
మన దగ్గర ఓట్ల పండుగ అయిపోయింది. రాజకీయ నాయకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బట్టలు ఇస్త్రీ చేయడం, టీ చేయడం దగ్గరి నుంచి చిన్న పిల్లలకు స్నానాలు చేయించడం వరకు అన్నీ ప్రచారంలో భాగం చేసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం కూడా బాగానే పెరిగిపోయింది. వారికి లాభిస్తుందనుకునే ఏ ఒక్క ప్రచార అస్త్రాన్ని కూడా రాజకీయ నాయకులు వదులుకోరు. ఇండోనేసియాలో కూడా సాధారణ ఎన్నికల వేడిమొదలైంది. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి నేతలు వారికి తోచిన రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రాబోవో సుబియాంటో మాత్రం వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. టీ కప్పులో టీబ్యాగు ట్యాగ్‌పై ఉన్న ఫొటో ఆయనదే. ఇలా కూడా ప్రచారం చేసుకోవచ్చా అనే రీతిలో ఆయన ప్రచారం సాగుతోంది. బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి.. చూద్దాం ఇంకా ప్రచారాలు ఎన్ని పుంతలు తొక్కుతుందో..!
Comments
Please login to add a commentAdd a comment