జియో కొత్త ఫోన్.. రూ.2799 మాత్రమే | JioPhone Prima 2 Launched in India at Rs 2799 | Sakshi
Sakshi News home page

జియో కొత్త ఫోన్.. రూ.2799 మాత్రమే

Published Tue, Sep 10 2024 9:17 PM | Last Updated on Tue, Sep 10 2024 9:21 PM

JioPhone Prima 2 Launched in India at Rs 2799

ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో కొత్త 'జియోఫోన్ ప్రైమ్ 2' ప్రవేశపెట్టింది. నవంబర్ 2023లో కంపెనీ విడుదల చేసిన జియోఫోన్ ప్రైమా 4జీ కొనసాగింపుగా ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ధర రూ. 2,799 మాత్రమే. ఇది లక్స్ బ్లూ అనే ఒకే కలర్ షేడ్‌లో లభిస్తుంది. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జియోఫోన్ ప్రైమ్ 2 క్వాల్‌కమ్‌ చిప్‌సెట్, 2000 mAh బ్యాటరీ పొందుతుంది. అంతే కాకుండా 2.4 ఇంచెస్ కర్వ్డ్ స్క్రీన్‌.. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను పొందుతుంది. వీడియో కాలింగ్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడీ టార్చ్ లైట్ కూడా ఉంటుంది.

జియో కొత్త ఫోన్.. జియోపేకు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేయడానికి స్కాన్ చేయవచ్చు. ఎంటర్‌టైన్‌ కోసం జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లతో వస్తుంది. వినియోగదారులు ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెన్స్ వంటి సోషల్ మీడియా వంటివి యాక్సెస్ చేయవచ్చు.

 ఇదీ చదవండి: సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్ 

ఈ కొత్త జియో ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. 120 గ్రాముల బరువున్న ఈ ఫోన్ పరిమాణం ‎123.4 x 55.5 x 15.1 మిమీ వరకు మాత్రమే ఉంటుంది. హ్యాండ్‌సెట్ ఒకే నానో సిమ్ ద్వారా 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు. మొత్తం మీద తక్కువ ధర వద్ద మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి జియో కొత్త ఫోన్ మంచి ఆఫర్ అనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement