ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల ఒక ఆసక్తికరమైన ఏఐ వీడియో తన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
యుద్ధం అనేది జన, ధన, ప్రాణ నష్టాలతో కూడుకున్నది. చరిత్రలో కూడా యుద్దాలు ఎంతటి నష్టాలను కలిగించాయో పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ నేడు కళ్ళముందు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర పోరు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు పాల్పోయారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఆనంద్ మహీంద్రా ఏఐ వీడియో షేర్ చేశారు. ఇందులో పోట్లాడటానికి ఆయుధాలు పట్టుకున్న ఆదిమ మానవుల దగ్గర నుంచి, నేటి యుద్ధ ట్యాంకర్ల వరకు ఎలా అభివృద్ధి చెందాయనేది స్పష్టంగా చూడవచ్చు. దీనిని @intothefab రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో షేర్ చేస్తూ.. ఏఐ టెక్నాలజీ యుద్ధ సాంకేతికత ఎలా అభివృద్ధి చెందిందనేది అద్భుతంగా చూపించింది. అయితే ఇందులో మనం గమనించినట్లతే.. ఇక్కడ జాతి పరిమాణం చెందలేదు. యుద్ధం చేయడానికి అవసరమైన పనిముట్లు అభివృద్ధి చెందాయని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: భారత్‌వైపు పడిన దిగ్గజ కంపెనీల చూపు.. ఇదే జరిగితే..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతమైన పురోగతిని సాధించినప్పటికీ, యుద్ధంలో ఎందుకు పాల్గొంటున్నాము? మన భవిష్యత్ తరాల కోసం శాంతి కోసం పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఇదని అన్నారు. ఇలా తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి
AI created educational graphic showing how the technology of war has evolved. But the ‘education’ is that we haven’t really evolved as a species. The implements and trappings of war may have changed, but we still haven’t figured out how futile it is… pic.twitter.com/VWuHEIa6Oi
— anand mahindra (@anandmahindra) October 12, 2023
Comments
Please login to add a commentAdd a comment