జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్ | Reliance Jios new plans offer 100% cashback on JioFi on exchange of old dongle, datacard, routers | Sakshi
Sakshi News home page

జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్

Published Sat, May 6 2017 9:21 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్

జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్

రిలయన్స్ జియో మరోసారి సంచలన ఆఫర్లను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది.
 
దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement