50 శాతం అదనపు డేటాతో ఇటీవలే రిపబ్లిక్ డే ఆఫర్లు ప్రకటించి ప్రత్యర్థుల గుండెల్లో గుబేలు పుట్టించిన రిలయన్స్ జియో... మరో సంచలనానికి తెరతీసింది. రిపబ్లిక్ డే ఒక్క రోజు ముందు జియోఫోన్ యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటాతో సరికొత్తగా రూ.49 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల పాటు ఈ టారిఫ్ ప్లాన్ వాలిడ్‌లో ఉంటుందని నేడు(గురువారం) జియో తెలిపింది. శుక్రవారం నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అదనపు డేటా కోసం చూస్తున్న కస్టమర్ల కోసం జియో రూ.11, రూ.21, రూ.51, రూ.101లలో కొత్త డేటా ఆడ్-యాన్లను ప్రకటించింది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫీచర్ ఫోన్లలో జియోఫోన్ స్మార్టర్‌గా పేరుతెచ్చుకుంది. స్మార్ట్‌ఫోన్ మాదిరి ఇంటర్నెట్ డివైజ్‌గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్ జియో కల్పించింది. 4జీ వాయిస్‌ఓవర్ ఎల్‌టీఈని ఇది ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ను బీట్ చేసి మరీ ఫీచర్‌ఫోన్ మార్కెట్‌లో 27శాతం వాటాతో రిలయన్స్ 'జియోఫోన్' బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది.
వచ్చే ఏళ్లలో 99 శాతం దేశీయ జనాభాను కవర్ చేయాలని రిలయన్స్ జియో ప్లాన్‌చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే 10వేల ఆఫీసులను, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం 10 లక్షల అవుట్‌లెట్లను ఇది ప్రారంభించబోతుంది. కాగ, జియోఫోన్ రూ.153 ప్లాన్‌తో తొలుత ప్రారంభమైంది. ఈ ప్లాన్‌లో ఉచిత వాయిస్, అపరిమిత డేటా, జియో యాప్స్‌ను ఉచితంగా అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment