reliance jio infocom
-
ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) జాక్ మా.. 5వ ప్లేస్ ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజస్‌ను ఏప్రిల్‌లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్‌లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్‌కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ముకేశ్ స్పీడ్ నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన ఆర్ఐఎల్ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్‌కల్లా ఆర్ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు. జాక్ మాకు షాక్ చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్‌లో మార్కెట్ లీడర్‌గా నిలుస్తున్న నాంగ్ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు. -
5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీని త్వరితగతిన అనుమతించమంటూ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వీలుగా పాలసీ నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా అభ్యర్థించారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ జోరందుకునేందుకు పలు సూచనలను చేశారు. మూడు రోజుల భారత్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు 2020 ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్ వద్ద డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పలు అంశాలను ప్రస్తావించారు. వివరాలు ఇలా.. చౌక ఫోన్లతో వచ్చే ఏడాది(2021) ద్వితీయార్థానికల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసి ఉంది. ఇదేవిధంగా అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలు కల్పించవలసి ఉంది. ఇందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ప్రధాని మోడీజీ డిజిటల్ మిషన్ కారణంగా కోవిడ్-19 వల్ల ఎదురైన కష్టకాలంలోనూ దేశం బలంగా నెగ్గుకురాగలిగింది. ఆన్లైన్లోనే విద్య, షాపింగ్, ఆఫీసులు, ఆరోగ్యం తదితర పలు కార్యక్రమాలు కొనసాగాయి. ఇందుకు దేశమంతటా విస్తరించిన 4జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు సహకరించాయి. అయితే ఇప్పటికీ 30 కోట్లమంది ప్రజలు 2జీ నెట్‌వర్క్‌కే పరిమితమై ఉన్నారు. చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లకు తెరతీయడం ద్వారా మరింతమంది ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వీలుంటుంది. ప్రభుత్వ సహకారం కారణంగా టెలికం పరిశ్రమ పలు సర్వీసులను అందించగలిగింది. కోవిడ్-19 కట్టడికి త్వరలో చౌక ధరలోనే వ్యాక్సిన్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నందున 2021లో పరిస్థితులు చక్కబడతాయని విశ్వసిస్తున్నాను. దీంతో ఆర్థిక రికవరీతోపాటు.. జీడీపీ వృద్ధి బాట పట్టేవీలుంది. తద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశలో పరుగుపెట్టనుంది. జియో ముందుంటుంది ప్రస్తుతం ప్రపంచంలో భారత్ సైతం డిజిటల్ కనెక్టెడ్ దేశాల జాబితాలో ముందుంటోంది. దీనిని కొనసాగిస్తూ ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన 5జీ సేవలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. అందుబాటు ధరలో సర్వీసులు, స్మార్ట్ఫోన్లకు అవకాశం కల్పించవలసి ఉంది. తద్వారా 2021 ద్వితీయార్థానికల్లా రిలయన్స్ జియో ద్వారా 5జీ విప్లవానికి బాటలు వేయగలం. దీంతో దేశీయంగా 5జీ నెట్వర్క్, హార్డ్‌వేర్, టెక్నాలజీ పరికరాల తయారీకి ఊపు లభిస్తుంది. ప్రధాని మోడీజీ ఆవిష్కరించిన ఆర్మనిర్భర్ భారత్ విజన్‌లో జియో 5జీ సర్వీసులు భాగంకావడం ద్వారా డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ఊపు నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆధునిక సాంకేతితతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, వాణిజ్య విభాగాలలో కొత్తతరహా సర్వీసులను అందిస్తున్నాం. హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టవలసి ఉంది. ఇప్పటికే మంత్రివర్యులు రవిశంకర ప్రసాద్ కృషి నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు దేశానికి తరలివచ్చి హార్డ్‌వేర్ తయారీపై దృష్టిపెడుతున్నాయి. పూర్తిస్థాయిలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సాధించేందుకు దేశీయంగా తయారీని బలపరుచుకోవలసి ఉంది. తద్వారా దిగుమతులపై ఆధారపడటానికి చెక్ పెట్టవచ్చు. -
15% వాటాకు రూ. 63,000 కోట్లు!
న్యూఢిల్లీ: అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ సంస్థలు రిలయన్స్ రిటైల్‌లో వాటాపై కన్నేసినట్లు తెలుస్తోంది. 15 శాతం వాటాకు సై రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాలను విక్రయించాలని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా రూ. 63,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఊహిస్తున్నాయి. సిల్వర్ లేక్ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్), అబుధబీకి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అబుధబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏడీఐఏ), ఎల్‌కేటర్‌టన్‌సహా.. పీఈ దిగ్గజం కేకేఆర్.. రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. షేరు జూమ్ రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 2,223ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. చదవండి: ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..! -
జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్లోడ్స్
ముంబై: రిలయన్స్ జియో ఇటీవల ఆవిష్కరించిన వీడియో కాలింగ్ యాప్ జియో మీట్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. యాప్ లాంఛ్ అయిన మూడురోజుల్లోనే 10 లక్షలమందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ యాప్‌లకు భారీ డిమాండ్ నెలకొంది. అయితే వీడియో కాలింగ్ సర్వీస్‌తో కూడిన యాప్‌ను లాంచ్ చేస్తామని గత ఏప్రిల్‌లోనే జియా రిలయన్స్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ జియోలో ఇంటెల్- జియోమీట్ యాప్) జియో మీట్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 720పీ వీడియో క్వాలిటీతో పాటు 100 మంది ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. జూమ్ యాప్‌కి ధీటుగా వచ్చిన జియో మీట్‌కి ఇప్పటికే భారీ ఆదరణ లభిస్తుంది. ‘వినియోగదారుల సమాచారం భద్రంగా ఉంటుంది. మీ గోప్యతకు భంగం వాటిల్లనివ్వం. పూర్తి పారదర్శకతతో పనిచేస్తాం’ అంటూ జియా మీట్ వెబ్సైట్లో ప్రత్యేకంగా రాసుకొచ్చారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీ అభిప్రాయాలను grievance.officer@jio.comకు పంపాల్సిందిగా కోరింది. (జియోలో మరో భారీ పెట్టుబడి) -
రిలయన్స్ జియోలో ఇంటెల్- జియోమీట్ యాప్
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియోలో మరో విదేశీ దిగ్గజం ఇన్వెస్ట్ చేస్తోంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్.. రిలయన్స్ జియోలో 0.39 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటిపకే రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 43,574 కోట్లు వెచ్చించింది. 100 మందికి వీలుగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్‌కు వీలు కల్పించే యాప్‌ను ప్రవేశపెట్టింది. జియోమీట్ పేరుతో వీడియో కాలింగ్ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ప్లే స్టోర్‌తోపాటు యాప్ స్టోర్‌లోనూ జియోమీట్ అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా 100 మందివరకూ వీడియో కాన్ఫరెన్సింగ్‌లో పాల్గొనవచ్చని తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల ద్వారా ఉచితంగా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చని వివరించింది. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ద్వారా వినియోగదారులు వీడియో కాన్ఫరెన్సింగ్‌కు హాజరుకావచ్చని తెలియజేసింది. 11 వారాల్లో 12 కంపెనీలు గత 11 వారాల్లో రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మొత్తం 12 కంపెనీలు పెట్టుబడులకు క్యూ కట్టాయి. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం 25.09 వాటాను విక్రయించింది. వెరసి రూ. 1,17,588 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఇటీవల జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలలో జనరల్ అట్లాంటిక్, సిల్వర్‌లేక్ పార్టనర్స్, విస్టా, ముబడాలా, కేకేఆర్, సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్ పీఐఎఫ్ తదితరాలు చేరాయి. -
విదేశాలలో రిలయన్స్ జియో లిస్టింగ్!
అనుబంధ డిజిటల్, మొబైల్ విభాగం రిలయన్స్ జియోను విదేశాలలో లిస్ట్ చేసే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి విదేశాలలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వెళ్లే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా రియలన్స్ జియో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలలో 5 డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా 10.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 77250 కోట్లు)ను సమకూర్చుకుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 5.7 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటాను సొంతం చేసుకోగా.. పలు పీఈ సంస్థలు సైతం స్వల్ప స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. ఫలితంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.15 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీంతో అల్ఫాబెట్, టెన్సెంట్, అలీబాబా వంటి దిగ్గజాలతో పోల్చవచ్చని పేర్కొంటున్నారు. రిటైల్ సైతం ఐదేళ్లలోగా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గతేడాది ఆగస్ట్‌లో పేర్కొన్నారు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా పలు విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకోనున్నట్లు తెలియజేశారు. కాగా.. దేశీ కంపెనీలు డైరెక్ట్‌గా విదేశాలలో లిస్టయ్యేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. తద్వారా దేశీ కంపెనీలకు విదేశీ నిధుల లభ్యతను పెంచేందుకు వీలు కలుగుతుందని వివరించింది. అయితే పన్ను సంబంధిత, విదేశీ మారక నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ భారం తగ్గింపు ఓవైపు రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా 10.3 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోవైపు రైట్స్ ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 53,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులలో అధిక శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2021 మార్చికల్లా రుణ రహిత కంపెనీగా నిలవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మరోసారి లాభదాయకమైన టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ముఖ్యంగా మొబైల్ చందాదారుల పరంగా ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించి రెండవ అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా టాప్‌ప్లేస్‌ను నిలబెట్టుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులుండగా, ఎయిర్టెల్ 320.38 మిలియన్ల యూజర్లను సాధించింది. వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు (శుక్రవారం) క్యూ1 (ఏప్రిల్-జూన్ త్రైమాసికం) ఫలితాలను ప్రకటించనుంది. బలమైన చందాదారులను తన ఖాతాలో వేసుకున్న జియో మెరుగైన ఆదాయాన్ని వెల్లడించనుందని భావిస్తున్నారు. అయితే 329 మిలియన్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ 119 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదిస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆశిస్తుండగా, ఆర్పూ(ఏఆర్పీయూ, వినియోగదారుకు సగటు ఆదాయం)125కు పడిపోతుందని భావిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో 111 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ రెవెన్యూని సాధించగా రూ. 840 కోట్ల లాభాలను సాదించింది. మార్చి చివరి నాటికి 306 మిలియన్ల చందాదారులున్నారు. -
జియో యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రపంచమంతా డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త ప్రోగ్రామ్‌ను ఆరంభించింది. డిజిటల్ లిటరసీ ఇనీషియేటివ్‌లో భాగంగా ‘డిజిటల్ ఉడాన్’ పేరుతో డిజిటల్ అవగాన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. డిజిటలైజేషన్ అవసరాలకనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై వినియోగదారులకు అవగాహన కల్పించనుంది. దేశ యువతకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గతంలో డిజిటల్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన జియో ఇంటర్నెట్ తొలి వినియోగదారులకోసం మొట్టమొదటిసారి ఇలాంటి చొరవ తీసుకోవడం విశేషం. ప్రధానంగా గ్రామీణ ప్రాంత యూజర్లపై కన్నేసిన జియో అక్కడ మరింత పాగా వేసేందుకు డిజిటల్ ఉడాన్‌ను తీసకొచ్చింది. జియో ఫోన్లో ఫేస్బుక్ వాడకం, ఇతర ఆప్‌ల వినియోగంతోపాటు ఇంటర్నెట్ భద్రతపై అవగాహనకు ఈ డిజిటల్ ఉడాన్ కార్యక్రమం ఉపయోగపడనుంది. అలాగే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేందుకు జియోఫోన్‌లో ఫేస్బుక్ ఉపయోగించడం లాంటివి నేర్పించనుంది. జియో యూజర్లకు ప్రతి శనివారం 10 ప్రాంతీయ భాషలలో ఆడియో-విజువల్ శిక్షణనిస్తుంది ఇందుకుగాను ఫేస్‌బుక్‌తో కలిసి డిజిటల్ ఉడాన్ కోసం ప్రత్యేక మాడ్యూల్స్‌ను రూపొందించింది రిలయన్స్ జియో 13 రాష్ట్రాలలో దాదాపు 200 ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కోట్లాదిమంది జియోఫోన్ వినియోగదారులనున ఇంటర్నెట్ వినియోగంలో మరింత పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో 7,000 స్థానాలకు చేరుకుంటుందని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. భారతీయుల్లో ఇంటర్నెట్ వాడకాన్ని విస్తృతం చేయడంతో పాటు డిజిటల్ విప్లవం ముందుకు సాగడంలో జియో కీలక పాత్ర పోషిస్తోందని ఫేస్బుక్ ఇండియా ఎండి అజిత్ మోహన్ వ్యాఖ్యానించారు. కాగా రిలయన్స్ జియో తన 4 జి నెట్‌వర్క్‌లో 280 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా గ్రామీణ చందాదారుల సంఖ్య 2018 లో 100.47 మిలియన్లుగా ఉంది. -
రిలయన్స్ జియో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: సంచలనాల టెలికాం సంస్థ మరో సంచలనానికి తీరతీసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 10 శాతం శాశ్వత ఉద్యోగుల తోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు 5 వేల మందిని తొలగించిందంటూ మీడియాలో పలు రిపోర్టులు వెలువడ్డాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు లాభాలను పెంచుకునేందుకుగాను 5వేలమంది ఉద్యోగులను ఉద్వాసన పలికింది. ప్రస్తుతం రిలయన్స్ జియోలో 50 వేలమంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పది శాతం అంటే 5 వేలమందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇందులో 500-600 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ముఖ్యంగా జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ వేలమంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించిందట. జియో పింక్ స్లిప్స్ సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్ వర్క్స్ విభాగాల్లోని ఉద్యోగులకు రిలయన్స్ జియో పింక్ స్లిప్స్ ఇచ్చింది. గత రెండేళ్లలో నిర్వహణ మార్జిన్లలో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే నియామకాల్లో తమ సంస్థ కీలకంగా ఉంటుందని, కాస్ట్ కటింగ్ అనే ప్రశ్నే లేదని జియో స్పందించిందని ఈటీ నౌ రిపోర్ట్ చేసింది. కాగా 2016లో టెలికాం మార్కెట్లో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో మూడేళ్లలోనే 30 కోట్ల యూజర్లకు చేరుకుంది. ప్రస్తుత యూజర్ల సంఖ్య 30.7 కోట్లు. యూజర్ బేస్ ప్రకారం 26 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. రెవెన్యూ మార్కెట్ షేర్ 31 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ జియో 126.2 కోట్ల లాభాన్ని గడించింది. అంతకుముందు క్వార్టర్లో రూ.131.7 కోట్లు గడించింది. -
జియోకు ట్రిపుల్ ధమాకా : గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (జియో) మూడు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ‘గోల్డన్ గ్లోబ్ టైగర్స్' మూడు అవార్డులను జియె గెలుచుకుంది. జియో, జియో కు చెందిన ప్రముఖ కార్యక్రమాలు భాతతీయ డిజిటల్ లైఫ్‌కు ప్రత్యేకమైన, అర్ధవంతమైన ప్రయోజనాలను చేకూర్చిందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో ప్రపంచంలో 300 మిలియన్ల మంది భారతీయులను కనెక్ట్ చేస్తూ మార్కెట్ లీడర్షిప్ అవార్డును దక్కించుకుంది. తాజా 4జీ ఎల్టీఈ టెక్నాలజీతో ప్రపంచంలోని అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్, దేశీయంగా అతిపెద్ద వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించామని జియో ప్రకటనలో తెలిపింది. రెండవది బెస్ట్ కాంపైన్ అవార్డును జియో క్రికెట్ క్రికెట్ ప్లే అలాంగ్ సొంతం చేసుకుంది. మూడవ అవార్డును ఇండియా స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్‌కే దక్కింది. అద్భుతమైన డేటా ప్రయోజనాలతో జియో ఫీచర్ ఫోన్ దేశంలో లక్షలాది మంది వినియోగదారులను ఆకట్టుకుందని జియో తెలిపింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ అవార్డ్స్-2019 అవార్డులను విజేతలకు అందించారు. మార్కెటింగ్, బ్రాండింగ్, సోషల్ ఇన్నోవేషన్ తదితర రంగాల్లో టైగర్స్‌గా నిలిచిన సంస్థలు, వ్యక్తులకు గోల్డెన్ గ్లోబ్ టైగర్స్ పురస్కారాలు అందజేస్తారు. -
జియో యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (జియో) తన యూజర్లకు మరో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. జియో యాప్ ద్వారా డిస్నీ కంటెంట్‌ను వీక్షించే సదవకాశాన్ని కలిగించింది. ఈ మేరకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని జియో డిస్నీ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం జియో యూజర్లు డిస్నీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సిండ్రిల్లా , స్లీపింగ్ బ్యూటీ, జంగిల్‌బుక్, ది లయన్ కింగ్ లాంటి క్లాసిక్‌లను ఇకపై జియో సినిమా యాప్ ద్వారా చూడొచ్చు. వీటితోపాటు మార్వెల్, పిక్సర్ ,స్టార్‌వార్స్ యానిమేషన్, సినిమాలు, ఇతర అంతర్జాతీయ, స్థానిక కంటెంట్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ది మాజికల్ వరల్డ్ ఆఫ్ డిస్న ఇక జియో సినిమాలో అంటూ యూజర్లకు శుభవార్త అందించింది జియో. తమ జియో సినిమా యాప్‌లో ఒక స్పెషల్ సెక్షన్ద్వారా డిస్నీ సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లను నిరంతరాయంగా వీక్షించవచ్చని జియో ఒక ప్రకటనలో తెలిపింది. డిస్నీ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించామనీ, ముఖ్యంగా జియో సినిమా యాప్ హోం పేజీలోనే డిస్నీని యాడ్ చేశామని వెల్లడించింది. -
ముఖేష్ మరో సంచలనం : జియోకాయిన్
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలనం సృష్టించబోతున్నారు. జియోకాయిన్ పేరుతో సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్లాన్ చేస్తోంది. 50 మంది యంగ్ సభ్యుల టీమ్‌తో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై జియో పనిచేస్తుందని లైవ్‌మింట్ రిపోర్టు చేసింది. దీనికి అధినేతగా ముఖేష్ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ సారథ్యం వ్యవహరిస్తున్నారని తెలిసింది. క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను ఈ టీమ్ పరిశీలిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బిట్‌కాయిన్ వంటి ఊహాజనితమైన వర్చ్యువల్ కరెన్సీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ వ్యాపారంపై కన్నేసినట్టు లైవ్‌మింట్ పేర్కొంది. బిట్‌కాయిన్ వంటి క్రిపోకరెన్సీలకు పోటీగా తన సొంత క్రిప్టోకరెన్సీ-జియోకాయిన్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టబుడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదని స్పష్టంచేశారు. -
కలిసిపోయిన అంబానీలు
-
కలిసిపోయిన అంబానీలు
సోదరుడు ముకేశ్ అంబానీతో ఉన్న విభేదాలను వదిలి బిలియనీర్ అనిల్ అంబానీ(57) ముందడుగు వేశారు. ముకేశ్ తాజా సంచలనం జియోతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను వర్చువల్ మెర్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలో షేర్ హోల్డర్లతో సమావేశమైన అనిల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ధీరూభాయ్ కలలను సాకారం చేసేందుకు తాము ఇద్దరు కలిసి శ్రమిస్తామని పేర్కొన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4జీ సేవలను మొదలుపెట్టిన మూడు నెలల్లోపు మిలియన్ వినియోగదారులు మార్క్ ను దాటినట్లు వెల్లడించారు. 2జీ, 3జీ, 4జీ సర్వీసులను అందించేందుకు కావలసిన స్పెక్ట్రమ్ తమ వద్ద ఉందని సమావేశంలో అనిల్ పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం.. జియో మొబైల్ స్పెక్ట్రమ్ ను రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ టవర్స్ ను జియో ఇన్ఫోకామ్ లు వినియోగించుకోనున్నాయి. ఈ ఒప్పందంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీగా(స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది)లాభపడనుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ పేరిట ఉన్న 75శాతం అప్పులను తీర్చేయాలనే యోచనలో ఉన్నట్లు అనిల్ చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఎయిర్ సెల్ తో విలీనం అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారత్ లోని 12 టెలికాం సర్కిల్స్ లో ముందుకు దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ముకేశ్ అంబానీని అనిల్ మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే.