‘వీడియో గేమ్‌ ఆడితే 83 ఏళ్లు ఫ్రీ’ | Netflix Announced Free Subscription Offer | Sakshi
Sakshi News home page

‘వీడియో గేమ్‌ ఆడితే 83 ఏళ్లు ఫ్రీ’

Published Sat, Jul 18 2020 4:21 PM | Last Updated on Sat, Jul 18 2020 4:34 PM

Netflix Announced Free Subscription Offer  - Sakshi

ముంబై: గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వినియోగదారులను ఆకర్శించే ప్రణాళికను నెట్‌ఫ్లిక్స్‌ రచించింది. అయితే వినియోగదారులు ఉచిత సేవలను పొందాలంటే ‘ద ఓల్డ్‌ గార్డ్‌’ అనే వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్‌ తెచ్చుకోవాలని షరతు పెట్టింది. వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్‌ సాధించిన వినియోగదారులకు 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సేవలను పొందవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ఈ వీడియో గేమ్‌ను జులై 17 8గంటల నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఉచిత సేవల ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2020) ఎన్నో ప్రతికూలతలున్న రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే కోవిడ్‌-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డౌన్‌, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది.‌ మరోవైపు కరోనా నేపథ్యంలో కుటుంబ సమేతంగా సినిమాలు వీక్షించే వారికి నెట్‌ఫ్లిక్స్‌ మంచి క్వాలిటీ అందిస్తు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న విషయం తెలిసిందే. (చదవండి: శాంసంగ్‌ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కట్)‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement