ముంబై: బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్)లో నియంత్రణ వాటాలను స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పార్ట్‌నర్స్ గ్రూప్ దక్కించుకుంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లెక్కగట్టి, ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన ఆర్గాన్, టీఏ అసోసియేట్స్ తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఆర్గాన్ పూర్తిగా నిష్క్రమిస్తుండగా, టీఏ పాక్షికంగా వాటాలను విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి.
దేశంలోని 19 నగరాల్లో 20 లక్షల మంది వినియోగదారులకు యాక్ట్ సంస్థ ఇంటర్నెట్, టీవీ, డేటా, ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీలో 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా యాక్ట్ నాలుగో అతి పెద్ద వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉందని యాక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలా మల్లాది తెలిపారు. 2008 జూన్‌లో యాక్ట్‌లో ట్రూ నార్త్ ఫండ్ త్రీ నియంత్రణ వాటాలు కొనుగోలు చేసింది. అటుపైన 2016లో ఇండియం వి (మారిషస్) హోల్డింగ్స్ సంస్థ.. ఆర్గాన్, టీఏల ద్వారా ఆ వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా వాటినే స్విస్ సంస్థకి విక్రయిస్తోంది.
స్విట్జర్లాండ్‌కు ‘యాక్ట్’ అమ్మేసుకుంది
Published Sat, Aug 14 2021 12:28 AM | Last Updated on Sat, Aug 14 2021 12:30 AM
Comments
Please login to add a commentAdd a comment