టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..! | Delhi Tea Sellers Daughter Cracks CA Exam | Sakshi
Sakshi News home page

టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!

Published Mon, Jul 22 2024 4:58 PM | Last Updated on Mon, Jul 22 2024 5:17 PM

Delhi Tea Sellers Daughter Cracks CA Exam

ప్రతిభ ఎవ్వరి సొత్తు కాదు. ఎందరో మట్టిలో మాణిక్యాలు విద్యతో తమ ప్రతిభాపాటవాలను చాటుకుని ఔరా అనిపించుకున్నారు. సకల సౌకర్యాలు తల్లిదండ్రులు సమకూర్చినా..చదువు అబ్బదు కొందరు పిల్లలకి. మరి కొందరూ కటిక దారిద్ర్యంలో మగ్గిపోతూ కూడా సరస్వతి కటాక్షం మెండుగా ఉంటుంది వారికి. అయితే వారి తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు ఇవ్వలేని స్థితిలో ఉంటారు. చెప్పాలంటే ఉన్నత చదువులు చదివే సత్తా ఉన్న ధనలక్ష్మీ అనుగ్రహం లేక విలవిల్లాడుతుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ అమ్మాయి.  ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి మురిక వాడలో నివశించే టీ అమ్మే వ్యక్తి కూతురు. ఎంతో కష్టపడి సీఏ ఉత్తీర్ణురాలయ్యింది. అందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. ఈ భావోద్వేగపూరిత క్షణాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది అమిత. ఆ పోస్ట్‌లో అమిత..తాను టీ అమ్మే వాళ్ల కూతురునని, తన చదువుకు విషయమై చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు డబ్బు ఆదా చేసి ఇల్లు కట్టుకోమని చెప్పేవారు. 

ఎదిగిన కూతుళ్లతో ఎంతకాలం వీధుల్లో ఉంటారిని సూటిపోటీ మాటలు అనేవారు అంతా. అయినా వాళ్లు అమ్మాయిలు చదివి డబ్బులు సంపాదించినా వేరు వాళ్ల పరమే అవుతుందని ఉచిత సలహాలు ఇచ్చి బాధపెడుతుండేవారిని ఆవేదనగా పోస్టులో తెలిపింది. అంతేగాదు ఏదో ఒక రోజు తాను తన తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందన్న ఆలోచన తనకు రాలేదని, బదులుగా తన కూతుళ్లను బాగా చదివించుకోవాలన్న కసి పుట్టిందని అంటోంది.

ఈ రోజు తాను సాధించిన విజయం నిజమా..? కలనా..? అని సంభమాశ్చర్యంలోనే ఉన్నానంటూ భావోద్వేగంగా చెబుతోంది. పదేళ్ల కష్టం ఫలించిందని, ఏ నాటికైనా ఉత్తీర్ణురాలినవ్వాలంటూ ఆశగా ఎదురుచూశానని పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఆనంద క్షణానికి ఉబ్బితబ్బిబై తనం తండ్రిని హగ్‌ చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. అందుకు సంబధించిన వీడియోకి "భావోద్వేగపు క్షణం" అనే క్యాప్షన్‌తో జోడించి మరీ పోస్ట్‌ చేసింది అమిత. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

(చదవండి: ఆటో డ్రైవర్‌గా మైక్రోసాఫ్ట్‌ ఇంజనీర్‌..ఎందుంటే..?)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement