ముంబై: దేశంలో కరోనా విజృంభణ కారణంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల వారంటీ, ఉచిత సర్వీసుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తమ వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది. టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 31, 2021 నుంచి 2021 మే 31 మధ్య కాలంలో ముగియనున్న ప్రయాణీకుల కార్ల వారంటీ, ఉచిత సర్వీసుల కాలాన్ని ఇప్పుడు 2021 జూన్ 30 వరకు పొడగించింది.
కోవిడ్ -19 కారణంగా తమ వినియోగదారులు వాహనాలను నిర్వహణ, మరమ్మతుల కోసం టాటా మోటార్స్ సేవా కేంద్రాలకు తీసుకురాలేరు కాబట్టి ఈ ప్రకటన చేసినట్లు టాటా మోటార్స్, పీవీబియు, కస్టమర్ కేర్(డొమెస్టిక్ & ఐబి) హెడ్ డింపుల్ మెహతా వివరించారు. లాక్డౌన్ సమయంలో వారంటీ, ఉచిత సర్వీసుల కాలం ముగిస్తే అది మాకు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన చెప్పారు.
మెహతా మాట్లాడుతూ.. "మేము మా కస్టమర్లకు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాము. అందుకే వారి వారంటీ, ఉచిత సర్వీసుల వ్యవధిని 2021 జూన్ 30 వరకు పొడిగించడం ద్వారా ఈ కఠినమైన సమయాల్లో వారికి కొంతైన మద్దతు ఇస్తున్నాము. ఈ చొరవ ద్వారా, మేము మా బ్రాండ్ కస్టమర్లతో కనెక్ట్ అవుతున్నాము" అని అన్నారు. టాటా మోటార్స్ సంస్థకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కి పైగా ప్రాంతాల్లో 608 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి అని తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment