రిలయన్స్ జియో.. ఎట్టకేలకు జియోభారత్ సిరీస్‌లో వీ3, వీ4 ఫోన్‌లను ఆవిష్కరించింది. 2జీ ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులను 4జీ డిజిటల్ ప్రపంచంవైపు తీసుకెళ్లడానికి కంపెనీ ఈ మొబైల్స్ రూపొందించింది. ఇవి చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.
ధర
జియోభారత్ సిరీస్ మొబైల్ ఫోన్స్ ధర కేవలం రూ.1099 మాత్రమే కావడం గమనార్హం. వీ3, వీ4 రెండు మోడల్స్ త్వరలో ఫిజికల్ మొబైల్ సెల్లింగ్ అవుట్‌లెట్‌లలో మాత్రమే కాకుండా జియో మార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కూడా 40 శాతం తక్కువ. జియో భారత్ సిరీస్ ఫోన్ కేవలం రూ.123 రీఛార్జ్ ప్లాన్‌తో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ వరకు డేట్ లభిస్తుంది.
బ్యాటరీ & స్టోరేజ్
జియోభారత్ సిరీస్ వీ3, వీ4 ఫోన్స్ 1000 mAh బ్యాటరీ పొందుతాయి. 125 జీబీ వరకు స్టోరేజిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్స్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి.
వీ3, వీ4 రెండు మోడల్‌ల ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ కూడా పొందవవచ్చు. జియో టీవీ వినియోగదారులు ఈ మొబైల్స్ ద్వారా తమకు ఇష్టమైన షోలు, వార్తలు లేదా గేమ్స్ వంటి వాటిని వీక్షించడానికి 455 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్ యాక్సెస్ పొందుతారు.
ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు
జియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్‌తో, డిజిటల్ పేమెంట్లు సులభంగా చేసుకోవడానికి కూడా ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి. జియోచాట్ యూజర్లు అన్‌లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్ పొందుతారు. తద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ ఈ ఫోన్స్ అనుమతిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment