హైదరాబాద్: భారత విమనయాన మంత్రిత్వ శాఖ హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ప్రారంభించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ బుధవారం ప్రారంభించారు. 18 దేశాలకు చెందిన 250 విమానయాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద విమానాలు ఎయిర్బస్ ఏ 380, బోయింగ్ 787 సహా 18 ఎయిర్క్రాఫ్ట్ లను ప్రదర్శనకు ఉంచారు. ఈ షోలో పాల్గొనే అమెరికా, సింగపూర్, రష్యా తదితర దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. 12వ ప్రణాళిక సంఘం కాల పరిమితిలో భారత విమానయాన రంగానికి పెద్ద ఎత్తును పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు అజిత్ సింగ్ చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ సహా దాదాపు 70 వేల కోట్ల రూపాయిలు నిధులు సమకూరే అవకాశాలున్నాయని తెలిపారు. 2020 నాటికి ప్రపంచంలో భారత విమానయాన రంగం మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు.
హైదరాబాద్లో ఏవియేషన్ షో షురూ
Published Wed, Mar 12 2014 1:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement
Advertisement