
జియోఫోన్.. అద్భుత ఫీచర్లు
న్యూఢిల్లీ: శుక్రవారం విడుదలైన జియోఫోన్ టెలికాం రంగంలో పెద్దకుదుపులనే తెచ్చింది. జియో వినయోగదారులందరికి ఫోన్ ఉచితంగా ఇస్తామంటూ ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. నామమాత్రపు రుసుముతో 36 నెలల తరువాత వాపసు ఇచ్చేలా కేవలం రూ.1500లకే అందిస్తామన్నారు. రూ.153లకే అన్‌లిమిటెడ్ డేటాను జియోఫోన్‌లకు అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ఫోన్ విషయానికి వస్తే ఫోన్‌లో పలు అద్భుతమైన ఫీచర్లు ఇందులో పొందు పరిచారు. వాయిస్ ఓవర్ టెక్నాలజీ(వీవోఎల్‌టీఈ)తో పనిచేసే విధంగా ఈ ఫీచర్ ఫోన్‌ను జియో రూపొందించింది. దీన్ని ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించింది.
ఫోన్ ఫీచర్స్:
► 2.4 అంగుళాల స్క్రీన్, ఆల్ఫాన్యూమరిక్ కీబోర్డుతో డిజైన్ చేశారు.
► దేశంలో 22 భాషలను సపోర్ట్ చేస్తుంది, వాయిస్ కమాండ్ ద్వారా పనిచేస్తుంది.
► జియో సినిమా యాప్‌లో సినిమాలు, టీవీ ఛానల్స్ ఫ్రీగా చూడవచ్చు
► కీపాడ్‌లో నెంబర్ 5లో అత్యవసర కాలింగ్ విధానాన్ని పొందు పరిచారు.
► నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు
► మెమోరీ కార్డు ద్వారా ఫోన్ మెమోరీ పెంచుకోవచ్చు.
► వీజీఏ కెమెరా ఏర్పాటు చేశారు.
► ఎఫ్‌ఎం రేడియో, ఆడియో ప్లేయర్ అప్లికేషన్లుకూడా ఉన్నాయి.
► ఇందులో బ్లూటూత్ టెక్నాలజీ 4.10 వెర్షన్ ఉపయోగించారు.
► డ్యూయెల్ సిమ్ సదుపాయం ఉంది. రెండు సిమ్‌స్లాట్‌లు వివోఎల్‌టీఈ ని సపోర్ట్ చేస్తాయి.