ఎయిర్‌టెల్‌తో సెల్‌కాన్ భాగస్వామ్యం | Celkon-Airtel tie-up | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌తో సెల్‌కాన్ భాగస్వామ్యం

Published Tue, Aug 12 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఎయిర్‌టెల్‌తో సెల్‌కాన్ భాగస్వామ్యం

ఎయిర్‌టెల్‌తో సెల్‌కాన్ భాగస్వామ్యం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ మిలీనియం డాజిల్ క్యూ44ను సోమవారమిక్కడ ఆవిష్కరించింది. టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో డాజిల్ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 500 ఎంబీ చొప్పున రెండు నెలలు ఉచిత 3జీ డేటాను ఆఫర్ చేస్తోంది. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్, గెస్చర్ సెన్సార్, 3జీ వీడియో కాలింగ్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.

ధర రూ.6,499. వెనుకవైపు కవర్‌ను అల్యూమినియంతో తయారు చేశారు. గోల్డ్, సిల్వర్, గ్రే రంగుల్లో లభిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలను తలదన్నేలా దీనిని రూపొందించామని కంపెనీ చెబుతోంది. సెల్‌కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని, ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సేల్స్ హెడ్ శేఖర్ గావంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 వేటికవే ప్రత్యేకం..
 తేలికైన, పలుచని స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్శించామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. విడుదల చేస్తున్న ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకమైనదని చెప్పారు. ‘ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో రూ.2,999 ధరలో రూపొందించిన 3జీ ఫోన్ ఏ35కె మోడల్‌కు యూరప్ నుంచి కూడా ఆర్డర్లున్నాయి. ఒక లక్ష ఫోన్లు విక్రయించాం. మరో 2 లక్షల ఫోన్లకు ఆర్డర్లున్నాయి. ఇంత తక్కువ ధరలో ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో 3జీ ఫోన్ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని పేర్కొన్నారు. ఎంటీకే, స్పెక్ట్రమ్ కంపెనీల చిప్‌సెట్లతో అందుబాటు ధరలో ఫోన్లను విక్రయించేందుకు కంపెనీకి వీలైందని అన్నారు.

 ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి..
 సెల్‌కాన్ త్వరలో ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి అడుగు పెడుతోంది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7.9 మిల్లీమీటర్ల మందం, క్వాడ్‌కోర్ ఓఎస్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్‌తో రూపుదిద్దుకుంటోంది. ధర రూ.10 వేలలోపు ఉండొచ్చు. కిట్‌క్యాట్ ఓఎస్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో ట్యాబ్లెట్ పీసీ కూడా రానుంది. ప్రతి జిల్లా కేంద్రంలో స్మార్ట్ సర్వీస్ కేంద్రాలను సెల్‌కాన్ ఏర్పాటు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల సర్వీసింగ్‌తోపాటు కంపెనీ యాక్సెసరీస్ ఈ కేంద్రాల్లో లభిస్తాయి.

 ప్రభుత్వాలకు సరఫరా చేస్తాం...
 ట్యాబ్లెట్ పీసీలు కావాల్సిన ఫీచర్లతో రాష్ట్ర ప్రభుత్వాల విద్యా కార్యక్రమాలకు అతి తక్కువ ధరలో, నాణ్యమైన ట్యాబ్లెట్స్‌ను  సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సెల్‌కాన్ సీఎండీ వెల్లడించారు. అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాము నెలకొల్పుతామని, కేంద్రం విడుదల చే సే మొబైల్ పాలసీని బట్టి ప్లాంటు ఎక్కడ పెట్టేది నిర్ణయిస్తాం. మాతోపాటు ఇతర కంపెనీలనూ తీసుకొస్తాం’ అని అన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement