సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో తాజా జియో ఫోన్ యూజర్లకోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.594, రూ.297 దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది.
ముకేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ కొత్త పథకాల ద్వారా జియో ఫోన్ వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. రూ 594 పథకం కింద, జియో ఫోన్ వినియోగదారులు 168 రోజులు (దాదాపు ఆరు నెలల) అన్‌లిమిటెడ్ కాలింగ్, అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. అలాగే జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ అందిస్తోంది. అయితే రోజుకు అపరిమిత హై స్పీడ్ డేటా 0.5జీబీ పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు కు తగ్గుతుందని జియో ప్రకటించింది. అలాగే నెలకు 300 ఎంఎంఎస్‌లు ఉచితం.
రూ. 297 ప్లాన్లో వినియోగదారులు నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లతో ఉచిత కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 0.5జీడీ డేటా పొందుతారు. ఈ పరిమితిని దాటినట్లయితే, వేగం 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు అంటే మొత్తం 3నెలలు.
Comments
Please login to add a commentAdd a comment