Cup tea
-
చాయ్ ఎంత పనిచేయించింది..డ్రైవర్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు!
భారతీయులకు చాయ్ అంటే ఎంత మక్కువ అనేది చెప్పనవసరం లేదు. అదీకూడా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అల్లం టీ సిప్ చేస్తే ఉండే ఆనందమే వేరు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక డ్రైవర్ ఆ చాయ్ మీద ఇష్టం కొద్ది ఏం చేశాడో వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం. వివరాల్లోకెళ్తే...ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీఓ) బస్సు డ్రైవర్ టీ కోసం ఏకంగా రద్దీగా ఉండే రహదారి మధ్యలో బస్సును ఆపేశాడు. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతలో టీ కప్పుతో బయటకు వచ్చిన డ్రైవర్ దీన్ని గమనించి..ర్యాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసినట్లు ఉన్నానుకుంటూ.. గబగబ టీకప్పుతో బస్సు వద్దకు వచ్చి స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని శుభ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో పేరుగాంచిన సుదామా టీ స్టాల్ అని, అందుకే డ్రైవర్ అక్కడ బస్సు ఆపాడని ఒక వాయిస్ ఓవర్ వస్తోంది. దీంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై మండిపడుతూ.. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేయాలని ఒకరు, మరోకరేమో అతన్ని ఎందుకు తిడుతున్నారు, సుదామా టీస్టాల్ కారణంగానే ఇది జరగిందంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. men😭☕ pic.twitter.com/EDOSmxlnZC — Shubh (@kadaipaneeeer) January 2, 2023 (చదవండి: ఉద్యోగం నుంచి తీసేశారని..యజమానిపై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి) -
కప్పు ఛాయ్ రూ. 70! రైల్వే ప్యాసింజర్ షాక్
వైరల్: రైలు ప్రయాణాల్లో దొరికే ఫుడ్, డ్రింక్స్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది?. ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. స్పందన అరకొరగానే ఉంటోంది భారతీయ రైల్వేస్ నుంచి. ఆ సంగతి పక్కనపెడితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో మాత్రం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం సింగిల్ ఛాయ్‌కు 70 రూపాయలు ఓ ప్రయాణికుడి నుంచి వసూలు చేసింది ఐఆర్సీటీసీ . ఈ విషయంపై నిలదీస్తూ సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి భోపాల్ మధ్య ప్రయాణించే భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జూన్ 28న సదరు వ్యక్తి ప్రయాణించాడు. ఉదయం టీ కోసం 20 రూ. చార్జ్ చేసింది ఐఆర్సీటీసీ. అయితే.. సర్వీస్ ఛార్జ్ పేరిట ఏకంగా 50రూ. తీసుకుంది. దీంతో ఇది మోసమంటూ.. జీఎస్టీ బాదుడంటూ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో ఆ బిల్లును పోస్ట్ చేశారు. అయితే అది జీఎస్టీ కాదని.. కేవలం సర్వీస్ ఛార్జ్ మాత్రమే అని అతనికి కొందరు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ 50రూ. టూమచ్ అని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐఆర్సీటీసీ స్పందించింది. నిబంధనల మేరకే వ్యవహరించామని, ఆ ప్రయాణికుడి నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయలేదని తెలిపింది. ఈ మేరకు 2018లో రిలీజ్ అయిన ఓ సర్క్యులర్‌ను చూపిస్తోంది. సదరు సర్క్యులర్ ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వాళ్లు గనుక ఫుడ్ బుక్ చేసుకోని సందర్భాల్లో.. టీ, కాఫీ, ఫుడ్ ఆర్డర్ చేస్తే అదనంగా యాభై రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేస్తారు. అది సింగిల్ ఛాయ్ అయినా సరే.. ఇదే నిబంధన వర్తిస్తుంది. గతంలో రాజధాని, శతాబ్ది రైళ్లలో టికెట్‌తో పాటు ఫుడ్ సర్వీస్ తప్పనిసరిగా ఉండేది. తర్వాత దానిని సవరించి.. ఆప్షనల్ చేసింది ఇండియన్ రైల్వేస్. అప్పటి నుంచి ఇలా బాదుడు షురూ చేసింది. -
టీ కప్పు ప్రచారం..
మన దగ్గర ఓట్ల పండుగ అయిపోయింది. రాజకీయ నాయకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బట్టలు ఇస్త్రీ చేయడం, టీ చేయడం దగ్గరి నుంచి చిన్న పిల్లలకు స్నానాలు చేయించడం వరకు అన్నీ ప్రచారంలో భాగం చేసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం కూడా బాగానే పెరిగిపోయింది. వారికి లాభిస్తుందనుకునే ఏ ఒక్క ప్రచార అస్త్రాన్ని కూడా రాజకీయ నాయకులు వదులుకోరు. ఇండోనేసియాలో కూడా సాధారణ ఎన్నికల వేడిమొదలైంది. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి నేతలు వారికి తోచిన రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రాబోవో సుబియాంటో మాత్రం వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. టీ కప్పులో టీబ్యాగు ట్యాగ్‌పై ఉన్న ఫొటో ఆయనదే. ఇలా కూడా ప్రచారం చేసుకోవచ్చా అనే రీతిలో ఆయన ప్రచారం సాగుతోంది. బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి.. చూద్దాం ఇంకా ప్రచారాలు ఎన్ని పుంతలు తొక్కుతుందో..! -
రోజుకు ఓ కప్పుటీతో మతిమరుపు దూరం
సింగపూర్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవుడిలో సొంతంగా ఆలోచించే శక్తిని రాను రాను తగ్గించేస్తోంది. ప్రతి చిన్న పనికీ ఇంటర్నెట్, కంప్యూటర్, క్యాలిక్యులేటర్ వంటివాటిపై ఆధారపడడంతో ఆలోచనాశక్తితోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా డిమెన్షియా(మతిమరుపు/చిత్తవైకల్యం) సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే దీనికి విరుగుడు రోజు ఓ కప్పు టీ తాగడమేనని చెబుతున్నారు పరిశోధకులు. రోజూ ఓ కప్పు టీ తాగడం వల్ల డిమెన్షియా సమస్య తగ్గుతుందని సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 55 ఏళ్లు పైబడిన 957 మంది చైనీయులపై పరిశోధన చేసి ఈ నిర్ధారణకు వచ్చామని చెప్పారు. జన్యుపరంగా వచ్చిన మతిమరుపు సమస్యతో బాధపడుతున్నవారిలో కూడా ప్రతిరోజూ టీ తాగడం వల్ల సమస్య కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు గుర్తించామన్నారు. అయితే ఏ రకమైన టీ తాగినా ఇవే ఫలితాలు వెల్లడయ్యాయని చెప్పారు. డిమెన్షియాతో బాధపడుతున్నవారిలో సమస్య తీవ్రతను తగ్గించేందుకు అధిక మోతాదులో మందులను వినియోగించాల్సి ఉంటుందని, అయితే మందులు వాడిన తర్వాత కూడా సమస్య మళ్లీ ప్రారంభం కావడం గుర్తించామని, అందుకే ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ టీ తాగడం వల్ల కొంతమేర సత్ఫలితాలు ఉంటాయని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెంగ్ లీ అభిప్రాయం వ్యక్తం చేశారు.