Ajit Singh
-
టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్
అమృత్సర్ పేరు వినబడగానే ‘స్వర్ణ దేవాలయం’ గుర్తుకు వస్తుంది. ఈ పవిత్ర నగరంలో ఒక విశేషమైన టీ స్టాల్ ఉంది. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అనే ఈ టీ స్టాల్లో టీ ఉచితంగా ఇస్తారు. ఎనభై సంవత్సరాల అజిత్‌సింగ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద చెట్టు ఊడల మధ్య ఈ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. అజిత్‌సింగ్‌ను అందరూ ‘బాబాజీ’ అని పిలుస్తారు. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎప్పుడైనా ఉచితంగా టీ తాగవచ్చు. గతంలో ఈ టీస్టాల్‌లోని వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. అయినప్పటికీ బాబాజీ ఉచిత టీ ఇవ్వడం ఆపలేదు. -
కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కన్నుమూత
-
కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అదీకాక కోవిడ్ సోకిన కొంత మంది సీనియర్ రాజకీయ నేతలు మరణించారు. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖనాయకుడైన అజిత్ సింగ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏప్రిల్ 20న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. గురువారం అజిత్ సింగ్ ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించటంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఏప్రిల్ 20న నాన్న అజిత్ సింగ్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ఆనారోగ్యంతో చివరి వరకు పోరాడారు. ఈ రోజు(గురువారం) ఉదయం తుది శ్వాస విడిచారు’ అని జయంత్ చౌదరి ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడైన అజిత్‌సింగ్ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన నేతగా ఎదిగారు. चौधरी साहब नहीं रहे! 🙏🏽 pic.twitter.com/7cnLkf0c6K — Jayant Chaudhary (@jayantrld) May 6, 2021 చదవండి: ఆక్సిజన్ అందక 13 మంది మృతి -
బెట్టింగ్ కోసం ఏకంగా ఐపీఎల్ ఆటగాడికే ఫోన్?
న్యూఢిల్లీ: ఎంటర్టైన్మెంట్ ఈవెంట్‌గా పాపులర్ అయిన క్యాష్ రిచ్ టోర్నీ ఐపీఎల్ అదే స్థాయిలో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, శ్రీశాంత్, అంకిత్ చవాన్ బెట్టింగ్ ఆరోపణలతో నిషేదానికి గురికాగా, తాజాగా మరోసారి బెట్టింగ్‌కు సంబంధించిన విషయమొకటి వెలుగు చూసింది. ఐపీఎల్లో బెట్టింగ్ ఎలా పెట్టాలి? ఏ జట్టుపై డబ్బులు పెడితే బాగుటుంది, అంతర్గతంగా టీమ్ విషయాలు తెలపాలంటూ ఢిల్లీకి చెందిన ఓ నర్స్ ఐపీఎల్ ఆటగాడిని సంప్రదించినట్టు ఓ స్టడీ రిపోర్టు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ధ్రువీకరించారు. ఐపీఎల్ 2020 జరుగుతున్న క్రమంలో ఢిల్లీలో నర్స్‌గా పనిచేస్తున్న ఓ మహిళ బెట్టింగ్ పెట్టేందుకు సహాయం చేయాలని, వివరాలు చెప్పాలని ఒక ఆటగాడిని ఫోన్ ద్వారా సంప్రదించిన మాట వాస్తమేనని అజిత్ సింగ్ అన్నారు. అయితే, ఆ విషయాన్ని సదరు ఆటగాడు తమ దృష్టికి తేగా విచారణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆటగాడికి ఆ నర్స్ ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. అవగాహన లేకే ఆమె అలా ప్రవర్తించిందని, ఆమెకు బెట్టింగ్ ముఠాలతో ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. దాంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేశామని తెలిపారు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ట్రోఫీని చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్, ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. (చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్) -
ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది
ముంబై: ఐపీఎల్–2020 యూఏఈలో జరిగే సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర అంశాలపై ఒక కన్నేసి ఉంచడంలో ఎలాంటి కష్టం ఉండబోదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధినేత అజిత్ సింగ్ అన్నారు. దేశంలోని ఎనిమిది వేదికలతో పోలిస్తే మూడు చోట్లనే మ్యాచ్‌లు జరగనుండటం తమ పని సులువు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లీగ్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ ఏర్పాట్లు చేసుకుంటామని అజిత్ సింగ్ వెల్లడించారు. ‘క్రికెట్లో అవినీతిని అరికట్టే విషయంలో మా బృందం సమర్థంగా పని చేస్తుంది. అది మన దేశంలో అయినా మరెక్కడైనా పనితీరు ఒకే తరహాలో ఉంటుంది. బుకీల వ్యవహారంపై మాకు స్పష్టత ఉంది. నిజానికి ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది. అయితే అక్కడి మూడు వేదికల్లో ఫిక్సింగ్పై దృష్టి పెట్టేందుకు మేం తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం. ఒక వేళ తగినంత మంది అధికారులు లేరని భావిస్తే అక్కడే ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి వారి అనుమతితో అక్కడి మనుషులనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటాం. అంతే కానీ ఉదాసీతనకు చోటివ్వం’ అని ఆయన స్పష్టం చేశారు. -
మన క్రికెటర్లు అవగాహనాపరులు
న్యూఢిల్లీ: బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు, బుకీల సంప్రదింపులపై భారత క్రికెటర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ అన్నారు. ఈ అంశంపై వారికి తగినంత అవగాహన ఉందని పేర్కొన్నారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే తమకు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. ‘సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ద్వారా బుకీలు ఎలా సంప్రదింపులు జరుపుతారనే అంశంపై మన క్రికెటర్లకు పూర్తిగా అవగాహన కల్పించాం. వారికి నేరం జరిగే తీరుపై అవగాహన ఉంది. ఎవరైనా తమను సంప్రదించినప్పుడు వారు వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. మా ఏసీయూ టీమ్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల సోషల్ మీడి యా అకౌంట్లపై, ఆన్లైన్ కాంటాక్ట్‌లపై కన్నేసి ఉంచుతుంది. ఫేక్ ఐడీలతో అభిమానులుగా చెలామణి అయ్యేవారి నిజస్వరూపం ఏదో ఒక సమయంలో బయటపడుతుంది’ అని అజిత్ వివరించారు. -
‘క్రికెటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’
ముంబై : ఈ మధ్య కాలంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు, అపరిచితులు మైదానాల్లోకి దూసుకవస్తుండటంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మొహాలి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో అభిమానులు రెండు సార్లు మైదానంలోకి వచ్చి ఆటకు ఆటంకం కలిగించారని గుర్తుచేశారు. అయితే తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమ ఉండటం సహజమని కానీ ఇది సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఆటగాళ్లు హోటల్ నుంచి బయల్దేరిన మొదలు తిరిగి వారి గమ్యస్థానానికి చేరుకునేవరకు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఆసోసియేషన్లే భద్రత కల్పించాలని స్పష్టం చేశాడు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అసోసియేషన్లకు అజిత్ సింగ్ లేఖ రాశాడు. ‘ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దవడంతో టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండో మ్యాచ్ కోసం మొహాలికి ముందుగానే చేరుకున్నారు. అయితే స్థానిక అసోసియేషన్‌తో ఉన్న సమస్యల కారణంగా క్రికెటర్లకు చండీగఢ్ పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు. దీంతో తొలి రోజు హోటల్ యాజమాన్యమే ఆటగాళ్లకు ప్రయివేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. రెండో రోజుకు గాని పోలీసులు ఆటగాళ్లకు భదత్ర కల్పించలేదు. ఇది చాలా విచారకరం. క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్లదే. అంతేకాకుండా మొహాలి మ్యాచ్‌లో మైదానంలోకి ఫ్యాన్స్ చొచ్చుకొచ్చారు. లాంగాఫ్, లాంగాన్, మిడాన్, మిడాఫ్, డీప్ థర్డ్‌మన్ వంటి ఫీల్డింగ్ పొజిషన్ల నుంచి బయటివాళ్లు మైదానంలోకి దూసుకొస్తున్నారు. దీంతో ఈ స్థానాల వద్ద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. మరోసారి మొహాలి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి’అంటూ అజిత్ సింగ్ లేఖలో పేర్కొన్నాడు. -
బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా అజిత్ సింగ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా రాజస్తాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్‌ను నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న నీరజ్ కుమార్ స్థానంలో అజిత్ సింగ్ ఈ బాధ్యతలు చేపడతారు. శనివారంతోనే నీరజ్ కుమార్ పదవీకాలం ముగిసింది. అయితే ఐపీఎల్–11 సీజన్ నేపథ్యంలో మే 31 వరకు నీరజ్ కుమార్‌ను ఏసీయూ సలహాదారుగా నియమించారు. అంతకుముందు అజిత్ సింగ్ నియామకంపై సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మధ్య రగడ చెలరేగింది. తన ప్రమేయం లేకుండానే అజిత్ నియామకం జరిగిందని అమితాబ్ చౌదరి విమర్శించారు. -
దిశ చూపే ‘పశ్చిమం’!
కీలకంగా తొలి దశ పోలింగ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నిర్ణయాత్మకమైనది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 సీట్లకు శనివారం జరిగే తొలి విడత పోలింగ్ సరళి ప్రభావం మిగిలిన దశల పోలింగ్‌పై ఉంటుందని రాజకీయపక్షాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న పశ్చిమ యూపీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రాష్ట్రంలో ముస్లింల జనాభా 18 శాతం ఉండగా, ఇక్కడ అది 26 శాతం. మాజీ ప్రధాని చరణ్‌సింగ్, ఆయన కొడుకు ఆరెల్డీ నేత అజిత్‌సింగ్ వంటి నేతల జాట్ సామాజికవర్గం ఉన్నదీ ఇక్కడే. రైతుల విషయంలో పాలకపక్షం విధానాలు ఇక్కడి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. నరేంద్ర మోదీ గాలి వీచిన 2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం పది లోక్‌సభ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రాంతీయపక్షాలు ఎస్పీ, బీఎస్పీలకు 24 సీట్ల చొప్పున దక్కగా, బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకుంది. జాట్ల ఓట్లే పునాదిగా ఉన్న ఆరెల్డీకి 9, కాంగ్రెస్‌కు 5 సీట్లు లభించాయి. గతంలో ఎస్పీకి లాభం.. 2012లోనూ యూపీ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. ఆ దశలో ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి పడ్డాయంటూ జరిగిన ప్రచారం మిగతా విడతల పోలింగ్‌పై కనిపించిందని విశ్లేషకులు నిర్ధారించారు. ఎస్పీ మిగిలిన దశల్లో మరింత బాగా పుంజుకుని రికార్డు స్థాయిలో 224 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఓటు ప్రభావం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది కీలకాంశంగా మారింది. నవంబర్, డిసెంబర్లో ఎస్పీ యాదవ పరివారంలో జరిగిన కీచులాటలు చివరికి సుఖాంతమవడంతో ఈ పార్టీకి జనాదరణ పెరుగుతోందని వార్తలొస్తున్నాయి. ‘అఖిలేశ్ మంచివాడేగాని, చివరి రెండేళ్లలోనే బాగా పనిచేశాడు’అ ని ఈ ప్రాంతంలో కొందరంటున్నారు. తగ్గిన బీజేపీ హవా..: ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి అంత జనాదరణ కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్‌తో తొలిసారి చేతులు కలిపిన ఎస్పీ, ఒంటరిగా బరిలో ఉన్న బీఎస్పీ బలాన్ని వారు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. బీసీల్లో ప్రధాన వర్గమైన యాదవుల జనాభా పశ్చిమ యూపీలో నామమాత్రం కావడంతో ఎస్పీకి విజయావకాశాలు తక్కువ. బీఎస్పీకి పునాదివర్గమైన దళితుల్లోని చమార్లు(జాటవ్‌లు) ఈ ప్రాంతంలో ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం దళితుల్లో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. ఈ పార్టీ చీఫ్ మాయావతి తల్లిదండ్రులు ఇక్కడి ఘజియాబాద్ జిల్లాకు చెందినవారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ మతఘర్షణల వల్ల పార్లమెంటు ఎన్నికల్లో జాట్లతోపాటు మెజారిటీ హిందూ ఓటర్లు కమలానికి ఓటేశారు. జాట్లకు బీసీ హోదా దక్కకపోవడం, రైతు సమస్యలు తీరకపోవడంతో గ్రామీణులు బీజేపీకి దూరమయ్యారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అజిత్ తో అనుష్క మరోసారి..
అజిత్‌తో మరోసారి జత కట్టడానికి అందాల తార అనుష్క సిద్ధమవుతున్నారా? దీనికి కోలీవుడ్ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌ల తరువాత కోలీవుడ్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ విజయ్, అజిత్లేనని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.అలాంటి వారితో జత కట్టడానికి ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటారు. అందుకు తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల నటి తమన్నా అలాంటి ప్రయత్నాన్నే చేసినట్లు ప్రచారం జరిగింది. తమన్నా అజిత్‌తో కలిసి వీరం చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అజిత్ వేదాళం తరువాత తన 57వ చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఇందులో హీరోయిన్గా నటించాలన్న ఆకాంక్షను తమన్న వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో సారి అజిత్‌తో నటిస్తానని తనే ఇటీవల వెల్లడించారు. దీంతో అజిత్ తాజా చిత్రంలో హీరోయిన్గా తమన్నా ఎంపికయ్యిందేమోన ని అనుకున్న వారూ లేక పోలేదు. అయితే అజిత్ తాజా చిత్రంలో నటించే అవకాశం తమన్నాకు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ అవకాశాన్ని స్వీటీ(అనుష్క)తన్నుకుపోయినట్లు తాజా సమాచారం.అనుష్క ఎన్నై అరిందాల్ చిత్రంలో తొలి సారిగా అజిత్ తో నటించారు. అయితే ఆ చిత్రంలో ఆయనతో అంతగా రొమాన్స్ చేసే అవకాశం లభించలేదు. అజిత్ 57వ చిత్రం మరోసారి ఫుల్ప్లెజ్డ్ హీరోయిన్గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివనే అజిత్ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్‌పైకి రానున్నదని తెలుస్తోంది. వేదాళం చిత్రానికి సంగీత బాణీలు అందించిన అనిరుద్‌నే దీనికి సంగీతాన్ని అందించనున్నారు. అనుష్క ప్రస్తుతం బాహుబలి-2, ఎస్-3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
మహాపంచాయత్ భగ్నం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌తో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిలో ఆర్ఎల్డీ నిర్వహించ తలపెట్టిన మహాపంచాయత్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అజిత్ ఖాళీ చేసిన బంగ్లా ఎదుటే మహాపంచాయత్ నిర్వహించేందుకు ఆర్ఎల్డీ పిలుపునివ్వడంతో సదరు బంగ్లా ఉన్న ప్రాంతమైన 12 తుగ్లక్‌రోడ్‌కు దారితీసే రహదారులన్నింటినీ బారీకేడ్లతో మూసివేశారు. లూటియెన్స్ జోన్లో 144 సెక్షన్‌ను అమలు చేయడమే కాకుండా రేస్‌కోర్సు రోడ్డు మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ఉదయం 8.20 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మూసివేయడంతో 12 తుగ్లక్ రోడ్డుకుచేరుకోలేకపోయారు. చేరుకున్న కొంతమందిని పోలీసుల అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. అనుమతి లేదని ముందే ప్రకటించిన పోలీసులు తమ నేతతో బంగ్లా ఖాళీ చేయించేందుకు ఎంసీడీ అనుసరించిన తీరును ఆర్ఎల్డీ కార్యకర్తలు తీవ్రంగా తప్పుబట్టారు. సదరు బంగ్లాకు నీటి సరఫరా బంద్ చేయడం, కరెంటు సరఫరా బంద్ చేయడం వంటి చర్యలను ఖండించారు. దీంతో ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకునేందుకు నగర శివార్లలో ఆందోళన నిర్వహించిన ఆర్ఎల్డీ కార్యకర్తలు మంగళవారం రాజధానిలో తమ సత్తా నిరూపించేందుకు ప్రయత్నించారు. అజిత్‌సింగ్‌తో ఖాళీ చేయించిన బంగ్లా ఎదుటే మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ ఆందోళనకారులు పంచాయత్ నిర్వహించేందుకే నిర్ణయించుకోవడంతో ముందుజాగ్రత్తగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఆర్ఎల్డీ మద్దతుదారులను అడ్డుకునేందుకు పోలీ సు లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అజిత్‌సింగ్ బంగ్లా వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాాలను మోహరించడంతోపాటు తుగ్లక్ రోడ్‌తోపాటు బంగ్లాకు దారితీసే ప్రధాన రహదారులపై పలుచోట్ల బారికేడ్లను అమర్చారు. బారి కేడ్ల కారణంగా ఆర్ఎల్ డీ మద్దతుదారులు పెద్ద ఎత్తున అజిత్ సింగ్ నివాసానికి చేరుకోలేకపోయారు. చేరుకున్నవారిని పోలీసులు వాహనాలలో ఎక్కించుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఆంక్షలతో నగరవాసుల ఇబ్బందులు ఉదయం రద్దీ వేళల్లో రోడ్లపై బారికేడ్లను అమర్చడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. బారికేడ్ల ప్రభావం దక్షిణ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ ట్రాఫిక్‌పై కనిపించింది. ఐఎన్ఏ, ఔరంగాజేబ్ రోడ్, తీన్‌మూర్తి రోడ్డుతో పాటు పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రేస్‌కోర్సు మెట్రోస్టేషన్‌ను కూడా మూసివేయడం మెట్రో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. 12 తుగ్లక్‌రోడ్‌లో అజిత్ సింగ్ 30 సంవత్సరాలుగా నివాసముంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన సింగ్ సదరు బంగళాను ఖాళీ చేయాలని ప్రభుత్వం అంటోంది. అయితే తన తం డ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ఈ బంగ్లాలో నివాసమున్నారని, దానిని చరణ్‌సింగ్ మెమోరియల్‌గా ప్రకటించాలని అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్నారు. -
బెదిరిస్తే పని జరగదు: వెంకయ్య
బంగ్లాను ఖాళీ చేయకుండా.. పైపెచ్చు బెదిరిస్తే పనులు జరగవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆరెల్డీ నేత అజిత్ సింగ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా ఉండగా ప్రభుత్వం తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయకుండా ఒత్తిడి తెస్తున్నారంటూ అజిత్ సింగ్ మీద ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి బెదిరింపుల వల్ల పనులేమీ జరగవని వెంకయ్యనాయుడు విలేకరుల వద్ద అన్నారు. అజిత్ సింగ్ మీద రాజకీయ కక్ష తీర్చుకోవడం అంటూ ఏమీ లేదని చెప్పారు. అజిత్ సింగ్ ఉంటున్న బంగ్లాను చౌదరి చరణ్ సింగ్ స్మారక కేంద్రంగా ప్రకటించాలని ఆరెల్డీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై గురువారం జరిగిన ఘర్షణలలో దాదాపు 200 మంది రైతులు, కొందరు పోలీసులు గాయపడ్డారు. తుగ్లక్ రోడ్డులోని ఈ బంగ్లాకు నీరు, విద్యుత్ సరఫరా కట్ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. -
అజిత్ మద్దతుదారుల హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: తమ నేత అజిత్‌సింగ్ బంగ్లా ఖాళీ చేయించేందుకు ఎన్డీఎంసీ ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎల్డీ కార్యకర్తలు గురువారం హల్చల్ చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా అజిత్‌సింగ్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఎన్డీఎంసీ సదరు బంగ్లాకు ఈ నెల 13 నుంచి నీటిసరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో ఎన్డీఎంసీ చర్యను ఖండిస్తూ ఢిల్లీకి నీటిసరఫరా నిలిపివేసేందుకు ఆర్ఎల్డీ కార్యకర్తలు ప్రయత్నించారు. అజిత్ బంగ్లాకు నీటిని నిలిపివేసిన మరుసటి రోజు నుంచే ఆర్ఎల్డీ ఢిల్లీకి నీటి సరఫరా బంద్ చేస్తామంటూ హెచ్చిరిస్తోంది. అన్నట్లుగానే మురాద్‌నగర్ గంగానహర్ నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిని నిలిపివేయడానికి గురువారం ఉదయం ప్రయత్నించారు. ఢిల్లీకి 38 కిలోమీటర్ల దూరంలో ఘాజియాబాద్ సమీపంలో గంగానహర్‌కు పెద్దమొత్తంలో కార్యకర్తలు చేరుకొని ఆందోళనకు దిగారు. నీటి సరఫరాను నిలిపివేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వందలమంది కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై వాటర్ కేనాన్లు ప్రయోగించారు. లాఠీ చార్జీ కూడా చేశారు. ఈ ఘర్షణలో 20 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్సింగ్ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వారుం టున్న బంగ్లాను ఎన్డీఎంసీ ఖాళీ చేయించింది. అయితే ఈ బంగ్లాను తమ తండ్రి, మాజీ ప్రధానమంత్రి నివాసమున్న బంగ్లా అని, దానిని చరణ్ సింగ్ మెమోరియల్‌గా మార్చాలని అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్నారు. -
మాజీ ముంబై పోలీస్ కమీషనర్ పై దాడి!
లక్నో: బోగస్ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్ధి, మాజీ ముంబై పోలీస్ కమీషనర్ సత్యపాల్ సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో భాగపట్ నియోజకవర్గంలోని మలక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మలక్ పూర్ గ్రామస్తులు సత్యపాల్ సింగ్ మోటార్ కాన్వాయ్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, పౌర విమానయాన శాఖా మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి అజిత్ సింగ్ పోటీలో ఉన్నారు. కాన్వాయ్ పై జరిగిన దాడిలో సత్యపాల్ సింగ్ కారు ధ్వంసమైందని, ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దాడి తర్వాత సత్యపాల్ సింగ్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని.. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. దాడికి కారణమైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఏవియేషన్ షో షురూ
హైదరాబాద్: భారత విమనయాన మంత్రిత్వ శాఖ హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ప్రారంభించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ బుధవారం ప్రారంభించారు. 18 దేశాలకు చెందిన 250 విమానయాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద విమానాలు ఎయిర్‌బస్ ఏ 380, బోయింగ్ 787 సహా 18 ఎయిర్‌క్రాఫ్ట్ లను ప్రదర్శనకు ఉంచారు. ఈ షోలో పాల్గొనే అమెరికా, సింగపూర్, రష్యా తదితర దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. 12వ ప్రణాళిక సంఘం కాల పరిమితిలో భారత విమానయాన రంగానికి పెద్ద ఎత్తును పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు అజిత్ సింగ్ చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ సహా దాదాపు 70 వేల కోట్ల రూపాయిలు నిధులు సమకూరే అవకాశాలున్నాయని తెలిపారు. 2020 నాటికి ప్రపంచంలో భారత విమానయాన రంగం మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. -
ఆర్ఎల్డీలోకి అమర్, జయప్రద
- ఫతేపూర్ నుంచి అమర్.. బిజనూర్ నుంచి జయ పోటీ! - ఆంధ్రాను వీడి కర్మభూమికి వచ్చా: జయప్రద సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్‌సింగ్, జయప్రదలు రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)లో చేరారు. పార్టీ మార్పుపై గత కొన్ని నెలలుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సోమవారం ఆర్ఎల్డీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత అజిత్ సింగ్ ఇరువురు నేతలను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. రాంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జయప్రదకు బిజ్నౌర్, అమర్‌సింగ్‌కు ఫుతేపుర్ స్థానాలు కేటాయించనున్నట్టు సంకేతాలు అందాయి. వీరి చేరిక సందర్భంగా ఇక్కడి అజిత్‌సింగ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయప్రద మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ద్వారా మొదలైన రాజకీయ జీవితాన్ని యూపీకి సమర్పించినట్టు చెప్పారు. అలా ఆంధ్రాను వదిలి ఉత్తరప్రదేశ్‌లోని కర్మభూమిలో పనిచేయడానికి వచ్చానన్నారు. అమర్‌సింగ్ ఏ పార్టీలో ఉంటే, తాను కూడా అదే పార్టీలో ఉంటానని స్పష్టంచేశారు. ‘‘ఆర్ఎల్డీలో అవకాశం ఇచ్చిన అజిత్‌సింగ్, అమర్‌సింగ్‌కు ధన్యవాదాలు. లోక్‌సభలో ఎంపీగా ఉన్న నేపథ్యంలో అజిత్‌ను కలిసి అనేక విషయాల్లో సలహాలు తీసుకున్నాను. నేను ఆర్ఎల్డీలో లేనప్పటికీ, ఆయన మంచి సలహాలు ఇచ్చి నాకు తోడ్పాటుగా ఉండేవారు. యూపీ విభజన, అభివృద్ధి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్న అజిత్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రజలను, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తా’’ అని చెప్పారు. అమర్‌సింగ్ తన జీవితాన్ని సమాజ్‌వాదీ పార్టీకి అంకితం చేసినప్పటికీ, ఆయనకు ఆ పార్టీ అధినేత (ములాయం) తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు సరైన సమయంలో ఆర్ఎల్డీలో చేరామని జయప్రద వెల్లడించారు. కష్టమ్మీద తెలంగాణ ఇచ్చారు: అమర్‌సింగ్ దేశంలోని రెండు పెద్ద పార్టీలు తెలంగాణపై సీరియస్‌గా లేవని అమర్‌సింగ్ ఆరోపించారు. ఆ పార్టీలు అతి కష్టమ్మీద తెలంగాణ ఇచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఇప్పుడు యూపీలో విభజన మార్గం సులువవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం కొనసాగిన సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో అజిత్‌సింగ్ తరచుగా సంప్రదింపులు జరిపేవారని మీడియాకు వెల్లడించారు. -
మార్చి 12నుంచి 4వ భారత్ ఏవియేషన్ షో
-
ఈ సమావేశాల్లో సాధ్యం కాదు: అజిత్‌సింగ్
బడ్జెట్ సమావేశాల్లోనే టీ బిల్లు: కేంద్రమంత్రి అజిత్‌సింగ్ అజిత్‌సింగ్‌తో టీ జేఏసీ నేతల భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక లేదా బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, టీఆర్ఎల్డీ నేత దిలీప్‌కుమార్ తదితరులు గురువారమిక్కడ అజిత్‌సింగ్‌ను కలిశారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందిగా, ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయనకు విన్నవించారు. భేటీ అనంతరం టీజేఏసీ, టీఆర్ఎల్డీ నేతలతో కలసి అజిత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణపై మీడియా కథనాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణ, రాయలసీమలో సాంస్కృతిక వైరుధ్యం ఉందన్నారు. 50 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం ఆందోళనలు కొనసాగుతుండగా, ఇప్పటి వరకు రాయల తెలంగాణ ప్రశ్న తలెత్తలేదన్నారు. అయితే జీవోఎం వాదనలేమిటనేది కేబినెట్ భేటీలో తెలుస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని పార్టీపరంగానూ, తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. ‘‘యూపీ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించినప్పుడు కొన్ని జిల్లాలను కలిపే విషయంలో పదేళ్ల వరకు ఉద్యమం కొనసాగింది. అయినప్పటికీ రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యేప్పుడు సరిహద్దుల విషయంలో పరస్పర అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కానీ ఇక్కడ పది జిల్లాల ప్రజల్లో తెలంగాణపై ఏకాభిప్రాయం ఉంది’’ అని చెప్పారు. యూపీఏ పాలనలో టీ బిల్లు ఆమోదం అవుతుందంటారా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ ఏర్పాటనేది జరిగితే యూపీఏ-2లోనే అవుతుంది. అది కూడా ఎన్నికల ముందే జరుగుతుంది. ఎన్నికల తర్వాత విభజన జరిగితే యూపీఏ-2లో జరగదు కదా..?’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ డిమాండ్ వెనుక కారణాలను అజిత్‌సింగ్ అడిగి తెలుసుకున్నారని, కేబినెట్లో చర్చకు వచ్చినప్పుడు 10 జిల్లాల తెలంగాణకు ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ దుర్మరణం
పంజాబ్‌లోని మొగ - బర్నాల రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ నిశాంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఘటనలో మరో ముగ్గురు ట్రైనీ ఐఏఎస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ట్రైనీ ఐఏఎస్‌లు ప్రయాణిస్తున్న కారు దల గ్రామ సమీపంలో రహదారి పక్కనున్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన తమకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నామని చెప్పారు. గాయపడిన ట్రైనీ ఐఏఎస్‌లు పి. మల్లిక్, అజిత్ సింగ్, హర్ష కుమార్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. అలాగే డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. తక్కతాపురా నుంచి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. -
ఏవియేషన్‌లో పెట్టుబడులకు భారత్ ఆహ్వానం
వాషింగ్టన్: భారత విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికన్ ఇన్వెస్టర్లను పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ఆహ్వానించారు. పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించడంలో భాగంగా ఈ రంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టినట్లు ఆయన వివరించారు. భారత్-అమెరికా 4వ ఏవియేషన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అజిత్ సింగ్ ఈ అంశాలు తెలిపారు.భారత ఎయిర్‌లైన్స్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 49 శాతానికి పెంచినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకుకూడా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో భారత ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని అజిత్ సింగ్ పేర్కొన్నారు. -
రాష్ట్రాల విభజనకు మేం వ్యతిరేకం
న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టంచేశారు. చిన్న రాష్ట్రాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయని, పెద్ద రాష్ట్రాల నుంచి విడిపోయిన రాష్ట్రాలు విజయవంతం కాలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర అనంతరం చిన్న రాష్ట్రాలపై ములాయం మాట్లాడడం ఇదే తొలిసారి. ‘చిన్న రాష్ట్రాల్లో వనరుల కొరత వల్ల సమస్యలు తలెత్తుతాయి. నక్సలిజం మరో ముఖ్యమైన సమస్య. చిన్న రాష్ట్రాల్లో ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. మా పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకం’ అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హరితప్రదేశ్‌ను విడదీయాలని ఆర్ఎల్డీ నేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న రోజున.. ఆ మంత్రివర్గ భేటీలో అజిత్‌సింగ్ హరితప్రదేశ్ డిమాండ్‌ను లేవనెత్తినట్టు సమాచారం. యూపీ విభజనకు ఆర్ఎల్డీ, బీఎస్పీ అనుకూలంగా ఉండగా.. ఎస్పీ వ్యతిరేకిస్తోంది. -
ఏకాభిప్రాయంతోనే ఎయిరిండియా ప్రైవేటీకరణ
న్యూఢిల్లీ: ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాస్త వెనక్కి తగ్గిన పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ మరో రాగం ఎత్తుకున్నారు. రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం ద్వారానే సంస్థను ప్రైవేటీకరించాలని చెప్పారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎయిరిండియా ప్రైవేటీకరణ అంశాన్నైతే పరిశీలనలో లేదని, అయితే, భవిష్యత్‌లో ఏదో ఒక రోజు మాత్రం ఇలా చేయడం తప్పదని, ఇందుకోసం రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.