అమృత్‌సర్ పేరు వినబడగానే ‘స్వర్ణ దేవాలయం’ గుర్తుకు వస్తుంది. ఈ పవిత్ర నగరంలో ఒక విశేషమైన టీ స్టాల్ ఉంది. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అనే ఈ టీ స్టాల్‌లో టీ ఉచితంగా ఇస్తారు. ఎనభై సంవత్సరాల అజిత్‌సింగ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద చెట్టు ఊడల మధ్య ఈ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు.
అజిత్‌సింగ్‌ను అందరూ ‘బాబాజీ’ అని పిలుస్తారు. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎప్పుడైనా ఉచితంగా టీ తాగవచ్చు. గతంలో ఈ టీస్టాల్‌లోని వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. అయినప్పటికీ బాబాజీ ఉచిత టీ ఇవ్వడం ఆపలేదు.
టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్
Published Sun, Jul 30 2023 6:13 AM | Last Updated on Sun, Jul 30 2023 6:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment