న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకు పోటీగా మరో స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దించింది. సెల్‌కాన్ భాగస్వామ్యంలో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను నేడు లాంచ్ చేసింది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' కార్యక్రమంలో భాగంగా సెల్‌కాన్ స్టార్ 4జీ ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సెల్‌కాన్ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్ విడుదల చేసిన డివైజ్‌ల్లో ఇది రెండవది. సెల్‌కాన్ స్టార్ 4జీ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర 2,999 రూపాయలు. అయితే రూ.1,249కే ఇది లభ్యమవుతోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి తొలుత రూ. 2749 డౌన్‌పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం 36 నెలల పాటు కచ్చితంగా రూ.169తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో 18 నెలల అనంతరం రూ.500 నగదు రీఫండ్ అవుతోంది. మరో వెయ్యి రూపాయలు 36 నెలల అనంతరం రీఫండ్ చేస్తారు. మొత్తంగా రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అన్ని దిగ్గజ మొబైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.
సెల్‌కాన్ స్టార్ 4జీ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు...
4 అంగుళాల టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
క్వాడ్-కోర్ ప్రాసెసర్
512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
1800 ఎంఏహెచ్ బ్యాటరీ
మై ఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ టీవీ యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయి
Comments
Please login to add a commentAdd a comment