సైబర్ దాడుల కలకలం.. మీరు ఈ సంస్థ రౌటర్లను వినియోగిస్తున్నారా?
వాషింగ్టన్: అమెరికాలో సైబర్ సెక్యూరిటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్ రౌటర్ల ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో చర్యలు ఉపక్రమించింది. సైబర్ సెక్యూరిటీ దాడులపై అమెరికా అప్రమత్తమైంది. టీపీ-లింక్ టెక్నాలజీ కార్పొరేషన్‌కు చెందిన ఇంటర్నెట్ రౌటర్లు సైబర్ దాడులతో ముడిపడి ఉన్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే చైనీస్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సంస్థ రూటర్లు ఉన్నాయని తెలిపారు. Mayorkas: “China has, in fact, hacked into our telecommunications providers…and the extent of it is quite serious…and it is still going on.”Their response? Publish a “best practices” document they hope people in positions of responsibility will read.pic.twitter.com/77Pg0tUvYG— Julia 🇺🇸 (@Jules31415) December 18, 2024దేశంలోని వాణిజ్యం, రక్షణ, న్యాయ శాఖలు టీపీ-లింక్ సంస్థపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగాయి. అదే సమయంలో డ్రాగన్ దేశానికి చెందిన సదరు సంస్థ అమ్మే టీపీ-లింక్ ఇంటర్నెట్ రూటర్ అమ్మకాలపై బ్యాన్ విధించేలా అధికారులు చర్యలు తీసుకోననున్నట్లు తెలుస్తోంది.సైబర్ దాడులపై అనుమానంతో విచారణ చేపట్టేందుకు అమెరికా ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు కంపెనీ వివరాలు చెప్పేందుకు టీపీ-లింక్ టెక్నాలజీ ఆశ్రయించారు. కానీ ఆ సంస్థ వివరాలు చెప్పలేదని సమాచారం. ఈ పరిణామంతో రక్షణ శాఖ సైతం చైనా కంపెనీ తయారు చేసిన రూటర్లపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. టీపీ-లింక్ రూటర్లను వినియోగిస్తే దేశంలో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ అమెరికన్ చట్ట సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు లేఖ రాశారు. అనంతరం జోబైడెన్ చైనా కంపెనీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.