సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ సమావేశానికి ఇండోర్‌కు వచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ నగరంతో అతనికున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం భారీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యధిక జనాభా కలిగిన ఈ నగరంలో పారిశ్రామికీకరణ కూడా డెవలప్ అవుతోంది.
ఆరు పదుల వయసులో కూడా ఎంతో హుందాగా.. మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. కాగా ఇండోర్‌కి వెళ్లడం ఎల్లప్పుడూ మంచిది. నేను నా భార్యను మొదటిసారి కలిసిన నగరం ఇది. మళ్ళీ ఇప్పుడు RBI బోర్డు సమావేశం కోసం అంటూ ట్వీట్ చేశాడు.
ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం
ఇండోర్ ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందింది. ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రోజు రోజుకి కొత్త రూపురేఖలు పొందుతోంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్‌లో ఇండోర్ ఉత్తమ 'నేషనల్ స్మార్ట్ సిటీ'గా ఎంపికైంది.
Always good to get to Indore. It’s the city where I first met my wife. But here for a less romantic reason this time: The @RBI board meeting…😊 Indore still holds on to its title as India’s cleanest city. Right now it’s a bit like a giant construction site. But that’s to build a… pic.twitter.com/ocwIe6CRGB
— anand mahindra (@anandmahindra) September 1, 2023
Comments
Please login to add a commentAdd a comment