యాపిల్ కొత్త ఫోన్.. 16e: ధర తెలిస్తే కొనేస్తారు! | Apple iPhone 16e Launched, Check Its Indian Price Details And Other Specifications | Sakshi
Sakshi News home page

iPhone 16e Launch: యాపిల్ కొత్త ఫోన్.. 16e: ధర తెలిస్తే కొనేస్తారు!

Published Thu, Feb 20 2025 10:19 AM | Last Updated on Thu, Feb 20 2025 10:44 AM

iPhone 16e Launched At Rs 59900

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 16ఈ'ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ  లేటెస్ట్ ఫోన్ 2025లో అత్యంత సరసమైన మోడల్‌గా ఐఫోన్ 16 లైనప్‌లోకి చేరింది. వేగవంతమైన పనితీరు కోసం ఇది ఏ18 చిప్ పొందుతుంది.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.

వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. ఫ్రీ ఆర్డర్స్ శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభమవుతాయి. ఆ తరువాత వారంలో సేల్స్ మొదలవుతాయి.

ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్‌తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్‌ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

 ఇదీ చదవండి: ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు

ఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్‌తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement