Anand Mahindra Reacts On Old Tea Seller From Amritsar Goes Viral - Sakshi
Sakshi News home page

'టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌'.. వృద్ధుని దుకాణంపై ఆనంద్ మహీంద్ర పోస్ట్.. వీడియో వైరల్‌..

Published Mon, Jul 24 2023 9:04 PM | Last Updated on Mon, Jul 24 2023 9:17 PM

Anand Mahindra Reacts On Old Tea Seller From Amritsar Goes Viral - Sakshi

'టీ ' అంటే మనందరికీ ఇష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగకుండా ఇంకే పని మొదలుపెట్టము. పనిలో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఓ కప్‌ టీ తాగి మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభిస్తాము. అందుకే ఏ సందులో చూసినా టీ షాప్ ఉంటుంది. ఇది ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. అయితే.. తాజాగా అమృత్‌సర్‌లో ఓ వృద్ధుడు కొనసాగిస్తున్న టీ షాప్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 45 ఏళ్లుగా వృద్దుడు ఓ మర్రి చెట్టు మొదలులో టీ షాప్‌ని నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ వ‍్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. 

'అమృత్‌సర్‌లో చాలా ప్రదేశాలు చూశాను. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ టీ షాప్‌ని ఎప్పుడూ చూడలేదు. ఈ సారి అమృత్‌సర్‌ వెళ్లినప్పుడు ఈ దుకాణాన్ని తప్పుకుండా చూస్తాను. గత 40 ఏళ్లుగా ఓ వృద్ధుడు నడిపిస్తున్న టీ షాప్‌ని 'టెంపుల్‌ ఆప్‌ టీ సర్వీస్‌' గా పేర్కొంటూ' ఆనంద్ మహీంద్ర ట‍్వీట్ చేశారు. ఆలోచిస్తే మన హృదయమే దేవాలయం అని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. 

ఈ వీడియోలో 80 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడు ఓ భారీ వృక్షం సందులో టీ షాప్‌ని నిర్వహిస్తున్నాడు. గత 45 ఏళ్ల నుంచి తను ఒకటే పనిని కొనసాగిస్తున్నారు. అందరూ అతన్ని బాబాగా పిలుస్తారు. స్థానికంగా అతనంటే తెలియని వారుండరు. ఈ టీ విక్రయదారునికి పని పట్ల ఉన్న నిబద్ధత, విధేయత, ఆసక్తి నెటిజన్లను ఆకర్షించింది.

ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement