రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (జియో) మూడు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ‘గోల్డన్ గ్లోబ్ టైగర్స్' మూడు అవార్డులను జియె గెలుచుకుంది. జియో, జియో కు చెందిన ప్రముఖ కార్యక్రమాలు భాతతీయ డిజిటల్ లైఫ్‌కు ప్రత్యేకమైన, అర్ధవంతమైన ప్రయోజనాలను చేకూర్చిందని కంపెనీ తెలిపింది.
రిలయన్స్ జియో ప్రపంచంలో 300 మిలియన్ల మంది భారతీయులను కనెక్ట్ చేస్తూ మార్కెట్ లీడర్షిప్ అవార్డును దక్కించుకుంది. తాజా 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీతో ప్రపంచంలోని అతి పెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్, దేశీయంగా అతిపెద్ద వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించామని జియో ప్రకటనలో తెలిపింది.
రెండవది బెస్ట్ కాంపైన్ అవార్డును జియో క్రికెట్ క్రికెట్ ప్లే అలాంగ్ సొంతం చేసుకుంది. మూడవ అవార్డును ఇండియా స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్‌కే దక్కింది. అద్భుతమైన డేటా ప్రయోజనాలతో జియో ఫీచర్ ఫోన్ దేశంలో లక్షలాది మంది వినియోగదారులను ఆకట్టుకుందని జియో తెలిపింది.
మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డ్స్-2019 అవార్డులను విజేతలకు అందించారు. మార్కెటింగ్, బ్రాండింగ్, సోషల్ ఇన్నోవేషన్ తదితర రంగాల్లో టైగర్స్‌గా నిలిచిన సంస్థలు, వ్యక్తులకు గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ పురస్కారాలు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment