అంటే ఫ్రీ వైఫై సెంటర్ల దగ్గర సాధారణ యూజర్లకు 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కేవలం 45 నిమిషాల పాటే నెట్ అందితే, యాక్ట్ యూజర్లకు వారి ఇంటి దగ్గర ప్లాన్ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వీలు ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వరంగల్‌లో కూడా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్లోనూ ఉచిత వైఫై సేవలు ప్రారంభించినట్టు యాక్ట్ సంస్థ తెలిపింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల పరిధిలో మొత్తం 18 ఉచిత వైఫై సెంటర్లు అందుబాటులోకి తెచ్చింది. కాలేజీలు, లైబ్రరీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ఇలా చేయాలి - ఫ్రీ ఇంటర్నెట్ పొందాలంటే హై ఫై నెట్ జోన్ పరిధిలోకి వెళ్లాలి - వై-ఫై సెట్టింగ్స్‌లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి - వెంటనే యూజర్ లాగిన్ పాప్అప్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి - మీ మొబైల్ నంబరుకి నాలుగు అంకెలా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి - సాధారణ వినియోగదారుల కాల పరిమితి ముగిసిన తర్వాత రూ. 25, రూ. 50తో టాప్‌ఆప్ పొందవచ్చు. యాక్ట్ వినియోగదారులకైతే ఇంటి దగ్గర ప్లాన్‌నే ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు. చదవండి : భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
స్విట్జర్లాండ్‌కు ‘యాక్ట్’ అమ్మేసుకుంది
ముంబై: బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్)లో నియంత్రణ వాటాలను స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పార్ట్నర్స్ గ్రూప్ దక్కించుకుంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లెక్కగట్టి, ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన ఆర్గాన్, టీఏ అసోసియేట్స్ తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఆర్గాన్ పూర్తిగా నిష్క్రమిస్తుండగా, టీఏ పాక్షికంగా వాటాలను విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. దేశంలోని 19 నగరాల్లో 20 లక్షల మంది వినియోగదారులకు యాక్ట్ సంస్థ ఇంటర్నెట్, టీవీ, డేటా, ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీలో 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా యాక్ట్ నాలుగో అతి పెద్ద వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉందని యాక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలా మల్లాది తెలిపారు. 2008 జూన్‌లో యాక్ట్‌లో ట్రూ నార్త్ ఫండ్ త్రీ నియంత్రణ వాటాలు కొనుగోలు చేసింది. అటుపైన 2016లో ఇండియం వి (మారిషస్) హోల్డింగ్స్ సంస్థ.. ఆర్గాన్, టీఏల ద్వారా ఆ వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా వాటినే స్విస్ సంస్థకి విక్రయిస్తోంది. -
సూపర్-స్పీడ్ నెట్:ఇప్పుడు మన హైదరాబాద్ లో..
హైదరాబాద్: సూపర్-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సెకనుకు 1గిగా బిట్ స్పీడు కలిగిన సూపర్ స్పీడు ఇంటర్నెట్ సేవలను ఏసీటీ ఫైబర్ నెట్ హైదరాబాద్ లో లాంచ్ చేసింది. వీటి ప్రీమియం ధర రూ.5999లేనని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు నివేదించింది. సెకనుకు 1 గిగాబిట్ స్పీడు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ఏసీటీ ఫైబర్ నెట్స్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు త్వరలోనే మరో 11 నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. తమ కంపెనీ దేశంలోనే అతిపెద్ద నాన్-టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్(ఐఎస్పీ)గా ఏసీటీ ఫైబర్‌నెట్ చెబుతోంది. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ద్వారా తాము 1 గిగాబిట్ల బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ ను అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతమున్న సగటు ఇంటర్నెట్ స్పీడుకి ఇది 400 టైమ్స్ వేగవంతమైనదట. యూఎస్బీ డ్రైవ్ నుంచి చాలా వేగవంతంగా డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చట. ఫైల్స్ డౌన్ లోడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. డిజిటల్ ఇండియా వైపు ప్రభుత్వం, మన నగర వాసులు కదులుతున్న నేపథ్యంలో ఈ సేవలు ఎంతో సహకరించనున్నాయని, డిజిటల్ ఇండియా డ్రీమ్ ను నిజం చేస్తామని కంపెనీ సీఈవో బాలా మల్లాడి తెలిపారు. -
'ఏసీటీ'తో యప్‌టీవీ ఒప్పందం
హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రముఖ ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్రొవైడర్ యప్‌టీవీ.. భారత దేశపు నాల్గవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ(అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ సేవలను వినియోగించుకుంటున్న వారు యాడ్ ఆన్ ప్యాకేజీ కింద కేవలం నెలకు రూ 99 చెల్లించి యప్టీవీలో అందుబాటులో ఉండే 200లకు పైగా లైవ్ టీవీ చానల్స్, రెండు వేలకు పైగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు, టీవీ షోలు లాంటి విభిన్న కార్యక్రమాలను వీక్షించే అవకాశం హైదరాబాద్ వాసులకు కలుగుతోంది. హైదరాబాద్‌లో ఏసీటీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సేవలను వినియోగించుకునే వారికి మనోరంజకమైన యప్‌టీవీ కార్యక్రమాలు ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా యప్‌టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించడానికి హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ కావాలని.. ఏసీటీతో ఒప్పందం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సర్వీస్ అందుతుందన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ ఈ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.