సాక్షి,ముంబై : రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ‘ఆల్ వన్ ప్లాన్’ తీసుకొచ్చి విజయాన్ని సాధించిన జియో ఇదే వ్యూహాన్ని జియో ఫోన్ విషయంలో కూడా అమలు చేస్తోంది. తాజాగా ఇండియా కా స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్‌లను లాంచ్ చేసింది. రూ. 75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది.ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది. అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్ చేస్తోంది. అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఉన్నాయి.
జియో ఫోన్ వినియోగదారుల కోసం తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ద్వారా ప్రత్యర్థుల కంటే 25 రెట్లు ఎక్కువ విలువను అందిస్తున్నామని జియయో పేర్కొంది. ఇటీవల ఇంటర్ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై వినియోగదారులనుంచి నిరసన వ్యక్తం కావడంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకోసం ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment