Anand Mahindra Tweet About Shah Rukh Khan, See His Response Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anand Mahindra Tweet On SRK: బాలీవుడ్ బాద్‌షాపై ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్! షారుఖ్ రిప్లై ఇలా..

Published Fri, Aug 4 2023 2:45 PM | Last Updated on Fri, Aug 4 2023 3:51 PM

Anand mahindra tweet about shah rukh khan and see the reply - Sakshi

Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ బాద్‌షా 'షారుఖ్ ఖాన్' (Shah Rukh Khan)ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలోని జిందాబాద్ పాటు విడుదలైంది. ఈ పాటలో యువకుడిగా కనిపించిన షారుఖ్ ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసాడు. ఈ హీరో వయసు 57 సంవత్సరాల? ఈయన వయసు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేఖంగా వెళ్తోందా.. మిగిలిన వారికంటే 10 రెట్లు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని ట్వీట్ చేసాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.

ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్

ఈ ట్వీట్ చూసిన షారుఖ్ ఖాన్.. జీవితం చాలా చిన్నది మాత్రమే కాదు వేగవంతమైంది సర్, దానిని అందుకోవడానికి ట్రై చేస్తున్నా.. నవ్వడం, ఏడవడం, డ్యాన్స్ ఇలా ఏది కావాలంటే ఆలా ప్రయత్నిస్తున్నా! ఉన్న కొన్ని క్షణాలలోనే ఆనందం కోసం కలలు కంటున్నా అంటూ ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement