Jio Phone
-
జియో కొత్త ఫోన్.. రూ.2799 మాత్రమే
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో కొత్త 'జియోఫోన్ ప్రైమ్ 2' ప్రవేశపెట్టింది. నవంబర్ 2023లో కంపెనీ విడుదల చేసిన జియోఫోన్ ప్రైమా 4జీ కొనసాగింపుగా ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ధర రూ. 2,799 మాత్రమే. ఇది లక్స్ బ్లూ అనే ఒకే కలర్ షేడ్‌లో లభిస్తుంది. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.జియోఫోన్ ప్రైమ్ 2 క్వాల్కమ్ చిప్సెట్, 2000 mAh బ్యాటరీ పొందుతుంది. అంతే కాకుండా 2.4 ఇంచెస్ కర్వ్డ్ స్క్రీన్.. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను పొందుతుంది. వీడియో కాలింగ్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడీ టార్చ్ లైట్ కూడా ఉంటుంది.జియో కొత్త ఫోన్.. జియోపేకు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేయడానికి స్కాన్ చేయవచ్చు. ఎంటర్టైన్ కోసం జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లతో వస్తుంది. వినియోగదారులు ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెన్స్ వంటి సోషల్ మీడియా వంటివి యాక్సెస్ చేయవచ్చు. ఇదీ చదవండి: సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్ ఈ కొత్త జియో ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. 120 గ్రాముల బరువున్న ఈ ఫోన్ పరిమాణం 123.4 x 55.5 x 15.1 మిమీ వరకు మాత్రమే ఉంటుంది. హ్యాండ్సెట్ ఒకే నానో సిమ్ ద్వారా 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు. మొత్తం మీద తక్కువ ధర వద్ద మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి జియో కొత్త ఫోన్ మంచి ఆఫర్ అనే చెప్పాలి. -
జియోఫోన్ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!
ముంబై: కై–ఓఎస్ ప్లాట్‌ఫామ్ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్ కీప్యాడ్‌తో జియోఫోన్ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్ స్టోర్స్‌తో పాటు రిలయన్స్ డిజిటల్డాట్ఇన్, జియోమార్ట్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599గా ఉంటుంది. 2.4 అంగుళాల డిస్ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్టైన్మెంట్ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. -
నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..!
మరో వారంలో ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' విడుదల కానున్న విషయం తెలిసిందే. జియో- గూగుల్ సంయుక్తంగా రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను విడుదల చేయడంపై వినియోగదారులు ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు కేవలం రూ.300 నెలవారీ ఈఎంఐని చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. జియో వివరాల ప్రకారం భారత్‌లో విడుదల చేయనున్న 4జీ జియో ఫోన్ నెక్ట్స్‌ను జియో సంస్థ కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది. జియో ఫోన్ ధర చిప్ సెట్ల కొరత కారణంగా భారత్‌లో కాస్త ఎక్కువ ధరకే జియో ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. మన దేశంలో జియో ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించింది. అయితే, కస్టమర్లు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.1,999 ను డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18-24 నెలల్లోగా పే చేయాలి. ఇందుకోసం జియో నాలుగు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ నెక్ట్స్ : కస్టమర్ల కోసం నాలుగు ప్లాన్లు మొదటి ప్లాన్ : ఆల్వేస్ ఆన్ ప్లాన్ కింద 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో కస్టమర్లు ఎంపిక చేసుకున్న ఈఎంఐని బట్టి రూ.350 లేదా రూ.300 మాత్రమే చెల్లించాలి. ఇందులో వినియోగదారులు నెలకు 5జీబీ డేటా ప్లస్ 100నిమిషాల టాక్‌టైమ్‌ను కూడా పొందుతారు. రెండవ ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ లార్జ్ ప్లాన్ కింద కస్టమర్లు 18 నెలలకు రూ.500, 24 నెలలకు రూ.450 చెల్లించాలి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌ను పొందవచ్చు. మూడో ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ కోసం జియో మూడవ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్ఎల్ అని పిలిచే మూడో ప్లాన్‌లో వినియోగదారులు 18 నెలలకు రూ. 550 లేదా 24 నెలలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాల్గవ ప్లాన్ : చివరిగా నాల్గవ ప్లాన్ ఎక్స్ ఎక్స్ఎల్ ప్లాన్. ఈ ప్లాన్‌లో జియో ఫోన్ కొనుగోలుదారులు నెలకు రూ. 600 చొప్పున 18 నెలల పాటు లేదా 24 నెలల పాటు రూ. 550 చెల్లించాలి. ఈ ఆఫర్ వినియోగదారులకు 24 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్లతో పాటు రోజుకు 2.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) సిమ్ పరిమాణం: నానో కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ డెవలప్ చేసింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
దివాళీకి జియో ఫోన్..సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్
ఈ ఏడాది దివాళీ సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. రియలన్స్- గూగుల్ ఆధ్వర్యంలో విడుదల కానున్న ఈ ఫోన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..చిప్ కొరత కారణంగా దీపావళికి అందుబాటులోకి తీసుకొని రానుంది. అయితే జియో ఫోన్ అమ్మకాల్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రిలయన్స్ సరికొత్త బిజినెస్ మోడల్‌ను సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ ఫలితాలపై రిలయన్స్ రిటైల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దినేశ్ థాపర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫోన్లు, టీవీలు, గృహోపకరణాల సేల్స్ కారణంగా రెండవ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ రెండంకెల వృద్ధిని సాధించినట్లు తెలిపారు. ఇక త్వరలో విడుదల కానున్న జియో ఫోన్ నెక్ట్స్ సేల్స్ పెరిగేందుకు అర్బన్, రూరల్ ఏరియాలకు చేరువయ్యే బిజినెస్ ప్లాన్‌ను అమలు చేయనున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని అమ్మే అన్నీ లోకల్ స్టోర్ల సాయంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు రిలయన్స్ రిటైల్ సిద్ధంగా ఉందన్నారు. వారి స్టోర్లలో సైతం జియో మార్ట్‌గా మార్చే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. జియో మార్ట్ డిజిటల్ సేవలు లేదా రిలయన్స్ డిజిటల్ సేవలు అందుబాటులోకి లేని వారికి సైతం ఈ బిజినెస్ మోడల్ ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా,ఈ బిజినెస్ మోడల్ ద్వారా జియో ఫోన్ నెక్ట్స్ సేల్స్ పెంచేందుకు రిలయన్స్ భారీ ప్రయత్నాలు చేస్తుంది. రిలయన్స్ రిటైల్‌లో జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు దారులకు ఆఫర్లు ప్రకటించింది. ఫోన్ కొనుగోలుపై ఈఎంఐ, ఫైనాన్స్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు దినేష్ థాపర్ చెప్పారు. తద్వారా జియో ఫోన్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని రిలయన్స్ అంచనా వేసింది. చదవండి: విడుదలకు ముందు ఆన్లైన్లో జియో ఫోన్ ఫీచర్స్ లీక్! -
విడుదలకు ముందు ఆన్లైన్లో జియో ఫోన్ ఫీచర్స్ లీక్!
విడుదలకు ముందే బడ్జెట్ 'జియోనెక్ట్స్' ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇప్పటికే జియో ఫోన్ వినాయక చవితికి విడుదల రావాల్సి ఉండగా.. సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే, త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్ కాంపోనెట్స్ ధరల కారణంగా.. గతంలో అనౌన్స్ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. దీపావళికి రోజున (నవంబర్ 4న) జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను విడుదల చేస్తామని రిలయన్స్ జియో ధృవీకరించింది. జియో ఫోన్ ఫీచర్స్(అంచనా) 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్ అడ్రినో 306 జీపీయు 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ గో ఓఎస్ ధర - రూ.3,499 (చదవండి: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!) -
రూ.500కే జియో స్మార్ట్ ఫోన్ ! షరతులు వర్తిస్తాయి
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' ఫోన్ అమ్మకాలపై సరికొత్త బిజినెస్ మోడల్‌ను అప్లయ్ చేయనుంది. ఈ 4జీ జియో ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా అతి తక్కువ ధరకే అంటే ఫోన్ ధరలో పదోవంతుకే అందివ్వనుంది. 10వేల కోట్ల టార్గెట్ వినాయకచవితి పండగ సందర్బంగా జియో నెక్ట్స్ మార్కెట్లోకి రానుంది. రాబోయే ఆరు నెలల్లో 5 కోట్ల హ్యాండ్ సెట్లు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయల బిజినెస్ చేయాలని రిలయన్స్ జియో లక్క్ష్యంగా పెట్టుకుంది. దీనికి తగ్గట్టు భారీ స్థాయిలో కొనుగోల్లు జరగాలంటే ఫైనాన్స్ సహకారం ఉండటం అవసరం . దీంతో పలు నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫోన్ ధరలో కేవలం పదిశాతం సొమ్ము చెల్లించి హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా కొనుగోలుదారులు చెల్లించే వీలును కల్పిస్తున్నారు. దీనికి అనుగుణంగా రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ భారీ ఎత్తున ప్లాన్ వేస్తున్నారు. ఇందుకోసం ఎస్బీఐ,పిరమల్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ అస్యూర్, డీఎంఐ ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. షరతులు ఇలా వర్తిస్తాయి! సాధారణంగా ఫైనాన్స్ కంపెనీల సాయంతో ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఫోన్ ధరలో సగం మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే అలాకాదు. రూ.5వేల ఫోన్ ధరపై రూ.500, రూ.7వేల ఫోన్ ధరపై రూ.700 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
రూ.4,000కే రిలయన్స్ జియో 4జీ ఆండ్రాయిడ్ ఫోన్!
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, టెక్ దిగ్గజం గూగుల్ కలిసి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ ను తీసుకొనిరాబోతున్న సంగతి తెలిసిందే. జియో తన యూజర్ల కోసం చౌకైన ధరకే 4జీ స్మార్ట్ ఫోన్ తీసుకు రావాలని యోచిస్తుంది. కేవలం రూ.4 వేలకే జియో 4G స్మార్ట్ ఫోన్ అందించాలని రిలయన్స్ జియో కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా దీనిని అమ్మకానికి తీసుకురానుంది. అయితే, విడుదలకు ముందు దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ప్రైస్ అంతర్జాలంలో లీక్ అయ్యాయి. జియోఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) సహాయంతో పనిచేస్తుంది. ఇది హెచ్ డీ+ డిస్ ప్లేతో పాటు సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని లాంచ్ సమయంలో చెప్పారు. 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జియోఫోన్ నెక్ట్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్ అవుతుందని తెలిపారు.జియోఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్లను ఎక్స్ డిఎ డెవలపర్స్ లో ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన మిషాల్ రెహమాన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. రెహమాన్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 720ఎక్స్1,440 పిక్సెల్స్ డిస్ ప్లేను కలిగి ఉండనుంది. క్వాల్కామ్ క్యూఎమ్215 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 64-బిట్ క్వాడ్-కోర్ మొబైల్ ప్రాసెసర్, క్వాల్కామ్ అడ్రెనో 308 జీపీయుతో రానుంది. ఇందులో బ్లూటూత్ వి4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్ పిడీడీఆర్3 ర్యామ్, ఈఎమ్ఎమ్ సీ 4.5 స్టోరేజీకి మద్దతుతో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ఎక్స్5ఎల్ టిఈ మోడెంతో వస్తుంది. జియోఫోన్ నెక్ట్స్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకువస్తున్నట్లు రెహమాన్ పేర్కొన్నారు. దీనిలో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇక ధర విషయానికి వస్తే కంపెనీ సబ్ $50(సుమారు రూ.4,000) ధరకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక ప్రకటనలు ఇవే!
ముంబై: దేశంలో అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం అట్టహాసంగా కొనసాగింది. కోవిడ్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్లను ఊదేశిస్తూ కీలక ప్రకటనలు చేశారు. అంతే కాదు కోవిడ్ పోరాటంలో ముందుండి నిలిచిన సంస్థ ఉద్యోగుల, కరోనా పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు నివాళులర్పించారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "మేము దేశం గురించి, మా ఉద్యోగుల గురించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంస్థ, చాలా మంది ఉద్యోగులు, వాటాదారులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వారి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. మహమ్మారి తర్వాత కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ మంచి పనితీరు" కనబరిచిందన్నారు. గత వార్షిక సర్వసభ్య సమావేశం నుంచి ఇప్పటి వరకు మా వ్యాపారం, ఫైనాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగిందని ఆయన అన్నారు. ఈ కష్ట కాలంలో మానవాళికి సేవ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము. కరోనా కాలంలో రిలయన్స్ కుటుంబం గొప్ప పని చేసింది, ఈ కారణం చేత మన వ్యవస్థాపక చైర్మన్ ధీరూభాయ్ అంబానీ ఈ రోజు మన గురించి గర్వపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 44వ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక ప్రకటనలు.. ఇషా అంబానీ: ఈ రోజు మా తాత గారు ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారు. దేశంలోని ప్రతి వ్యక్తికి మా సంస్థ తరుపున అవసరమైన వారికి సహాయం అందించాం. మన దేశానికి సేవ చేయడానికి తమ వంతు కృషి చేసినట్లు తెలిపారు. నీతా అంబానీ: ఈ సంవత్సరం మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ అని పేరుతో మహిళల కోసం ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాము. ఇది సమగ్ర, సహకార, ఇంటరాక్టివ్, సామాజిక స్పృహ ఉన్న డిజిటల్ ఉద్యమం. ఈ సంవత్సరం ఉమెన్ కనెక్ట్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించడానికి రిలయన్స్ ఫౌండేషన్ యుఎస్ఐఐడితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నీతా అంబానీ: మహమ్మారికి వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. గత 15 నెలల్లో ముఖేష్, నేను ఈ కష్ట సమయాల్లో మన దేశానికి, మన ప్రజలకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. కరోనాతో పోరాడటానికి రిలయన్స్ ఫౌండేషన్ ఐదు మిషన్లను ప్రారంభించింది. మిషన్ ఆక్సిజన్, మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా, మిషన్ అన్నా సేవా, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురాక్ష. మిషన్ ఆక్సిజన్: ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో భారతదేశం ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంది. రిలయన్స్ వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకుంది. సాంప్రదాయకంగా, మేము ఎప్పుడూ మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయలేదు. అయినప్పటికీ అవసరం వచ్చినప్పుడు, అధిక స్వచ్ఛత కలిగిన మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి, మేము మా జామ్‌నగర్ రిఫైనరీని కొన్ని రోజుల్లో పునర్నిర్మించాము. రెండు వారాల్లోనే మేము రోజుకు 1100 మెట్రిక్ టన్నుల భారీ ఉత్పత్తిని పెంచాము అని పేర్కొంది. నిజానికి పూర్తి స్థాయిలో సామర్థ్యం ఉన్న కొత్త మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సాధారణంగా ఒక సంవత్సరం పడుతుంది. కానీ మా రిలయన్స్ ఇంజనీర్ల, సూపర్-హ్యూమన్ ప్రయత్నంతో అతి స్వల్పమైన సమయంలో ఇది సాధ్యమయ్యేలా చేశారు. 10 రోజులలోపు 85,000 కంటే ఎక్కువ పని-గంటలలో ఉద్యోగులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా: కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి కీలకమైనది కోవిడ్ సంరక్షణ మౌలిక సదుపాయాలు పెంపొందించడం. మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా భారీగా మౌలిక సదుపాయాలు పెంపోదించడానికి ప్రయత్నించాము. గత సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి చెందిన కొద్ది రోజుల్లోనే భారతదేశపు మొట్టమొదటి 250 పడకల COVID ఆసుపత్రి సదుపాయాన్ని ముంబైలో ఏర్పాటు చేసాము అని అంది. సెకండ్ వేవ్ తాకిన సమయానికి, కేవలం ముంబైలో మాత్రమే కోవిడ్ సంరక్షణ కోసం అదనంగా 875 పడకలను ఏర్పాటు చేసాము. ముఖేష్ అంబానీ: రిలయన్స్ కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గత సంవత్సరంలో దాదాపు 75,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ఆర్ఐఎల్ భారతదేశపు అతిపెద్ద వస్తువుల ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రైవేటు రంగంలో కస్టమ్స్ ,ఎక్సైజ్ సుంకాలను అత్యధికంగా చెల్లించే కార్పోరేట్ సంస్థగా ఉంది. మేము ప్రైవేటు రంగంలో అత్యధిక జీఎస్టీ, వ్యాట్ & ఐటీ చెల్లింపుదారులలో ముందు వరుసలో నిలిచాము. మేము గత సంవత్సరంతో పోలిస్తే ఈక్విటీ క్యాపిటల్‌లో రూ .3.24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాము. రిటైల్ వాటాదారులు రైట్ ఇష్యూపై 4x రాబడిని పొందడం ఆనందంగా ఉంది.కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కంపెనీ పనితీరు అత్యుత్తమంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాల నుంచి గణనీయమైన పెరుగుదలతో మా ఏకీకృత ఆదాయం దాదాపు 5,40,000 కోట్లు చేరింది. జియో ప్లాట్‌ఫాం భారతదేశంలో ప్రముఖ డిజిటల్ సంస్థగా నిలిచింది. అంతేకాదు జియో ప్లాట్‌ఫామ్ ఎఫ్వై 21 ఆదాయం రూ.86,493 కోట్లు, EBITDA ఆదాయం రూ .32,359 కోట్లుగా నిలిచింది. జియో ఎఫ్వై 21 సమయంలో 37.9 మిలియన్ల మంది నూతన సబ్ స్క్రయిబర్లను చేర్చింది, 22 సర్కిల్‌లలో 19 లో రెవెన్యూ మార్కెట్ లీడర్‌గా ఉంది. జియో ప్లాట్‌ఫాంలు, రిటైల్, రైట్స్ ఇష్యూ, ఈక్విటీ ద్వారా మార్కెట్ కాపిటల్ రూ.3,24,432 కోట్లు దాటింది. సావరిన్ వెల్త్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీలు తరలి రావడం ద్వారా రిలయన్స్ అభివృద్ధి దేశ వృద్ధి సామర్థ్యం పట్ల ప్రపంచ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించింది. రిలయన్స్ వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ అరాంకోను ఆహ్వానిస్తుంది. సౌదీ అరాంకో ఛైర్మన్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ స్వతంత్ర డైరెక్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో చేరడం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్, టెక్నాలజీలో ఆయన కృషి చాలా విలువైనది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా సౌదీఅరాంకోకు పేరు ఉంది. అంతేకాదు అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన ఈ సంస్థ అనుభవం నుండి మేము ఎంతో ప్రయోజనం పొందుతామని నాకు తెలుసు. యాసిర్ అల్-రుమయ్యన్ మా బోర్డులో చేరడం కూడా రిలయన్స్ అంతర్జాతీయీకరణకు నాంది. జామ్‌నగర్‌లోని 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసే పనిని మేము ప్రారంభించామని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాలలో ఒకటి అవుతుంది. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ: రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ ఫోటో వోల్టాయిక్ ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. మేము ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీని నిర్మిస్తాము. మేము ఒక అధునాతన శక్తి నిల్వ బ్యాటరీ ఫ్యాక్టరీని నిర్మిస్తాము. రాబోయే 3 సంవత్సరాల్లో కొత్త గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాం గూగుల్, జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన జియో ఫోన్ నెక్స్ట్ ను సెప్టెంబర్ 10న ప్రారంభించినట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. గూగుల్, జియో సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశాయి. జియో స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్, ఆటోమేటిక్ రీడ్, ట్రాన్స్ లేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లతో గల స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. జియో 5జి టెక్నాలజీని పరీక్షించింది. టెస్టింగ్ సమయంలో 1జీబీపీఎస్ వేగాన్ని తాకినట్లు పేర్కొంది. దేశంలోనే పూర్తి స్థాయి 5జీ సేవలను ప్రారంభించిన మొదటి నెట్ వర్క్ రిలయన్స్ జియోనే సంస్థ ప్రకటించింది. 5జీ పరికరాల అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం, రిటైల్ రంగాలలో పెనుమార్పులు సంభవిస్తాయని వివరించింది. రిలయన్స్ రిటైల్: ద్వారా రాబోయే మూడేళ్లలో రిటైల్ సంస్థ 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అంబానీ తెలిపారు. 3 సంవత్సరాలలో 1 కోటి మంది కొత్త విక్రేతలను చేర్చుకోవాలని భావిస్తున్నామన్నారు. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో 3 రెట్ల వృద్ధిని ఆశిస్తున్నామన్నారు. "ప్రపంచంలోని టాప్ 10 రిటైలర్లలో ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నాను" అని అంబానీ ఆశించారు. సుందర్ పిచాయ్: ‘‘గూగుల్ క్లౌడ్, జియో మధ్య కుదిరిన 5జీ భాగస్వామ్యం దాదాపు 100 కోట్ల మంది భారతీయులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తుంది. ఇది వారి డిజిటల్ మార్పులు, వ్యాపారాలకు సహకరిస్తుంది. తర్వాతి తరం భారత్ డిజిటలైజేషన్‌కు పునాది వేస్తుంది. భారత్‌లో వ్యాపారాలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే మా ఒప్పందం లక్ష్యం’’ చదవండి: గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 60,000 కోట్ల పెట్టుబడులు -
Reliance AGM: రేపే సమావేశం..భారీ ఒప్పందాలు..ఆఫర్లు..!
ముంబై: ప్రతి సంవత్సరం జరిగే రిలయన్స్ కంపెనీ వార్షిక వాటాదారుల మీటింగ్(AGM) జూన్ 24 గురువారం రోజున ముంబైలో జరగనుంది. రిలయన్స్ ఏర్పాటు చేసే ఏజీఎం మీటింగ్‌పైనే అందరీ దృష్టి. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ భారీ ప్రకటనలు చేస్తోందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. గూగుల్-జియో సంయుక్తంగా అతి తక్కువ ధరకే 5జీ మొబైల్ ఫోన్‌ను ఈ సమావేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ కంపెనీ గత సంవత్సరం రిలయన్స్ జియోలో సుమారు రూ. 33, వేల 737 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తాజాగా 44వ ఏజీఎం మీటింగ్‌లో అతి తక్కువ ధరకే జియో బుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏజీఎం మీటింగ్‌లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. సౌదీకు చెందిన ఆరాంకో కంపెనీతో సుమారు 15 బిలియన్ డాలర్లతో భారీ ఒప్పందం జరగుతుందని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆరాంకో కంపెనీ చైర్మన్ యాసిర్ అల్ రుమయ్యన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ 44వ ఏజీఎం సమావేశం జూన్ 24 మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ సమావేశంలో రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ పలు అంశాలపై మాట్లాడతారు. అంతేకాకుండా జియో 5జీ, జియో బుక్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని జియో మీట్, యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రత్యక్షప్రసారం కానుంది. చదవండి: ప్రాథమిక హక్కులుగా కనెక్టివిటీ, కమ్యూనికేషన్ -
కరోనా: జియో ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్లు
సాక్షి,ముంబై: దేశం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న నేపథ్యంలో టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను ప్రకటించింది. జియో ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రెండు పథకాలను ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్(రోజుకు10 నిమిషాలు) ఉచితం. అలాగే జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనుంది. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేసే జియోఫోన్ యూజర్ అదనంగా మరో 75 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చన్నమాట. ఇందుకు రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. ప్రతీ భారతీయుడికి డిజిటల్ లైఫ్ అందించే లక్ష్యంతో జియోఫోన్‌ను తీసుకొచ్చాం.. ప్రస్తుత మహమ్మారి సంక్షోభకాలంలో వారికి ఎఫర్డబుల్ ధరలో, నిరంతరం సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని జియో వెల్లడించింది ఈ కాలంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపింది. చదవండి: దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే -
జియో ఫోన్ యూజర్స్‌కు శుభవార్త
ముంబై : దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ఊరట కలిగించేలా పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ జియో కూడా ఆ జాబితాలో చేరింది. జియో ఫోన్ వినియోగదారులు ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల కాల్స్, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది. అలాగే జియో ఫోన్ వినియోగదారుల ప్రీపైయిడ్ వ్యాలిటిడీ పూరైనప్పటికీ.. వారికి ఏప్రిల్ 17 వరకు ఇన్కమింగ్ కాల్స్ సేవలు అందజేస్తామని తెలిపింది. జియో ఫోన్లు వాడుతున్న కొన్ని లక్షల మంది తమ బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి, ఒకవేళ అవసరమైతే హెల్త్‌కేర్ సర్వీసులు పొందడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున్న ఆఫ్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే జియో వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా కూడా జియో వినియోగదారులు సులువుగా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ఎస్ఎంఎస్ బ్యాకింగ్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. -
జియో యూజర్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ‘జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్`కు అనూహ్య స్పందన వచ్చిందని రిలయన్స్ తెలిపింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించి మూడు వారాల పాటు కొనసాగించిన ఈ ఆఫర్‌కు ఊహించనంత డిమాండ్ వచ్చిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్‌ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 4జీ డివైస్ ప్లాట్ఫామ్లో నంబర్‌వన్‌గా రిలయన్స్ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ ఆఫర్ ఇలా.. దీపావళి 2019 ఆఫర్లో భాగంగా జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం కలిపి రూ.1500 ప్రయోజనం ప్రతి జియో ఫోన్ వినియోగదారుడికి అందించింది. కొత్తగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. మొదటి ఏడు రీచార్జ్‌లకు రూ.99 విలువైన డాటాను జియో అదనంగా జతచేయనుంది. ఈ డాటాతో ఎంటర్టైన్మెంట్, పేమెంట్స్, ఈకామర్స్, విద్య, శిక్షణ, రైలు, బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మరెన్నో సౌకర్యాలు పొందుతారు. -
జియో ఫోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ : కొత్త ప్లాన్స్
సాక్షి,ముంబై : రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ‘ఆల్ వన్ ప్లాన్’ తీసుకొచ్చి విజయాన్ని సాధించిన జియో ఇదే వ్యూహాన్ని జియో ఫోన్ విషయంలో కూడా అమలు చేస్తోంది. తాజాగా ఇండియా కా స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. రూ. 75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది.ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది. అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్ చేస్తోంది. అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్లు కూడా ఉన్నాయి. జియో ఫోన్ వినియోగదారుల కోసం తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా ప్రత్యర్థుల కంటే 25 రెట్లు ఎక్కువ విలువను అందిస్తున్నామని జియయో పేర్కొంది. ఇటీవల ఇంటర్ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై వినియోగదారులనుంచి నిరసన వ్యక్తం కావడంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకోసం ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్ ప్లాన్లు -
త్వరపడండి: జియో బంపర్ ఆఫర్!
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే కాల్స్, డేటా, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను చవక ధరలకే అందిస్తూ మిగతా టెలికాం సంస్థల పోటీదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సామాన్యుడి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉండాలనే ఉద్దేశంతో జియోఫోన్లు ప్రవేశపెట్టగా వాటిని వినియోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని జియో మరో భారీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించనుంది. దీనికోసం పాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాల్సిన పనిలేకుండా నేరుగా రూ.699కే కొత్త ఫోన్‌ను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జియో సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని జియోఫోన్ దివాళి ఆఫర్‌ను ప్రకటించగా.. ఫోన్ ధరను సగానికి పైగా తగ్గించింది. అంతేకాకుండా నూతనంగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందించనుంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. ఇది మొదటి ఏడు రీచార్జ్‌లకు వర్తిస్తుంది. ఫోన్ కొనుగోలుపై రూ.800, ఏడు రీచార్జీల డేటా విలువ రూ.700 కలిపి వినియోగదారుడు రూ.1500 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే వర్తిస్తుంది. -
అద్భుత ఫీచర్లతో జియో ఫోన్-3!
సాక్షి, ముంబై : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జియోగిగా ఫైబర్ సేవలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. సుదీర్ఘం కాలం పరీక్షల అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కమర్షియల్‌గా లాంచ్ చేయనుంది. ఈ సందర్భంగా జియో తన కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. జియో గిగా ఫైబర్‌తో పాటు జియోఫోన్ 2 కి కొనసాగింపుగా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో జియో ఫీచర్ ఫోన్ 3 ని తీసుకురానుంది. జియోఫోన్ 2 కంటే ఆకర్షణీయ ఫీచర్లతో, దాదాపు అన్ని అంశాలలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. జియో ఫోన్3 ఫీచర్ల పై అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ మైస్మార్ట్‌ప్రైస్ నివేదిక ప్రకారం 4జీ టెక్నాలజీతో జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్సెట్తో రానుంది. 5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. 2జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. -
జియోకు ట్రిపుల్ ధమాకా : గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (జియో) మూడు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ‘గోల్డన్ గ్లోబ్ టైగర్స్' మూడు అవార్డులను జియె గెలుచుకుంది. జియో, జియో కు చెందిన ప్రముఖ కార్యక్రమాలు భాతతీయ డిజిటల్ లైఫ్‌కు ప్రత్యేకమైన, అర్ధవంతమైన ప్రయోజనాలను చేకూర్చిందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో ప్రపంచంలో 300 మిలియన్ల మంది భారతీయులను కనెక్ట్ చేస్తూ మార్కెట్ లీడర్షిప్ అవార్డును దక్కించుకుంది. తాజా 4జీ ఎల్టీఈ టెక్నాలజీతో ప్రపంచంలోని అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్, దేశీయంగా అతిపెద్ద వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించామని జియో ప్రకటనలో తెలిపింది. రెండవది బెస్ట్ కాంపైన్ అవార్డును జియో క్రికెట్ క్రికెట్ ప్లే అలాంగ్ సొంతం చేసుకుంది. మూడవ అవార్డును ఇండియా స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్‌కే దక్కింది. అద్భుతమైన డేటా ప్రయోజనాలతో జియో ఫీచర్ ఫోన్ దేశంలో లక్షలాది మంది వినియోగదారులను ఆకట్టుకుందని జియో తెలిపింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డ్స్-2019 అవార్డులను విజేతలకు అందించారు. మార్కెటింగ్, బ్రాండింగ్, సోషల్ ఇన్నోవేషన్ తదితర రంగాల్లో టైగర్స్‌గా నిలిచిన సంస్థలు, వ్యక్తులకు గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ పురస్కారాలు అందజేస్తారు. -
స్మార్ట్ ఫీచర్లతో జియో ఫోన్ 3
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్రవేశం టెలికం మార్కెట్లో విధ్వంసక మార్పులకు తెరతీసింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ల ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్ ధరలో సామాన్యులకు మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియో ఫోన్ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. 5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ 3 ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. ఈ ఏడాది జూన్‌లో జరిగే రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3 స్మార్ట్‌గా వినియోగదారులను పలకరించనుంది. -
జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో తాజా జియో ఫోన్ యూజర్లకోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.594, రూ.297 దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముకేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ కొత్త పథకాల ద్వారా జియో ఫోన్ వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. రూ 594 పథకం కింద, జియో ఫోన్ వినియోగదారులు 168 రోజులు (దాదాపు ఆరు నెలల) అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. అలాగే జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ అందిస్తోంది. అయితే రోజుకు అపరిమిత హై స్పీడ్ డేటా 0.5జీబీ పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు కు తగ్గుతుందని జియో ప్రకటించింది. అలాగే నెలకు 300 ఎంఎంఎస్‌లు ఉచితం. రూ. 297 ప్లాన్‌లో వినియోగదారులు నెలకు 300 ఎస్ఎంఎస్లతో ఉచిత కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 0.5జీడీ డేటా పొందుతారు. ఈ పరిమితిని దాటినట్లయితే, వేగం 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు అంటే మొత్తం 3నెలలు. -
కుంభ్ జియో ఫోన్ : ఆఫర్లేంటంటే..
సాక్షి, ముంబై: 2019 కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం టెలికం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. భక్తుల సౌకర్యార్థం ఒక స్పెషల్ జియోఫోన్‌ను లాంచ్ చేసింది. తద్వారా జనవరి 15 నుంచి మార్చి 4 వరకు కొనసాగే ప్రపంచ అతిపెద్ద ఉత్సవానికి హాజరయ్యే130 మిలియన్లమందికి పైగా భక్తులకు విశేష సేవలందించేందుకు సిద్ధమైంది. కుంభ మేళా, ముఖ్యమైన ఫోన్ నంబర్లు, ప్రభుత్వ సంబంధిత సేవలు వంటి వివిధ సమాచారాన్ని డిజిటల్ సొల్యూషన్స్ అందించడానికి కుంబ్ జియో ఫోన్‌ను తీసుకొచ్చింది.1991 హెల్ప్‌లైన్ ద్వారా సహాయంతోపాటు, ఉచిత వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను అందించన్నుట్టు జియో ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్’ పేరుతో ఒక యాప్‌ను అందిస్తోంది. తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు జియో తెలిపింది. అలహాబాద్ కుంభమేళా సందర్భంగా యాత్రీకులకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కుంభ్ జియో ఫోన్‌ను ఆ విష్కరించింది. ఇందులో కుంభమేళాకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ కుంభ్ జియో ఫోన్ ద్వారా కుంభమేళాకు సంబంధించి ముఖ్యమైన వార్తల సమాచారం, ప్రకటనలు ఎప్పటికప్పుడు పొందవచ్చు. అలాగే కుంభ్ రేడియో ద్వారా 24x7 భజనలు, ఇతరభక్తి సంగీతాన్ని వినే అవకాశాన్ని కూడా కల్పించింది. కుంభమేళా ప్రదేశం రూట్‌మ్యాప్‌తో పాటు బస్సు, రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి సదుపాయాలు , ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా పూజలు, పవిత్ర స్నానాలకు సంబంధిత సమాచారాన్ని కూడా ఎప్పటికపుడు అందిస్తుంది. ఇతర ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. కుంభ్ జియో ఫోన్ ఫీచర్లు 1991 హెల్ప్‌లైన్ నంబరు ద్వారా ప్రత్యేక సేవలు కుంభమేళాకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యేక బస్సులు, రైళ్లకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ టికెట్స్ బుకింగ్, రైల్వేక్యాంప్ మేళా కుంభమేళా కార్యక్రమాలను జియో టీవీ ద్వారా వీక్షించే సదుపాయం. ఇలా ముఖ్యమైన సందేశాలు, ప్రకటనలు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటాయి. -
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
న్యూఢిల్లీ: కొన్ని నిర్థారిత ప్లాట్‌ఫామ్స్‌కు రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ‘నోకియా ఎస్ 40’లో డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ 2.3.7తో పాటు దాని కంటే పాత ఓఎస్‌లో కూడా వాట్సప్ రాదు. భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఐఓఎస్ సపోర్ట్ చేయబోదని ఇంతకు వాట్సప్ తన బ్లాగ్‌లో పేర్కొంది. తమ సేవలు కొనసాగాలంటే ఓఎస్ 4.0 ప్లస్, ఐఓఎస్ 7 ప్లస్ లేదా విండోస్ ఫోన్ 8.1 ప్లస్‌కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.3 కంటే పాత ఓఎస్‌లో వాట్సప్ పనిచేయదు. విండోస్ ఫోన్ 7, ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6, నోకియా సింబియన్ ఎస్ 60 వెర్షన్లలో కూడా వాట్సప్ రాదు. ఐఓఎస్ 7, పాత వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్.. ఐఓఎస్ 7 ఆధారంగా నడుస్తున్నాయి. ఆండ్రాయిడ్ రన్నింగ్ ఓఎస్ 4.0 ప్లస్, ఐఫోన్ రన్నింగ్ ఐఓఎస్ 8 ప్లస్, విండోస్ ఫోన్ 8.1 ప్లస్, జియో ఫోన్, జియో ఫోన్ 2లకు వాట్సప్ సేవలు కొనసాగుతాయి. అయితే ఈ ఫోన్లలో చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదని వాట్సప్ వెల్లడించింది. చాట్ హిస్టరీని ఈ-మెయిల్‌కు పంపుకోవచ్చని సూచించింది. -
‘జియోఫోన్ 2’ తర్వాత సేల్ ఎప్పుడంటే..
రిలయన్స్ జియో తన జియోఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్‌ను ప్రారంభించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ జియో వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి తెచ్చింది. జియో.కామ్, రిలయన్స్ జియో వెబ్సైట్లో ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించింది. జియోఫోన్ 2 తొలి సేల్‌ను ముగించి, తర్వాతి ఫ్లాష్ సేల్ ఆగస్టు 30 మధ్యాహ్నం 12 గంటలకు అని కూడా పేర్కొంది. జియో ఫోన్ 2 ధర 2999 రూపాయలు. వినియోగదారులు తమ పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చి రూ. 501కు కొత్త జియో ఫోన్‌ను పొందవచ్చు. జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 కింద ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. జియోఫోన్ 2 ఫీచర్లు 2.4 అంగుళాల హారిజంటల్ డిస్ప్లేతో పాటు క్వర్టీ కీప్యాడ్ జీపీఎస్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సప్ 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమరీ కార్డుతో 128 జీబీ వరకు) 2000ఎంఏహెచ్ బ్యాటరీ వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా ముందు భాగంలో వీజీఏ సెల్ఫీ కెమెరా 4జీ ఫీచర్, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై ‘భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు జియోఫోన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రతి ఒక్క భారతీయుడికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను కల్పించి, డిజిటల్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం కల్పించనున్నాం’ అని జియోఫోన్ 2ను అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్ జియో ఈ ప్రకటన చేసింది. జియోఫోన్ లేటెస్ట్ ఫీచర్లు... ఆగస్టు 15 నుంచి ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను జియోఫోన్ కస్టమర్లు పొందుతున్నారు. వాట్సాప్ కూడా బ్యాచ్ వారీగా అందుబాటులోకి వస్తుంది. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్, జియోఛాట్ అప్లికేషన్ల ప్రీమియం కంటెంట్‌ను పొందడంతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ కూడా పొందుతారు. వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం, ఇంటర్నెట్ సెర్చ్ చేసుకోవడం, మ్యూజిక్ ప్లే చేయడం, వీడియోలు చూడటం వంటివి చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను పొందవచ్చు. -
జియో కొత్త ఎత్తుగడ: 112 జీబీ ఉచితం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ఆఫర్ ప్రకటించింది. వినూత్న పథకాలతో కస్టమర్లకు ఈసారి మరో ఆసక్తికర వలతో ఉచిత డేటా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలంటే జియో వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనిపించాలి. ‘జియో ఫోన్ మ్యాచ్ పాస్’ అని ప్రకటించిన ఈ ఆఫర్లో 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వాలిడిటీ 56రోజులు. అంటే మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. దీనితోపాటు 4డే జియో క్రికెట్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లలో నాలుగు రోజులు పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం జియో వినియోగదారుడు ద్వారా 10మంది స్నేహితులు లేదా, బంధువులు జియో ఫోన్ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది. జియో ఫోన్ మ్యాచ్ పాస్ ఆఫర్ 1800-890-8900 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి. తరువాత సదరు స్నేహితులు టోల్ ఫ్రీకి కాల్ చేసి, వారి మొబైల్ ఫోన్ నెంబరు, తాముండే ఏరియా పిన్‌కోడ్ ఎంటర్ చేయాలి. అనంతరం జియో రీటైలర్ వద్దగానీ, జియో వెబ్సైట్లో ఆన్లైన్ ఆర్డర్ ద్వారా గానీ జియో ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది. సంబంధిత స్నేహితుని జియో నంబర్ యాడ్ అయిన తరువాత మాత్రమే ఆయా ఖాతాల్లో ఈ ఉచిత డేటా ఆఫర్ క్రెడిట్ అవుతుంది. పాస్ ఆఫర్ ప్రక్రియ ముగిసిన అనంతరం దశలవారీగా డేటా ఆఫర్‌ను అందివ్వనుంది. 112 జీబీ ఆఫర్ పొందడం ఎలా? 112 జీబీ డేటా అందుకోవాలంటే మొత్తం 10మంది స్నేహితులు, లేదా బంధువులు జియో ఫోన్ కొనుగోలు చేయాలి. మొదటి నాలుగు సబ్స్క్రైబర్ల తరువాత రోజుకు 2 జీబీ చొప్పున నాలుగురోజుల పాటు 8 జీబీడేటా ఉచితం. 5గురు స్నేహితులు కొనుగోలు తరువాత 12రోజులుపాటు 24జీబీ వాడుకోవచ్చు. 6-9 మధ్య స్నేహితులను పరిచయం చేస్తే 8జీబీ (నాలుగురోజులు) డేటా. ఇక చివరగా 10వ ఫ్రెండ్‌కి గాను 24జీబీ డేటా 12 రోజుల (2జీబీ రోజుకు) పాటు అందిస్తుంది. -
మీకు జియోఫోన్ ఉందా, అయితే...
50 శాతం అదనపు డేటాతో ఇటీవలే రిపబ్లిక్ డే ఆఫర్లు ప్రకటించి ప్రత్యర్థుల గుండెల్లో గుబేలు పుట్టించిన రిలయన్స్ జియో... మరో సంచలనానికి తెరతీసింది. రిపబ్లిక్ డే ఒక్క రోజు ముందు జియోఫోన్ యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటాతో సరికొత్తగా రూ.49 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల పాటు ఈ టారిఫ్ ప్లాన్ వాలిడ్‌లో ఉంటుందని నేడు(గురువారం) జియో తెలిపింది. శుక్రవారం నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అదనపు డేటా కోసం చూస్తున్న కస్టమర్ల కోసం జియో రూ.11, రూ.21, రూ.51, రూ.101లలో కొత్త డేటా ఆడ్-యాన్లను ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫీచర్ ఫోన్లలో జియోఫోన్ స్మార్టర్‌గా పేరుతెచ్చుకుంది. స్మార్ట్‌ఫోన్ మాదిరి ఇంటర్నెట్ డివైజ్‌గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్ జియో కల్పించింది. 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈని ఇది ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ను బీట్ చేసి మరీ ఫీచర్‌ఫోన్ మార్కెట్లో 27శాతం వాటాతో రిలయన్స్ 'జియోఫోన్' బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. వచ్చే ఏళ్లలో 99 శాతం దేశీయ జనాభాను కవర్ చేయాలని రిలయన్స్ జియో ప్లాన్చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే 10వేల ఆఫీసులను, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం 10 లక్షల అవుట్లెట్లను ఇది ప్రారంభించబోతుంది. కాగ, జియోఫోన్ రూ.153 ప్లాన్‌తో తొలుత ప్రారంభమైంది. ఈ ప్లాన్‌లో ఉచిత వాయిస్, అపరిమిత డేటా, జియో యాప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. -
శాంసంగ్‌ను బీట్ చేసి మరీ జియో సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్లో సునామీ సృష్టించిన రిలయన్స్ ..ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లోకూడా దూసుకుపోతోంది. తాజా నివేదికల ప్రకారం జియో లాంచ్ చేసిన ఇండియా కా స్మార్ట్‌ఫోన్ టాప్ ప్లేస్ కొట్టేసింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ను బీట్ చేసి మరీ ఫీచర్‌ఫోన్ మార్కెట్లో అదరగొట్టింది. 27శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ ‘జియోఫోన్’ బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2017 నాలుగో త్రైమాసికంలో తయారీ సంస్థల నుంచి సరఫరా (షిప్మెంట్)లను పరిగణనలోకి తీసుకుని, ఈ నివేదికను సంస్థ రూపొందించింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొంది. అంతేకాదు సౌత్ కొరియన్ బ్రాండ్ శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది. శాంసంగ్ మార్కెట్వాటా 17శాతంతో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 9శాతంతో మైక్రోమాక్స్ మూడవ స్థానంలో నిలిచింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం చివర్లో రూ.1,500 విలువైన జియో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయాలు అధికంగా జరిగాయని, గిరాకీ-సరఫరాల మధ్య అంతరాయాన్ని నివారించగలిగిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఫోన్‌కు 60 లక్షల ముందస్తు బుకింగ్‌లు లభించాయని నివేదించింది. ముఖ్యంగా సాధారణ ఫీచర్‌ఫోన్ వాడే వినియోగదారులు, ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్ ద్వారా 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ కావాలని భావించడమే జియోఫోన్ గ్రోతఖ్‌కు కారణాలని కౌంటర్‌పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. నగదు వాపసు పొందడం ద్వారా, జియోఫోన్‌ను ఉచితంగా వినియోగించుకునే వీలు దక్కడం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే జియో 4జీ ఫీచర్ ఫోన్లో 153 రూపాయల రీచార్జ్ ప్లాన్‌లో 1 జీబీ డేటాను ఆఫర్ చేయడం కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుందని తెలిపారు. -
జియోఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్
ముంబై : రిలయన్స్ జియో ఫోన్ యూజర్లకు ఆ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. జియోఫోన్‌కు చెందిన 153 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అప్‌గ్రేడ్ చేసిన ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ 4జీ హై స్పీడ్ డేటాతో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్ని జియో యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్యాక్ వాలిడిటీ అంతకముందు లాగానే 28 రోజులు. రిలయన్స్ జియో అప్‌గ్రేడ్ చేసిన రూ.153 ప్యాక్ కింద అంతకముందుకు రోజుకు 500 ఎంబీ 4జీ హైస్పీడ్ డేటా మాత్రమే లభ్యమయ్యేది. జియో ఫోన్ యూజర్లకు అదనంగా మరో రెండు శాచెట్ ప్యాక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒకటి రూ.24 ప్యాక్. దీని కింద రోజుకు 500 ఎంబీ హై స్పీడ్ డేటా, 20 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సస్‌ను రెండు రోజుల పాటు లభ్యమవనున్నాయి. రెండోది రూ.54 ప్యాక్. దీని కింద ఏడు రోజుల పాటు పైన పేర్కొన్న ప్రయోజనాలనే ఆఫర్ చేస్తుంది. కానీ ఎస్ఎంఎస్లు 70 వస్తాయి. జియోఫోన్‌కు చెందిన రూ.153 ప్రీపెయిడ్ ప్యాక్‌కు అందించే ప్రయోజనాలే, 4జీ స్మార్ట్ఫోన్లకు చెందిన రూ.149 ప్యాక్‌పై కూడా జియో అందిస్తోంది. మరో రూ.309 నెలవారీ ప్యాక్‌ను కూడా జియో ప్రకటించింది. దీని కింద జియోటీవీ, జియో సినిమా వంటి యాప్స్ నుంచి కంటెంట్‌ను కూడా జియో ఫోన్ యూజర్లు పొందవచ్చు. కాగ, గతేడాది జూలైలో కంపెనీ తన జియోఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.1500 డిపాజిట్ చేసి, ఈ ఫోన్‌ను పొందవచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని జియో రీఫండ్ చేయనుంది.