
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గించింది. భారత్‌తో పాటు మరో 115 దేశాలలో సబ్‌స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్ 2021లో భారతదేశంలో తక్కువ-ధర సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌లో 30 శాతం పెరుగుదలను, వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నెట్‌ఫ్లిక్స్ మొదటిసారిగా సబ్‌స్క్రిప్షన్ చార్జీలను 20 నుంచి 60 శాతం తగ్గించింది.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు
గతంలో నెలకు రూ.199 ఉన్న నెట్‌ఫ్లిక్స్ మొబైల్-ఓన్లీ ప్లాన్ ఇప్పుడు రూ.149లకు తగ్గింది. అలాగే టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్ ఇలా ఎందులో అయినా యాక్సెస్ చేసుకోగలిగే బేస్ సబ్‌స్క్రిప్షన్ చార్జ్ గతంలో రూ.499 ఉండగా ప్రస్తుతం రూ.199 మాత్రమే. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ చార్జీలు తగ్గాయి.
పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా కుటుంబాలు వినోదాలకు చేసే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ప్రత్యర్థి కంపెనీ నుంచి గట్టి పోటీని నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చార్జీలు తగ్గించిన దేశాల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ వచ్చిన ఆదాయం కేవలం 5 శాతం మాత్రమే.
ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment