ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే తాజాగా జీ20 సమావేశాలను ఉద్దేశించి ఒక పోస్ట్ షేర్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మండే మోటివేషన్ అనే ట్యాగ్‌తో జీ20 సమ్మిట్‌కి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో ప్రపంచంలోని చాలా దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో బాపుకి నివాళులు అర్పిస్తున్న చూడవచ్చు. భారతదేశం ప్రపంచ వేదికపై ఎదుగుతున్నప్పుడు, మహాత్ముని బోధనలు ఎల్లప్పుడూ మనకు గౌరవాన్ని మాత్రమే కాకుండా ప్రశంసలను పొందేలా చేస్తాయని వెల్లడించాడు.
ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు
సెప్టెంబర్ 9, 10న జరిగిన ఈ సమావేశాలను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహించింది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరైనట్లు సమాచారం.
Many #MondayMotivation stories & images today, especially after the #G20 But this photo, of all world leaders paying homage to Bapu at Rajghat, will be the one, enduring image I will carry in my mind. As India grows on the world stage, I think the Mahatma’s teachings will always… pic.twitter.com/BXUB7haGER
— anand mahindra (@anandmahindra) September 11, 2023
Comments
Please login to add a commentAdd a comment