భారతీయులకు చాయ్ అంటే ఎంత మక్కువ అనేది చెప్పనవసరం లేదు. అదీకూడా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అల్లం టీ సిప్ చేస్తే ఉండే ఆనందమే వేరు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక డ్రైవర్ ఆ చాయ్ మీద ఇష్టం కొద్ది ఏం చేశాడో వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం.
వివరాల్లోకెళ్తే...ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(డీటీఓ) బస్సు డ్రైవర్ టీ కోసం ఏకంగా రద్దీగా ఉండే రహదారి మధ్యలో బస్సును ఆపేశాడు. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతలో టీ కప్పుతో బయటకు వచ్చిన డ్రైవర్ దీన్ని గమనించి..ర్యాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసినట్లు ఉన్నానుకుంటూ.. గబగబ టీకప్పుతో బస్సు వద్దకు వచ్చి స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని శుభ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో పేరుగాంచిన సుదామా టీ స్టాల్ అని, అందుకే డ్రైవర్ అక్కడ బస్సు ఆపాడని ఒక వాయిస్ ఓవర్ వస్తోంది. దీంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై మండిపడుతూ.. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేయాలని ఒకరు, మరోకరేమో అతన్ని ఎందుకు తిడుతున్నారు, సుదామా టీస్టాల్ కారణంగానే ఇది జరగిందంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.
men😭☕ pic.twitter.com/EDOSmxlnZC
— Shubh (@kadaipaneeeer) January 2, 2023
(చదవండి: ఉద్యోగం నుంచి తీసేశారని..యజమానిపై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి)
Comments
Please login to add a commentAdd a comment