జియో యూజర్లకు గుడ్‌ న్యూస్‌ | JioCinema ties up with Disney for content | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు గుడ్‌ న్యూస్‌

Published Fri, Dec 28 2018 5:17 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

JioCinema ties up with Disney for content  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (జియో) తన యూజర్లకు మరో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. జియో యాప్‌ ద్వారా డిస్నీ కంటెంట్‌ను  వీక్షించే సదవకాశాన్ని కలిగించింది. ఈ మేరకు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో డిస్నీ ఇండియాతో ఒక  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్‌ ప్రకారం జియో యూజర్లు డిస్నీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సిండ్రిల్లా , స్లీపింగ్‌ బ్యూటీ, జంగిల్‌బుక్‌, ది లయన్‌ కింగ్‌ లాంటి క్లాసిక్‌లను ఇకపై జియో సినిమా యాప్‌ ద్వారా  చూడొచ్చు.  వీటితోపాటు మార్వెల్, పిక్సర్ ,స్టార్‌వార్స్‌  యానిమేషన్, సినిమాలు, ఇతర అంతర్జాతీయ,  స్థానిక కంటెంట్‌ను కూడా ఎంజాయ్‌ చేయవచ్చు.

ది మాజికల్‌ వరల్డ్‌ ఆఫ్‌ డిస్న ఇక జియో సినిమాలో అంటూ యూజర్లకు శుభవార్త అందించింది జియో.  తమ జియో సినిమా యాప్‌లో ఒక స్పెషల్‌ సెక్షన్‌ద్వారా డిస్నీ సినిమాలు, యానిమేషన్‌ సిరీస్‌లను నిరంతరాయంగా వీక్షించవచ్చని జియో ఒక ప్రకటనలో తెలిపింది. డిస్నీ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించామనీ, ముఖ్యంగా జియో సినిమా యాప్‌ హోం పేజీలోనే డిస్నీని యాడ్‌ చేశామని వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement